Jagapathi Babu: సిల్వర్ స్క్రీన్ పై రౌద్రం చిందించే పవర్‌ఫుల్ విలన్‌గా, గంభీరమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలరించే సీనియర్ నటుడు జగపతి బాబు రియల్ లైఫ్‌లో చాలా కూల్‌గా ఉంటారు. తాజాగా తన పెద్ద కుమార్తెతో కలిసి కిచెన్‌లో సరదాగా గడిపిన ఒక క్యూట్ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
జగ్గూ భాయ్ చాక్లెట్ కుకీస్

తన పెద్ద కూతురితో కలిసి చాక్లెట్ చిప్ కుకీస్ (Chocolate Chip Cookies) తయారు చేస్తూ జగ్గుభాయ్ చేసిన అల్లరి ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
"మళ్లీ మళ్లీ చెప్తున్నా.. ఇది కూడా మా పెద్ద అమ్మాయి చెప్పినట్టు కాపీ పేస్ట్ చేసేశా!" అంటూ జగపతి బాబు పెట్టిన సరదా క్యాప్షన్ ప్రతీ ఒక్కరినీ నవ్విస్తోంది. కూతురు చెప్పిన ప్రతీ చిన్న సూచనను పాటిస్తూ ఆయన బేకింగ్ చేసిన తీరు ఎంతో ముచ్చటగా ఉంది.
ఈ వీడియో మొదట్లో జగ్గూ భాయ్ అన్న మాటలు కూడా ఫన్నీగా ఉన్నాయి. తన మొహం చూస్తే ఎవరో పగలగొట్టినట్లుగా ఉంది కానీ ఎవరూ పగలగొట్టలేదంటూ వీడియో మొదలుపెట్టారు.
రీల్ లైఫ్‌లో క్రూరమైన విలన్.. రియల్ లైఫ్‌లో లవింగ్ ఫాదర్
తెరపై 'లెజెండ్' సినిమాలో జితేంద్రగా, 'రంగస్థలం'లో ఫణీంద్ర భూపతిగా, 'సలార్'లో రాజమన్నార్‌గా గంభీరమైన విలనిజం పండించిన జగపతి బాబు.. ఇంట్లో మాత్రం చాలా సరదా మనిషి. ఆయన తన పిల్లల ముందు ఒక నటుడిగా కాకుండా కేవలం ఒక ప్రేమగల తండ్రిగానే ఉంటారు.
ఈ వీడియోలో ఆయన బాడీ లాంగ్వేజ్, ఆనందం చూసిన అభిమానులు "తెరపై అంత భయంకరంగా కనిపించే విలన్, ఇంట్లో ఇంత స్వీట్ నాన్నా!" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఫ్యామిలీ ప్రైవసీకి పెద్దపీట.. అరుదైన క్యూట్ మూమెంట్
{{/usCountry}}ఈ వీడియోలో ఆయన బాడీ లాంగ్వేజ్, ఆనందం చూసిన అభిమానులు "తెరపై అంత భయంకరంగా కనిపించే విలన్, ఇంట్లో ఇంత స్వీట్ నాన్నా!" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఫ్యామిలీ ప్రైవసీకి పెద్దపీట.. అరుదైన క్యూట్ మూమెంట్
{{/usCountry}}జగపతి బాబుకు ఇద్దరు కుమార్తెలు కాగా, ఆయన ఎప్పుడూ తన కుటుంబాన్ని సినీ గ్లామర్‌కు, పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంచుతారు. తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా పంచుకోని జగ్గుభాయ్.. ఇలా తన పెద్ద కుమార్తె మేఘనతో కలిసి ఉన్న అరుదైన క్షణాలను షేర్ చేయడంతో ఈ వీడియో నిమిషాల్లోనే వైరల్‌గా మారింది.
ఈ క్యూట్ బేకింగ్ వీడియోపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు లవ్ ఈమోజీలతో స్పందిస్తూ తమ ప్రేమాభిమానాలను తెలియజేస్తున్నారు.
పాన్ ఇండియా సినిమాలతో జగ్గుభాయ్ ఫుల్ బిజీ
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్‌ను ఏలిన జగపతి బాబు.. 'లెజెండ్' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ విలన్‌గా మారిపోయారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈమధ్యే పెద్ది మూవీలో కనిపించారు.
షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ దొరికిన సమయంలో కుటుంబంతో కలిసి ఇలాంటి తీపి జ్ఞాపకాలను క్రియేట్ చేసుకుంటూ తన ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటున్నారు.