Suhas Mandaadi Director: టాలీవుడ్ అన్నం పెట్టింది.. నీ రంగు చూడలేదు.. అక్కడ అలా చెబుతావా: సుహాస్‌పై ఫ్యాన్స్ ఫైర్

Suhas Mandaadi Director: సుహాస్ పై టాలీవుడ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తమిళ డైరెక్టర్ మతి మారన్ చేసిన కామెంట్స్ ను ఖండించకపోవడంపై వాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ సుహాస్ రంగు చూడలేదని, అతని టాలెంట్ చూశారని అంటున్నారు.

Published on: Sep 18, 2026, 16:42:49 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Suhas Mandaadi Director: తమిళ మూవీ 'మండాడి' (Mandaadi) సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ మతి మారన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలుగు నటుడు సుహాస్ స్వరాష్ట్రంలో అతని శరీర రంగు పరంగా బాడీ షేమింగ్, కలర్ కామెంట్స్ ఎదుర్కొన్నాడని, కోలీవుడ్ మాత్రమే అతన్ని గుండెలకు హత్తుకుందని డైరెక్టర్ కామెంట్స్ చేయడంపై తెలుగు ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Suhas Mandaadi Director: టాలీవుడ్ అన్నం పెట్టింది.. నీ రంగు చూడలేదు.. అక్కడ అలా చెబుతావా: సుహాస్‌పై ఫ్యాన్స్ ఫైర్
Suhas Mandaadi Director: టాలీవుడ్ అన్నం పెట్టింది.. నీ రంగు చూడలేదు.. అక్కడ అలా చెబుతావా: సుహాస్‌పై ఫ్యాన్స్ ఫైర్

అసలు 'మండాడి' ఈవెంట్‌లో ఏం జరిగింది?

సూరి ప్రధాన పాత్రలో, సుహాస్ కీలక పాత్రలో నటించిన తమిళ స్పోర్ట్స్ డ్రామా 'మండాడి' బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విజయోత్సవ సభలో మాట్లాడిన దర్శకుడు మతి మారన్.. సుహాస్ తన రంగు, సొంత రాష్ట్రంలో వచ్చిన కామెంట్స్ చూసి షూటింగ్ టైమ్‌లో చాలా బాధపడేవాడని చెప్పుకొచ్చారు.

"సుహాస్ తన శరీర రంగుపై వచ్చిన కామెంట్స్ కు బాధపడ్డాడు. కానీ తమిళనాడులో రంగు చూసి ఎవరినీ తక్కువ చేసి చూడరని, ప్రతి ఇంట్లో ఇప్పుడు సుహాస్ పేరు సట్టాపులి క్యారెక్టర్‌గా గుర్తుండిపోతుందని చెప్పాను" అని మతి మారన్ వ్యాఖ్యానించారు. డైరెక్టర్ ఈ మాటలు అంటున్న సమయంలో పక్కనే ఉన్న సుహాస్ నవ్వుతూ తల దించుకోవడం, నటుడు సూరి చప్పట్లు కొట్టడం నెటిజన్లకు అస్సలు నచ్చలేదు.

ఖండించకపోవడంపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం

డైరెక్టర్ మతి మారన్ చేసిన కామెంట్స్ వీడియో ఎక్స్ లో వైరల్ అవ్వగానే తెలుగు నెటిజన్లు, సుహాస్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడ్డారు. "షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి హీరోగా మారిన సుహాస్‌ను తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. ఇప్పటివరకు 10కి పైగా సినిమాల్లో హీరోగా అవకాశం ఇచ్చింది టాలీవుడే. మరి తమిళ వేదికపై తనను, తెలుగు ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడుతుంటే సుహాస్ ఎందుకు ఖండించలేదు?" అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

కొందరు ఫ్యాన్స్ అయితే "ఇకపై సుహాస్ సినిమాలు ఓటీటీలో కూడా చూడము" అని ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం సుహాస్‌కి మద్దతుగా నిలిచారు. వ్యక్తిగతంగా ఎవరికైనా బాడీ షేమింగ్ ఎదురైతే దాన్ని పంచుకోవడంలో తప్పు లేదని కామెంట్స్ చేస్తున్నారు.

సుహాస్ ఎమోషనల్ నోట్.. కానీ వివాదంపై సైలెన్స్

సోషల్ మీడియాలో ట్రోలింగ్ తీవ్రత పెరగడంతో నటుడు సుహాస్ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఆ తర్వాత హీరోగా మారిన తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.

"నన్ను ఆదరించి, ప్రోత్సహించిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరు నా పనిని చూసి నన్ను ఆదరించారు తప్ప వేరే ఏదీ చూడలేదు. నా ప్రయాణమే దానికి నిదర్శనం" అని రాసుకొచ్చారు. అయితే మతి మారన్ చేసిన కలర్ కామెంట్స్ వివాదం గురించి గానీ, టాలీవుడ్ ఆడియన్స్ గురించి గానీ ఆయన నేరుగా ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.

షార్ట్ ఫిలిమ్స్ నుంచి 'కలర్ ఫోటో', 'రైటర్ పద్మభూషణ్', 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు', 'ప్రసన్నవదనం', 'జనక అయితే గనక', 'హే బలవంత్' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సుహాస్.. ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారో వేచి చూడాల్సిందే.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More