Thriller Web Series: ఇండియన్ ఓటీటీ చరిత్రలోనే సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టిన వెబ్ ఫ్రాంచైజ్ 'స్కామ్'. 2020లో వచ్చిన 'స్కామ్ 1992: ద హర్షద్ మెహతా స్టోరీ'తో దేశవ్యాప్తంగా విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ వెబ్ సిరీస్.. ఆ తర్వాత 'స్కామ్ 2003: ద తేల్గీ స్టోరీ'తో స్ట్రీమింగ్ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు ఈ పాపులర్ ఫ్రాంచైజ్ నుంచి మూడో చాప్టర్ 'స్కామ్ 2010: ద సుబ్రతా రాయ్ స్టోరీ' (Scam 2010) రూపంలో రాబోతోంది.

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ప్రముఖ డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony LIV), అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, బిర్లా స్టూడియోస్ సంయుక్తంగా 'స్కామ్ 2010' ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేశాయి. 'సహారా గ్రూప్' వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ (Subrata Roy) జీవితం, ఆయన చుట్టూ తిరిగిన వేల కోట్ల రూపాయల ఆర్థిక వివాదాల ఆధారంగా ఈ సిరీస్ రూపొందుతోంది. సిద్ధార్థ్ బొడ్కే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
టీజర్‌లో హర్షద్ మెహతా, తేల్గీ.. గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరో
తాజాగా విడుదలైన స్కామ్ 2010 టీజర్ నెటిజన్లను, ఓటీటీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టీజర్ ఆరంభంలో తొలి భాగం 'స్కామ్ 1992' హీరో హర్షద్ మెహతాగా నటించిన ప్రతీక్ గాంధీ (Pratik Gandhi) కనిపించగా, ఆ తర్వాత రెండో భాగం 'స్కామ్ 2003' లో అబ్దుల్ కరీమ్ తేల్గీ పాత్ర పోషించిన గగన్ దేవ్ రియార్ (Gagan Dev Riar) దర్శనమిచ్చారు. వీరిద్దరి ఘన విజయాన్ని గుర్తుచేస్తూ టీజర్ సాగింది.
చివరగా సూటు బూటు ధరించి లగ్జరీ హోటల్ కారిడార్‌లో నడుచుకుంటూ వెళ్తున్న నటుడు సిద్ధార్థ్ బొడ్కే (Siddharth Bodke) వచ్చారు. “ప్రజలకు మాపై అపారమైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయి.. మేము లక్షలాది మంది ప్రజలకు మద్దతుగా నిలిచే కొండంత అండ (సహారా)” అంటూ ఆయన చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.
సుబ్రతా రాయ్ బయోపిక్.. 'సహారా' ఇన్సైడ్ స్టోరీ
ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ తమాల్ బందోపాధ్యాయ రాసిన 'సహారా: ద అన్‌టోల్డ్ స్టోరీ' (Sahara: The Untold Story) అనే ప్రముఖ పుస్తకం ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ సిరీస్‌ను మలుస్తున్నారు.
{{/usCountry}}ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ తమాల్ బందోపాధ్యాయ రాసిన 'సహారా: ద అన్‌టోల్డ్ స్టోరీ' (Sahara: The Untold Story) అనే ప్రముఖ పుస్తకం ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ సిరీస్‌ను మలుస్తున్నారు.
{{/usCountry}}ఒక సాధారణ వ్యాపారిగా ప్రారంభమై వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించి, ఆపై సుప్రీంకోర్టు, సెబీ (SEBI) విచారణలో బిలియన్ డాలర్ల స్కామ్ ఆరోపణలు ఎదుర్కొని జైలుపాలైన సుబ్రతా రాయ్ జీవితంలో ఎవరికీ తెలియని సంచలనాత్మక కోణాలను ఈ సిరీస్‌లో ఆవిష్కరించబోతున్నారు.
ఎవరీ సిద్ధార్థ్ బొడ్కే?
సుబ్రతా రాయ్ లాంటి బలమైన, విలక్షణమైన పాత్రలో నటిస్తున్న సిద్ధార్థ్ బొడ్కే హిందీ, మరాఠీ చిత్రసీమలో తనదైన ముద్ర వేశారు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'దృశ్యం 2' (Drishyam 2)లో డేవిడ్ బ్రగాంజా పాత్రలో అద్భుత నటన కనబరిచిన సిద్ధార్థ్.. 'గుమ్ హై కిసీకే ప్యార్ మే' టీవీ సీరియల్‌లో జగ్తాప్ మానే పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇటీవల షాహిద్ కపూర్ 'దేవా' (Deva), ‘జెంఎన్‌యూ’, 'శ్రీదేవి ప్రసన్న' చిత్రాలలో కీలక పాత్రల్లో నటించారు.
ఈ భారీ ప్రాజెక్ట్‌లో నటించడంపై సిద్ధార్థ్ స్పందిస్తూ: "హన్సల్ మెహతా సర్ దర్శకత్వంలో 'స్కామ్ 2010' లో లీడ్ రోల్ చేయడం నా కెరీర్‌లోనే అత్యంత బాధ్యతాయుతమైన, ప్రత్యేకమైన అనుభవం. ఒక పబ్లిక్ ఫిగర్ వెనుక ఉన్న అసలు మనిషిని, ఆయన తీసుకున్న సంచలన నిర్ణయాలను ఆవిష్కరించేందుకు ఎంతో శ్రమించాను" అని వెల్లడించారు.
స్కామ్ 2010 స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
దిగ్గజ దర్శకుడు హన్సల్ మెహతా దర్శకత్వంలో అత్యున్నత నిర్మాణ విలువలతో రూపుదిద్దుకుంటున్న ఈ పీరియాడిక్ ఫైనాన్షియల్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ రాబోయే జనవరి 2027 లో సోనీ లివ్ (Sony LIV) ఓటీటీ వేదికగా ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.