ఓటీటీలో ఈ రోజు (జనవరి 30) కొత్త సినిమాలు, కొత్త సిరీస్ ల జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అదిరిపోయే సస్పెన్స్, ట్విస్ట్ లతో ఓ కొత్త వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరెక్కిన ఈ సిరీస్ పేరు దల్‌దల్. ఇందులో భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్ర పోషించింది. సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు ప్రయత్నించే పోలీస్ గా నటించింది.
దల్‌దల్ ఓటీటీ

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ రకం సినిమాలు, సిరీస్ లను ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు శుక్రవారం ఓటీటీలోకి వచ్చిన దల్‌దల్ వెబ్ సిరీస్ కూడా అలాంటిదే. ఇది సస్పెన్స్, ట్విస్ట్ లతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ రోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది రిలీజైంది. ఓటీటీలో ఆడియన్స్ కు థ్రిల్ పంచుతుంది.
దల్‌దల్ అంటే
వెబ్ సిరీస్ పేరు దల్‌దల్. ఇది డిఫరెంట్ గా ఉంది. దీని అర్థం ఊబి. ఊబిలో చిక్కుకుంటే ఎలా కిందకు వెళ్లిపోతామో ఈ వెబ్ సిరీస్ లో నేరస్థులను పట్టుకునే క్రమంలో హీరోయిన్ కూడా అలాంటి ఊబిలో చిక్కుకుంటుందని అర్థం. అందుకే ఈ సిరీస్ కు దల్‌దల్ అనే పేరు పెట్టారు. ఇందులో భూమి పెడ్నేకర్ హీరోయిన్ గా నటించింది.
7 ఎపిసోడ్లు
దల్‌దల్ వెబ్ సిరీస్ సీజన్ 1లో 7 ఎపిసోడ్లు ఇవాళ ఒక్కసారే స్ట్రీమింగ్ కు వచ్చాయి. హిందీలో తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగు, తమిళంలో కూడా అందుబాటులో ఉంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో భూమి పెడ్నేకర్, శాశ్వత్ ఛటర్జీ తదితరులు నటించారు. దీనికి అమృత్ రాజ్ చోప్రా డైరెక్టర్. ఈ సిరీస్‌ను విక్రమ్ మల్హోత్రా తన సొంత బ్యానర్ అబుండాంటియా ఎంటర్‌టైన్‌మెంట్ పై నిర్మించాడు.
దల్‌దల్ స్టోరీ
ముంబయి సిటీలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఇవి కాస్త వింతగా ఉంటాయి. ఈ సీరియల్ కిల్లర్ హత్యలు చేయడంతో పాటు కొన్ని ఆధారాలను కూడా వదిలిపెట్టి వెళ్తాడు. ఈ కేసును సాల్వ్ చేసేందుకు యంగ్ డీసీపీ రీటా ఫెరీరా (భూమి పెడ్నేకర్) రంగంలోకి దిగుతుంది.
{{/usCountry}}ముంబయి సిటీలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఇవి కాస్త వింతగా ఉంటాయి. ఈ సీరియల్ కిల్లర్ హత్యలు చేయడంతో పాటు కొన్ని ఆధారాలను కూడా వదిలిపెట్టి వెళ్తాడు. ఈ కేసును సాల్వ్ చేసేందుకు యంగ్ డీసీపీ రీటా ఫెరీరా (భూమి పెడ్నేకర్) రంగంలోకి దిగుతుంది.
{{/usCountry}}సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు రిటా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తోంది. అయితే ఈ క్రమంలో ఈ హత్యలకు, తన గతానికి ఏదో సంబంధం ఉందని తెలుస్తుంది. అంతే కాకుండా రీటాను తన తండ్రి మరణం, గతంలోని చేదు జ్ఞాపకాలు వెంటాడుతాయి. వీటి కారణంగా రీటా ఆందోళన చెందుతుంది.
మరి తన ఆందోళనలను, మానసిక పరిస్థితిని దాటి ఆ సీరియల్ కిల్లర్ ను రీటా పట్టుకుందా? ఆ కిల్లర్ ఎందుకు అంత క్రూరంగా హత్యలు చేశాడు? అన్నది దల్‌దల్ సిరీస్ లో చూడాల్సిందే.