OTT Telugu: ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు..చిరంజీవి బ్లాక్ బస్టర్ నుంచి మైథలాజికల్ థ్రిల్లర్ వరకు.. వీకెండ్ కు బెస్ట్
ఈ వారం ఓటీటీలో తెలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు, థ్రిల్లర్లు అదరగొడుతున్నాయి. చిరంజీవి హీరోగా వచ్చిన సూపర్ హిట్ మన శంకర వర ప్రసాద్ గారు మూవీ నుంచి మైథలాజికల్ థ్రిల్లర్ వనవీర వరకు ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ పై లుక్కేయండి.
చిరంజీవి హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మన శంకర వర ప్రసాద్ గారు మూవీ నుంచి మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ వనవీర వరకు.. ఈ వీకెండ్ కు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు తెలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన తెలుగు మూవీస్ పై ఓ లుక్కేయండి.

మన శంకర వర ప్రసాద్ గారు ఓటీటీ
సంక్రాంతి 2026కు థియేటర్లలో అదరగొట్టిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన 24 గంటల్లోనే 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసింది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మన శంకర వర ప్రసాద్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కుటుంబంతో కలిసి ఓటీటీలో మూవీ చూడాలనుకునేవాళ్లకు ఈ సినిమా బెస్ట్ ఛాయిస్.
అనగనగా ఒక రాజు ఓటీటీ
నవీన్ పొలిశెట్టి కెరీర్ లోనే రూ.100 కోట్లు కొల్లగొట్టిన ఫస్ట్ మూవీ ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులో ఉంది. డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని సెట్ అవ్వాలనుకునే ఓ యువకుడికి ఎదురైన ట్విస్ట్ ఏంటీ అన్నది అనగనగా ఒక రాజు సినిమాలో చూడాల్సిందే.
వనవీర ఓటీటీ
ఈ వారం ఓటీటీలో ఆడియన్స్ కు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అందిస్తున్న మూవీ ‘వనవీర’. మైథలాజికల్ టచ్ తో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ అందుబాటులో ఉంది. వనవీర సినిమాలో అవినాష్, సిమ్రాన్ చౌదరి, నందు, శివాజీ రాజా, ఆమని, సత్య తదితరులు నటించారు.
వానాపురం అనే ఊర్లో మధ్య తరగతి ఫ్యామిలీకి చెందిన రఘుకు తండ్రి కొనిచ్చిన బైక్ అంటే ప్రాణం. ఆ ఊర్లోని రాజకీయ నాయకుడు దేవా ఎమ్మెల్యే కావాలని అనుకుంటాడు. ఎన్నికల ర్యాలీ కోసం రఘు బైక్ ను దేవా తీసుకెళ్తాడు. కానీ రఘు వెళ్లి అడిగినప్పుడు కులం పేరు చెప్పి దేవా అనుమానిస్తాడు. మరి ఆ తర్వాత రఘు ఏం చేశాడు? ఈ కథకు రామాయణంలోని కిష్కింధకాండకు ఉన్న సంబంధం ఏంటీ? అన్నది వానవీర మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
మరువతరమా ఓటీటీ
వాలెంటైన్స్ డే సందర్భంగా ఇవాళ (ఫిబ్రవరి 14) ఓటీటీలోకి వచ్చిన సినిమా మరువతరమా. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో హరీష్, విజయ్, అవంతిక, అతుల్య తదితరులు నటించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












