OTT Romantic: ది బెస్ట్ 7 ఓటీటీ రొమాంటిక్ కాలేజీ లవ్ డ్రామాలు- తెలుగులో 2- వీకెండ్‌కు బెస్ట్! ఇవే ఎందుకు చూడాలంటే?
Best 7 OTT Romantic Drama Web Series To Watch: 8 రేటింగ్‌తో ట్రెండ్ అవుతున్న 'ఆఫ్ క్యాంపస్'లాగే కాలేజ్ లైఫ్, లవ్, రొమాన్స్‌తో సాగే ది బెస్ట్ 7 ఓటీటీ సిరీస్‌ల గురించి ఇక్కడ ఇచ్చాం. వాటిలో 2 తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆఫ్ క్యాంపస్‌తో పాటు చూడాల్సిన 7 సిరీస్‌లు ఏంటో లుక్కేద్దాం.
Best 7 OTT Romantic Drama Web Series To Watch: ఓటీటీ వేదికలపై రొమాంటిక్ డ్రామాలకు ఎప్పుడూ క్రేజ్ ఎక్కువే. అందులోనూ యువతను ఆకట్టుకునే కాలేజీ బ్యాక్‌డ్రాప్ ప్రేమకథలకైతే తిరుగుండదు. యూత్‌కు ఎంతో ఇష్టమైన ఓటీటీ జోనర్స్ ఇవి.

ఓటీటీలో ట్రెండింగ్
అందుకు ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ రిలీజ్ అయిన'ఆఫ్ క్యాంపస్' (Off Campus) సిరీస్ ఇందుకు పక్కా ఉదాహరణ. తెలుగు డిజిటల్ ఆడియన్స్‌ను సైతం ఈ ఇంగ్లీష్ ఓటీటీ సిరీస్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం చూడ్డానికి మాత్రమే కాకుండా, ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ సాగే ఫేక్ రిలేషన్‌షిప్ డ్రామాతో ఈ సిరీస్ ఓటీటీలో టాప్-10లో ట్రెండింగ్‌గా నిలిచింది.
"ఆఫ్ క్యాంపస్ సిరీస్ చూస్తున్నప్పుడు మన పాత కాలేజ్ రోజులు గుర్తొస్తాయి, అందుకే ఇది యూత్‌కు బాగా కనెక్ట్ అయింది" అని ప్రముఖ డిజిటల్ మీడియా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా ఈ ఓటీటీ సిరీస్‌కు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 8 రేటింగ్ ఉంది.
7 ఓటీటీ రొమాంటిక్ సిరీస్‌లు
అయితే, ఒకవేళ ఈ 'ఆఫ్ క్యాంపస్' నచ్చితే.. ఈ వీకెండ్‌లో బింజ్ వాచ్ చేయడానికి అలాంటి రొమాంటిక్, క్రేజీ లవ్, డ్రామా ఉన్న మరో బెస్ట్ 7 వెబ్ సిరీస్‌ల (అదనంగా ఆఫ్ క్యాంపస్ సిరీస్) జాబితాను ఇక్కడ ఇస్తున్నాం. వాటిలో రెండు తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి వాటన్నింటిని ఎంచక్కా వాచ్ చేసేయండి.
1. మ్యాక్స్‌టన్ హాల్ - ది వరల్డ్ బిట్వీన్ అస్ (Maxton Hall – The World Between Us)
ఓటీటీ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో (తెలుగు భాషలోనూ ఉంది)
ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.5/10
కథాంశం: రూబీ బెల్ అనే సాధారణ అమ్మాయికి ప్రతిష్టాత్మక మ్యాక్స్‌టన్ హాల్ స్కూల్లో స్కాలర్‌షిప్ వస్తుంది. కేవలం చదువుపైనే శ్రద్ధ పెట్టాలనుకున్న ఆమెకు, స్కూల్ మొదటి రోజే ఒక రిచ్ అబ్బాయికి సంబంధించిన పెద్ద రహస్యం తెలిసిపోతుంది. ఆ సీక్రెట్ బయటపడకుండా ఉండేందుకు ఆ అబ్బాయి చేసే ప్రయత్నాలు, వారిద్దరి మధ్య మొదలైన శత్రుత్వం చివరకు ప్రేమగా ఎలా మారింది? అనేదే ఈ కథ. కాలేజీ డ్రామా, రిచ్ వర్సెస్ పూర్ ఎమోషన్స్ ఇష్టపడేవారికి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్.
