This Week OTT: బాహుబలి టు అవతార్ 3.. ఈ వారం ఓటీటీలో బొమ్మ దద్దరిల్లే 14 క్రేజీ రిలీజెస్.. ఈ సినిమాలను ఎందుకు చూడాలంటే?

This Week OTT: జూన్ చివరి వారంలో ఓటీటీ లవర్స్‌కు నెవర్ బిఫోర్ వినోదాల పండుగ వచ్చేసింది. గ్లోబల్ విజువల్ వండర్ ‘అవతార్ 3’, ఎస్.ఎస్.రాజమౌళి ‘బాహుబలి’ కొత్త ప్రాజెక్ట్‌తో పాటు ఏకంగా 14 క్రేజీ సినిమాలు/సిరీస్‌లు డిజిటల్ స్క్రీన్స్ పై దాడికి సిద్ధమయ్యాయి. మోస్ట్ అవేటెడ్ కంటెంట్ ఇన్-సైడ్ అనాలిసిస్ మీకోసం.

Published on: Jun 23, 2026, 11:36:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

This Week OTT: సినీ ప్రియులకు ఈ వారం ఓటీటీలో వినోదాల విందు సిద్ధమైంది. థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే, ఇటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు కూడా భారీ చిత్రాలు, క్రేజీ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ఎస్.ఎస్. రాజమౌళి 'బాహుబలి' ప్రపంచం నుంచి వస్తున్న సరికొత్త డాక్యుమెంటరీతో పాటు హాలీవుడ్ విజువల్ వండర్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' వరకు ఎన్నో ఆసక్తికరమైన సినిమాలు ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి.

ఈ వారం ఓటీటీ సినిమాలు (x)
ఈ వారం ఓటీటీ సినిమాలు (x)

అవతార్: ఫైర్ అండ్ యాష్ (Avatar: Fire and Ash) – JioHotstar

స్ట్రీమింగ్ డేట్: జూన్ 24

జేమ్స్ కెమెరాన్ సృష్టించిన పండోరా ప్రపంచంలోని సరికొత్త డార్క్ సైడ్‌ను ఈ థర్డ్ పార్ట్ లో చూపించారు. ఈసారి జేక్ ఫ్యామిలీ 'యాష్ పీపుల్' అనే అత్యంత క్రూరమైన నవి తెగతో తలపడుతుంది. థియేట్రికల్ మిస్ అయిన విజువల్ లవర్స్‌కు ఇదొక అల్టిమేట్ హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కానుంది.

బాహుబలి: ది టార్చ్ బేరర్ (Bahubali: The Torch Bearer) – Netflix

స్ట్రీమింగ్ డేట్: జూన్ 26

టాలీవుడ్ సత్తాను గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లిన రాజమౌళి 'బాహుబలి' ఫ్రాంచైజీ నుంచి వస్తున్న ఎక్స్‌క్లూజివ్ డాక్యుమెంటరీ ఇది. ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో మాహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన అన్‌టోల్డ్ సీక్రెట్స్, ఈ 'టార్చ్ బేరర్' అసలు ఎవరు అనే సస్పెన్స్ ఎలిమెంట్స్ హైలైట్ కానున్నాయి.

బ్లాస్ట్ (Blast) – Netflix

స్ట్రీమింగ్ డేట్: జూన్ 25

మాస్ యాక్షన్ థ్రిల్లర్ల కోసం వెతికే మాస్ ఆడియన్స్ కు పర్ఫెక్ట్ ఛాయిస్. కార్పొరేట్ కుట్రల నేపథ్యంలో సాగే ఈ హై-వోల్టేజ్ మార్షల్ ఆర్ట్స్ సినిమాలో అర్జున్ యాక్షన్ అదుర్స్ అనిపించేలా ఉంటుంది.

ముత్తాసి (Muttasi)– ZEE5

స్ట్రీమింగ్ డేట్: జూన్ 26

కేరళ-కర్ణాటక సరిహద్దు గ్రామంలో సాగే పక్కా లోకల్ మిస్టరీ థ్రిల్లర్. ఒక పాత ఇంట్లోకి మారిన తర్వాత బాలుడి వింత ప్రవర్తన వెనుక ఉన్న చీకటి రహస్యాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మలయాళ హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ది బెస్ట్ వీకెండ్ వాచ్.

