Teja Sajja Revanth Reddy: సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, నేడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యువ కథానాయకుడు తేజ సజ్జా త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన వివాహానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా, తాజాగా ఆ వార్త నిజమేనని స్పష్టమైంది.

తన నిశ్చితార్థ వేడుకకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తేజ సజ్జా మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ముఖ్యమంత్రికి ప్రత్యేక ఆహ్వానం
హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తేజ సజ్జా, ఆయనకు బొకే అందించి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన నిశ్చితార్థ వేడుక ఆహ్వాన పత్రికను అందజేసి, వేడుకకు తప్పక హాజరుకావాలని కోరారు.
యంగ్ హీరోను ఎంతో ఆప్యాయంగా పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆయన నిశ్చితార్థానికి ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి పాన్ ఇండియా రేంజ్ వరకు..
తేజ సజ్జా టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త పరిచయం అక్కర్లేని పేరు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఇంద్ర', 'చూడాలని ఉంది' వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో బాలనటుడిగా తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానుల మనసులను గెలుచుకున్నారు.
కథానాయకుడిగా మారిన తర్వాత విలక్షణమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన జాంబి రెడ్డి ద్వారా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించి మెప్పించారు.
సంక్రాంతి కానుకగా వచ్చి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో తేజ సజ్జా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు.
తేజ సజ్జా నిశ్చితార్థం, రాబోయే సినిమాలు
{{/usCountry}}సంక్రాంతి కానుకగా వచ్చి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో తేజ సజ్జా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు.
తేజ సజ్జా నిశ్చితార్థం, రాబోయే సినిమాలు
{{/usCountry}}తేజ సజ్జా నిశ్చితార్థం అత్యంత ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్‌లో వైభవంగా జరగనుందని సమాచారం. నిశ్చితార్థం అనంతరం వివాహ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తనది పెద్దలు కుదిర్చిన సంబంధం అని గతంలోనే తేజ వెల్లడించారు. అమ్మాయికి సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. అయితే అమ్మాయి ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు.
ఇక చివరిగా మిరాయ్ లో కనిపించిన తేజ సజ్జా.. ఈ మధ్యే ప్రైమ్ వీడియోలో వచ్చిన ది ట్రైటర్స్ తెలుగు రియాల్టీ షోకి హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు జాంబి రెడ్డి 2తో రాబోతున్నాడు. ఈ సినిమా విజువల్స్ నెక్ట్స్ లెవెల్ అని ఈ మధ్యే అతడు వెల్లడించాడు.