2. మై లైఫ్ విత్ వాల్టర్ బాయ్స్ (My Life with the Walter Boys)
ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
ఐఎమ్‌డీబీ రేటింగ్: 6.8/10
కథాంశం: ఒక ఊహించని ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన జాకీ, తన గార్డియన్ ఇంటికి మారాల్సి వస్తుంది. అయితే, ఆ ఇంట్లో అప్పటికే 9 మంది అబ్బాయిలు ఉంటారు. ఆ అబ్బాయిల మధ్య ఒకే ఒక్క అమ్మాయిగా జాకీ ఎదుర్కొన్న సవాళ్లు, ఆ తర్వాత ఆమె జీవితంలోకి వచ్చిన మార్పులతో ఈ ఓటీటీ సిరీస్ సాగుతుంది. హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఇందులో కనిపిస్తాయి.
3. ది సమ్మర్ ఐ టర్న్‌డ్ ప్రిటీ (The Summer I Turned Pretty)
ఓటీటీ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో (తెలుగులోనూ ఉంది)
ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.2/10
కథాంశం: ఇదొక అద్భుతమైన లవ్ ట్రయాంగిల్ స్టోరీ. ఒక అమ్మాయి, ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మొదటి ప్రేమ, బ్రేకప్స్, ఆ తర్వాత వచ్చే మానసిక సంఘర్షణను ఇందులో చాలా సహజంగా చూపించారు. ఈ సిరీస్ అద్భుతమైన ప్రజాదరణ పొందడంతో ఇప్పటికే మూడు సీజన్లు అందుబాటులోకి వచ్చాయి.
4. టెల్ మీ లైస్ (Tell Me Lies)
ఓటీటీ ప్లాట్‌ఫామ్: జియో హాట్‌స్టార్
ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.2/10
కథాంశం: లూసీ, స్టీఫెన్ అనే ఇద్దరి మధ్య సాగే ఎనిమిదేళ్ల సుదీర్ఘ ప్రేమ ప్రయాణమే ఈ సిరీస్. వారి రిలేషన్‌షిప్‌లో వచ్చే ఒడిదొడుకులు, గొడవలు కేవలం వారి జీవితాలనే కాకుండా చుట్టుపక్కల వారిని కూడా ఎలా ప్రభావితం చేశాయో ఇందులో చూడొచ్చు. కొంచెం ఇంటెన్స్ లవ్ డ్రామా ఇష్టపడే వారికి ఇది నచ్చుతుంది.
5. హీటెడ్ రైవల్రీ (Heated Rivalry)
ఓటీటీ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఐఎమ్‌డీబీ రేటింగ్: 8.7/10
కథాంశం: ఇదొక కెనడియన్ స్పోర్ట్స్ రొమాంటిక్ డ్రామా. రెండు ప్రత్యర్థి హాకీ జట్లకు చెందిన క్రీడాకారుల మధ్య ఉండే తీవ్రమైన పోటీ, ఆ తర్వాత వారి మధ్య చిగురించిన ప్రేమ చుట్టూ ఈ కథ నడుస్తుంది. 8.7 ఐఎమ్‌డీబీ రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ సిరీస్ హాలీవుడ్ లవ్ స్టోరీస్ ఇష్టపడే యువతను బాగా ఆకట్టుకుంటోంది.
6. ఎక్సో, కిట్టీ (XO, Kitty)
ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
ఐఎమ్‌డీబీ రేటింగ్: 6.6/10
కథాంశం: ఇతరుల ప్రేమకథలను కలిపే ఒక టీనేజ్ మ్యాచ్ మేకర్ అమ్మాయి కథ ఇది. తన లాంగ్ డిస్టెన్స్ బాయ్‌ఫ్రెండ్‌ను కలవడం కోసం ఆమె ఒక బోర్డింగ్ స్కూల్‌లో జాయిన్ అవుతుంది. విశేషం ఏంటంటే, గతంలో ఆమె చనిపోయిన తల్లి కూడా అదే స్కూల్లోనే చదువుకుంది. కొరియన్ డ్రామా (K-Drama) స్టైల్ ఇష్టపడే వారికి ఈ ఓటీటీ సిరీస్ ఒక మంచి ఎంటర్‌టైనర్.
7. ది సెక్స్ లైవ్స్ ఆఫ్ కాలేజ్ గర్ల్స్ (The Sex Lives of College Girls)
ఓటీటీ ప్లాట్‌ఫామ్: జియో హాట్‌స్టార్
ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.7/10
కథాంశం: ఒకే కాలేజీ రూమ్‌లో ఉండే నలుగురు 18 ఏళ్ల అమ్మాయిల జీవిత విశేషాలు ఇవి. కాలేజ్ లైఫ్‌లో వారు ఫేస్ చేసే ఫన్నీ సిట్యుయేషన్స్, రిలేషన్‌షిప్స్, ఫ్రెండ్‌షిప్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. బోల్డ్ అండ్ హిల్లేరియస్ కామెడీతో ఈ సిరీస్ సాగుతుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