లింగం (Lingam) –JioHotstar

స్ట్రీమింగ్ డేట్: జూన్ 26

కబడ్డీ క్రీడ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా. ఒక ఊహించని ఇన్సిడెంట్ వల్ల ఒక అథ్లెట్ లైఫ్ ఎలా చేంజ్ అయిందనే ఎమోషనల్ రైడ్ ఈ చిత్రం.

హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 (House of the Dragon S3) – JioHotstar

స్ట్రీమింగ్ డేట్: జూన్ 22

'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ప్రీక్వెల్ వెస్టెరోస్ ప్రపంచంలో ఐరన్ థ్రోన్ కోసం జరిగే నెత్తుటి టార్గారియన్ అంతర్యుద్ధం ఈ సీజన్‌లో పీక్స్‌కు చేరనుంది.

గ్రామ్ చికిత్సాలయం సీజన్ 2 (Gram Chikitsalay S2) – Prime Video

స్ట్రీమింగ్ డేట్: జూన్ 23

డాక్టర్ ప్రభాత్, డాక్టర్ గార్గిల కాంబినేషన్‌లో రూరల్ హెల్త్ సిస్టమ్, పల్లెటూరి పాలిటిక్స్ చుట్టూ సాగే బ్యూటిఫుల్ హ్యూమన్ డ్రామా.

ది బేర్ సీజన్ 5 (The Bear Season 5) – JioHotstar

స్ట్రీమింగ్ డేట్: జూన్ 26

మోస్ట్ పాపులర్ గ్లోబల్ సిరీస్ ఫైనల్ సీజన్. మిచేలిన్ స్టార్ కోసం రెస్టారెంట్ టీం పడే స్ట్రగుల్స్ ఈ చివరి భాగంలో చూడొచ్చు.

ఇవి కూడా

  • డియర్ కేరళ కుట్టి (ETV Win - జూన్ 25): ఇరు రాష్ట్రాల సరిహద్దుల మధ్య సాగే విభిన్న సంస్కృతుల క్రేజీ తెలుగు రోమ్-కామ్ సిరీస్. రీజినల్ వింటేజ్ వైబ్స్ ఇష్టపడే వారికి బెస్ట్ ఛాయిస్.
  • బ్రేక్‌ఫాస్ట్ (Prime Video - జూన్ 24): వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి కౌన్సిలింగ్ సెషన్స్‌కు వెళ్ళే దంపతుల కథతో సాగే తమిళ్ మెచ్యూర్డ్ రొమాంటిక్ డ్రామా.
  • కప్ (ManoramaMAX - జూన్ 25): బాడ్మింతన్ ప్లేయర్ కావాలనుకునే ఒక యువకుడి ఇన్స్పిరేషనల్ మలయాళ స్పోర్ట్స్ డ్రామా.
  • మమ్మాటియాన్ స్టార్స్ (ZEE5 - జూన్ 26): ధోని ఆటను చెన్నైలో చూడాలనుకునే ఫ్రెండ్స్ గ్యాంగ్ నకిలీ టికెట్ల స్కామ్‌లో ఇరుక్కుంటే ఏం జరిగిందనే ఫన్నీ తమిళ్ డ్రామా.
  • కుండల పురాణం (Saina Play - జూన్ 26): బావిలో పడ్డ ఒక జత చెవిపోగుల చుట్టూ ఊరంతా కొట్టుకునే అవుట్ అండ్ అవుట్ మలయాళ కామెడీ ఎంటర్‌టైనర్.
  • లిటిల్ బ్రదర్ (Netflix - జూన్ 26): హాలీవుడ్ స్టార్ జాన్ సినా, ఎరిక్ ఆండ్రూ నటించిన క్రేజీ అండ్ హిలేరియస్ వెస్ట్రన్ కామెడీ మూవీ.
  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More