...
...
Next Story

OTT Releases: లాంగ్ వీకెండ్.. ఓటీటీలో పండగే.. ఈ వారం టాప్ 5 సినిమాలు చూశారా? ఒక్కో భాషలో ఒక్కోటి.. రొమాన్స్ టు మిస్టరీ!

OTT Releases: అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా హాలీ డే కావడంతో లాంగ్ వీకెండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ మూడు రోజుల వీకెండ్ లో ఓటీటీలో ఏం చూడాలా? అని సినీ లవర్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ల కోసం ఈ క్రేజీ లిస్ట్. ఈ వారం ఓటీటీలోకి వచ్చిన ఒక్కో భాషలోని టాప్ మూవీపై ఓ లుక్కేయండి.

Published on: Oct 2, 2026, 14:34:10 IST
Advertisement

OTT Releases: ఈ లాంగ్ వీకెండ్‌లో ఓటీటీ ఆడియన్స్ పూర్తిగా ఎంజాయ్ చేసేలా ప్రముఖ డిజిటల్ వేదికలు గ్రాండ్ లైనప్‌తో సిద్ధమయ్యాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల నుంచి 5 విభిన్నమైన, ఆకట్టుకునే టాప్ సినిమాలు ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. సస్పెన్స్ థ్రిల్లర్స్, స్పై యాక్షన్, ఫీల్-గుడ్ రోమ్‌కామ్‌లు, డార్క్ కామెడీ డ్రామాలతో ఉన్న ఈ సినిమాలపై ఓ లుక్కేయండి.

బెత్లెహెం కుటుంబ యూనిట్ – జియోహాట్‌స్టార్

లాంగ్ వీకెండ్.. ఓటీటీలో పండగే.. ఈ వారం టాప్ 5 సినిమాలు చూశారా? ఒక్కో భాషలో ఒక్కోటి.. రొమాన్స్ టు మిస్టరీ!
లాంగ్ వీకెండ్.. ఓటీటీలో పండగే.. ఈ వారం టాప్ 5 సినిమాలు చూశారా? ఒక్కో భాషలో ఒక్కోటి.. రొమాన్స్ టు మిస్టరీ!

నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మలయాళం రొమాంటిక్ డ్రామా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ రోజు (అక్టోబర్ 2) నుంచే ఈ మూవీ జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఐర్లాండ్‌లో చదువు ముగించుకుని స్వగ్రామం తిరిగొచ్చిన యాష్లే (మమితా బైజు).. తన పక్కింట్లో ఉండే జస్టిన్ (నివిన్ పౌలీ) అనే కేటరర్‌తో ప్రేమలో పడుతుంది. ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండటంతో వీళ్ల పెళ్లికి అడ్డంకులు వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది మూవీలో చూడాల్సిందే.

మహేంద్రగిరి వారాహి – ప్రైమ్ వీడియో

సుమంత్ హీరోగా నటించిన మరో మిస్టరీ థ్రిల్లర్ మహేందరగిరి వారాహి. ఇందులో ఐశ్వర్య రాజేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, సిద్ధు జొన్నలగడ్డ కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

మహేంద్రగిరి ప్రాంతంలోని ఒక పురాతన ఆలయం, వారాహి దేవి దివ్య శక్తులు, దాని వెనుక దాగి ఉన్న రహస్యాల చుట్టూ సాగే మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ఇది.

పూజ మేరీ జాన్ – జీ5

సూపర్ హిట్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్’ కు సీక్వెల్ గా వచ్చిన కార్తి తమిళ మూవీ ఇది. రా ఏజెంట్ విజయ్.. అంతర్జాతీయంగా బయో వెపన్ ముప్పు కలిగిస్తున్న 'బ్లాక్ డాగర్' (ఎస్.జే. సూర్య)ను అడ్డుకునే క్రమంలో తన తండ్రి, లెజెండరీ స్పై సర్దార్ గతాన్ని వెలికితీస్తాడు. హై-వోల్టేజ్ ఆపరేషన్లతో సాగే యాక్షన్ థ్రిల్లర్ ఇది.

మదర్ ప్రామిస్ – జీ5

బెంగళూరు క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డార్క్ కామెడీ గ్యాంగ్‌స్టర్ డ్రామానే మదర్ ప్రామిస్ మూవీ. బెట్టింగ్‌‌లో సర్వస్వం కోల్పోయిన హీరో.. అప్పులవాళ్ల భయంతో పారిపోతూ గ్యాంగ్‌స్టర్లు, స్మగ్లర్ల మధ్య చిక్కుకుపోతాడు. అదే సమయంలో అతని కోసం వెతుక్కుంటూ వచ్చే తల్లి, ఆమెకిచ్చిన మాట చుట్టూ ఎమోషనల్ అండ్ ఫన్నీ సంఘటనలతో ఈ చిత్రం సాగుతుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks