సంక్రాంతి 2026కు థియేటర్లలో అదరగొట్టిన తెలుగు సినిమాల సందడి ఇక ఓటీటీలో షురూ అయింది. ముందుగా ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’ వచ్చేసింది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సూపర్ హిట్ సినిమా ఇవాళ (ఫిబ్రవరి 4) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
నారీ నారీ నడుమ మురారి ఓటీటీ

ఇద్దరు భామల మధ్యలో నలిగిపోయే బాయ్ ఫ్రెండ్ కథతో తెరకెక్కిన సినిమా నారీ నారీ నడుమ మురారి. ఇందులో శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలోకి వచ్చేసింది.
మూడు వారాల్లోనే
సంక్రాంతి 2026 బక్సాఫీస్ రేసులో లాస్ట్ గా రిలీజైన మూవీ నారీ నారీ నడుమ మురారి. ఇది జనవరి 14న సాయంత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ ఓటీటీలోకి మాత్రం మిగతా తెలుగు సంక్రాంతి 2026 సినిమాల కంటే ముందుగానే వచ్చేసింది. మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ సినిమాకు రామ్ అబ్బరాజు డైరెక్టర్.
బ్లాక్ బస్టర్
శర్వానంద్ కు మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అయింది. చాలా కాలం తర్వాత నారీ నారీ నడుమ మురారి మూవీతో అతను హిట్ అందుకున్నాడు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఫ్యామిలీతో మూవీ చూస్తూ కడుపుబ్బా నవ్వుకోవచ్చు.
నారీ నారీ నడుమ మురారి స్టోరీ
బీటెక్ తర్వాత ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తాడు గౌతమ్ (శర్వానంద్). తను పని చేసే కంపెనీలో సివిల్ ఇంజనీర్ నిత్య (సాక్షి వైద్య)ను ప్రేమిస్తాడు. ఇద్దరు కలిసి తమ ప్రేమను ఇంట్లోవాళ్లకు చెప్పి, ఒప్పిస్తారు. అతి కష్టం మీద ఓ కండిషన్‌తో నిత్య తండ్రి రామలింగం (సంపత్ రాజ్) ఒప్పుకుంటాడు.
{{/usCountry}}బీటెక్ తర్వాత ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తాడు గౌతమ్ (శర్వానంద్). తను పని చేసే కంపెనీలో సివిల్ ఇంజనీర్ నిత్య (సాక్షి వైద్య)ను ప్రేమిస్తాడు. ఇద్దరు కలిసి తమ ప్రేమను ఇంట్లోవాళ్లకు చెప్పి, ఒప్పిస్తారు. అతి కష్టం మీద ఓ కండిషన్‌తో నిత్య తండ్రి రామలింగం (సంపత్ రాజ్) ఒప్పుకుంటాడు.
{{/usCountry}}ప్రేమించిన అమ్మాయితో గౌతమ్ పెళ్లి జరుగుతుండగా.. మాజీ గర్ల్‌ఫ్రెండ్ దియా (సంయుక్త మీనన్) వచ్చి అడ్డుపడుతుంది. అలా గౌతమ్ పెళ్లికి అడ్డంకులు ఏర్పడతాయి.
ఆ తర్వాత ఏమైంది? అసలు గౌతమ్ పెళ్లికి దియా ఎందుకు అడ్డు పడింది? గౌతమ్ తండ్రి కార్తీక్ (వీకే నరేష్) లేటు వయసులో పల్లవి (సిరి హనుమంత్)ని పెళ్లి చేసుకోడానికి కారణం ఏంటీ? గౌతమ్ దియాకు ఎందుకు బ్రేకప్ అయింది? రామలింగం పెట్టిన కండిషన్ ఏంటీ? చివరికి నిత్యతో గౌతమ్ పెళ్లి జరిగిందా? లేదా? అనేది తెలియాలంటే నారీ నారీ నడుమ మురారి సినిమాను చూడాల్సిందే.