...
...
Next Story

Netflix Release: ఇవాళ నెట్‌ఫ్లిక్స్ లో రెండు క్రేజీ రిలీజ్ లు.. సూపర్ హీరో సినిమా.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

Netflix Release: నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు ఫ్రైడే కంటే ముందే ఎంటర్ టైన్మెంట్ విందు అందనుంది. ఇవాళ ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి సూపర్ హీరో మూవీ ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ది హంటింగ్ వైవ్స్’ సీజన్ 2 వచ్చేశాయి. ఇంకెందుకు లేటు స్ట్రీమింగ్ షురూ చేసేయండి.

Published on: Nov 26, 2026, 11:52:53 IST
Advertisement

Netflix Release: గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఎప్పటికప్పుడూ కొత్త కంటెంట్ తో, డిఫరెంట్ సినిమాలతో ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. ఇంటర్నేషనల్ గా తన బ్రాండ్ ను పెంచుకుంటూనే పోతోంది. ఇదే క్రమంలో ఇవాళ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీతో పాటు ది హంటింగ్ వైవ్స్ సీజన్ 2ను తీసుకొచ్చింది.

స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే

ఇవాళ  నెట్‌ఫ్లిక్స్ లో రెండు క్రేజీ రిలీజ్ లు.. సూపర్ హీరో సినిమా.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఇవాళ నెట్‌ఫ్లిక్స్ లో రెండు క్రేజీ రిలీజ్ లు.. సూపర్ హీరో సినిమా.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

బాక్సాఫీస్ ను షేక్ చేసిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఎట్టకేలకు ఓటీటీ లవర్స్ అందరికీ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో స్పైడర్ మ్యాన్ మూవీ ఓటీటీ రిలీజైంది. కానీ ఈ రోజు (నవంబర్ 26) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో యూజర్లు అందరికీ ఈ బ్లాక్ బస్టర్ మూవీ అందుబాటులోకి వచ్చింది.

20 వేల కోట్లకు పైగా

స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించింది. ఏకంగా రూ.20 వేల కోట్లకు పైగా కలెక్షన్లను ఖాతాలో వేసుకుంది. ఇండియాలోనూ ఈ మూవీ దాదాపుగా రూ.600 కోట్లను సొంతం చేసుకుంది. ఇలాంటి క్రేజీ మూవీని ఈ రోజు నుంచి తెలుగులోనూ నెట్‌ఫ్లిక్స్ లో చూసేయొచ్చు.

స్టోరీ ఏంటంటే?

డాక్టర్ స్ట్రేంజ్ వేసిన మంత్రం వల్ల ప్రపంచమంతా పీటర్ పార్కర్ ను మర్చిపోయిన నాలుగేళ్ల తర్వాతి కథతో ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ సాగుతుంది. తన ఐడెంటిటీని దాచి న్యూయార్క్ నగరాన్ని కాపాడుతున్న స్పైడర్ మ్యాన్ శరీరంలో వింతైన మార్పులు చోటు చేసుకుంటాయి.

నెట్‌ఫ్లిక్స్ పాపులర్ వెబ్ సిరీస్ ‘ది హంటింగ్ వైవ్స్’ నుంచి సీజన్ 2 వచ్చేసింది. ఇదో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. రెబెక్కా కట్టర్ రూపొందించిన ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ గతేడాది రిలీజై సూపర్ క్రేజ్ దక్కించుకుంది.

రెండో సీజన్ లో ఏం జరుగుతుంది?

టెక్సాస్ లోని మేపుల్ బ్రూక్ సిటీలో ఉన్న రిచ్ పీపుల్ కు సంబంధించిన డార్క్ సీక్రెట్స్, రాజకీయాలు, క్రైమ్ నేపథ్యంలో ది హంటింగ్ వైవ్స్ సీజన్ 2 సాగుతుంది. ఫస్ట్ సీజన్ లాస్ట్ లో సోఫీ, మార్గోల మధ్య దూరం పెరుగుతుంది. కొత్త మర్డర్ మిస్టరీ ఎదురవడంతో వీళ్లు మళ్లీ కలవాల్సి వస్తుంది. మరి ఆ మర్డర్ ఎవరు చేశారు? ఆ రహస్యాలు ఏంటీ? అనేది సీజన్ 2లో చూడాల్సిందే.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks