...
...
Next Story

సీఎంను కిడ్నాప్ చేసే కామ‌న‌ర్‌-ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన భా భా బా మలయాళం మూవీ- ప‌వ‌ర్‌ఫుల్ డాన్‌గా మోహ‌న్‌లాల్

ఇవాళ ఓటీటీలోకి మలయాళం యాక్షన్ కామెడీ థ్రిల్లర్ భా భా బా మూవీ వచ్చేసింది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పవర్ ఫుల్ డాన్ గా మెరిశారు. సీఎంను కామనర్ కిడ్నాప్ చేయడం అనే కథ చుట్టూ ఈ మూవీ సాగుతోంది.

Published on: Jan 16, 2026, 09:51:17 IST
Advertisement

వెరైటీ టైటిల్ తో తెరకెక్కిన మలయాళ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ‘భా భా బా’. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కామనర్ కిడ్నాప్ చేసే కథతో ఈ సినిమా వచ్చింది. ఇందులో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ పవర్ ఫుల్ డాన్ క్యారెక్టర్ ప్లే చేశాడు. ఈ సినిమా ఇవాళ (జనవరి 16) ఓటీటీలోకి వచ్చింది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.

భా భా బా ఓటీటీ

ఓటీటీలోకి భా భా బా మూవీ (x)
ఓటీటీలోకి భా భా బా మూవీ (x)

మలయాళ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ భా భా బా ఓటీటీలో అడుగుపెట్టింది. శుక్రవారం నుంచి జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ మూవీ కేవలం మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. ఇందులో దిలీప్ లీడ్ రోల్ ప్లే చేయగా, మోహన్ లాల్ పవర్ ఫుల్ డాన్ గా మెరిశారు.

థియేటర్లో ఇలా

భా భా బా సినిమా డిసెంబర్ 18, 2025న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 16, 2026 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ భా భా బా మూవీ బడ్జెట్ రూ.30 కోట్లు. దీనికి ప్రపంచవ్యాప్తంగా రూ.46.06 కోట్లు వచ్చాయి. ట్రేడ్ వర్గాల ప్రకారం చూస్తే, వసూళ్ల పరంగా భా భా బా మూవీ హిట్ గా నిలిచింది.

భా భా బా అంటే

డిఫరెంట్ టైటిల్ భా భా బాతో ఈ సినిమా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసింది. భా భా బా అంటే మలయాళంలో భయం, భక్త, బహుమానం అని అర్థం. ఈ సినిమాలో దిలీప్, మోహన్ లాల్ తో పాటు వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్, శరణ్య పొన్వన్నన్, బైజు సంతోష్ తదితరులు నటించారు. దీనికి ధనుష్ జేమ్స్ వర్గీస్ డైెరెక్టర్.

భా భా బా స్టోరీ

మరోవైపు సీఎం జోసెఫ్ కుమారుడు నోబుల్ జోసెఫ్ (వినీత్ శ్రీనివాసన్) ఎన్ఐఏ ఆఫీసర్. తండ్రిని రక్షించడానికి అతనే స్వయంగా రంగంలోకి దిగుతాడు. మరి రాడార్ ను అతను కనిపెట్టాడా? పవర్ ఫుల్ డాన్ గిల్లి బాలగా మోహన్ లాల్ ఆకట్టుకున్నాడా? అన్నది భా భా బా సినిమాలో చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe