Faria Abdullah Emotional Bonalu: హైదరాబాద్‌లోని మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా సందడి చేశారు. పక్కా తెలంగాణ అమ్మాయిలా అమ్మవారి దర్శనం చేసుకుని ఊరమాస్ డప్పు చప్పుళ్లకు క్రేజీ స్టెప్పులేస్తూ అభిమానులను ఖుషీ చేశారు. తెలంగాణ సంస్కృతిని చూసి తాను తీవ్ర భావోద్వేగానికి గురయ్యానని, ఇక్కడి ప్రజల ఆప్యాయత ప్రపంచంలో ఎక్కడా దొరకదని సంతోషం వ్యక్తం చేశారు.
మీరాలం మండి మహంకాళేశ్వర ఆలయంలో బోనాల సందడి

ఆషాఢ మాసం సందర్భంగా భాగ్యనగరంలో బోనాల పండుగ వాతావరణం అంబరాన్ని తాకింది. హైదరాబాద్ పాతబస్తీలోని ప్రసిద్ధ మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు ఫరియా అబ్దుల్లా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణంలో పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య ఫరియా ఊరమాస్ డాన్స్‌తో అదరగొట్టారు. స్థానిక మహిళలు, అభిమానులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరించారు. ప్రస్తుతం ఈ మాస్ డాన్స్ వీడియో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది.
"తెలంగాణ సంస్కృతి ఎంతో గొప్పది".. భావోద్వేగానికి గురైన ఫరియా
బోనాల వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఫరియా అబ్దుల్లా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. "తెలంగాణ ప్రజల హృదయాలు ఎంతో విశాలమైనవి. బయట నుంచి వచ్చే ప్రతి ఒక్కరినీ ఇక్కడి జనాలు తమ సొంత మనుషుల్లా ఆదరిస్తారు. ఇలాగే ఉండాలి" అని చెప్పారు.
ఎలాంటి భేషజాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పండుగలు జరుపుకోవడం నిజంగా అద్భుతమని కొనియాడారు. హైదరాబాద్ సంస్కృతిలో భాగం కావడం తనకెంతో గర్వంగా ఉందంటూ మనస్ఫూర్తిగా ప్రశంసలు కురిపించారు. ఇలా మాట్లాడుతూనే ఆమె కంటతడి పెట్టారు. ఆమె అలా ఎమోషనల్ అవడం చూసి అక్కడున్న వాళ్లంతా షాక్ తిన్నారు.
'చిట్టి' కేరెక్టర్ నుండి వర్సటైల్ యాక్టర్ వరకు..
{{/usCountry}}ఎలాంటి భేషజాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పండుగలు జరుపుకోవడం నిజంగా అద్భుతమని కొనియాడారు. హైదరాబాద్ సంస్కృతిలో భాగం కావడం తనకెంతో గర్వంగా ఉందంటూ మనస్ఫూర్తిగా ప్రశంసలు కురిపించారు. ఇలా మాట్లాడుతూనే ఆమె కంటతడి పెట్టారు. ఆమె అలా ఎమోషనల్ అవడం చూసి అక్కడున్న వాళ్లంతా షాక్ తిన్నారు.
'చిట్టి' కేరెక్టర్ నుండి వర్సటైల్ యాక్టర్ వరకు..
{{/usCountry}}'జాతి రత్నాలు' సినిమాలో 'చిట్టి' పాత్రతో టాలీవుడ్‌లో ఓవర్ నైట్ స్టార్‌డమ్ సంపాదించుకున్న ఫరియా అబ్దుల్లా.. తన యాక్టింగ్, డాన్స్ స్కిల్స్‌తో టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. కేవలం నటనలోనే కాకుండా వెస్ట్రన్, క్లాసికల్, మాస్ డాన్స్ ఫారమ్‌లలో ఆమెకు అద్భుతమైన ప్రవేశం ఉంది.
రీసెంట్‌గా గాయపడ్డ సింహం, 'మత్తు వదలరా 2', 'రావణాసుర', 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' లాంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ పొడుగుకాళ్ల సుందరి.. ప్రైవేట్ ఆల్బమ్స్ లోనూ తనదైన మార్క్ చూపించారు. ఇప్పుడు స్వయంగా బోనాల జాతరలో పాల్గొని మాస్ స్టెప్పులు వేయడంతో తెలంగాణ ఆడియన్స్ ఆమెపై మరింత అభిమానాన్ని చూపిస్తున్నారు.
ప్రస్తుతం ఫరియా చేసిన ఈ మాస్ డ్యాన్స్ క్లిప్స్ నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచాయి. నెటిజన్లు, ఫ్యాన్స్ ఈ వీడియోలను షేర్ చేస్తూ "మన హైదరాబాద్ పిల్ల.. రచ్చ లేపిందిగా!" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అలాగే తెలంగాణ కల్చర్ పట్ల ఆమె చూపిస్తున్న అభిమానానికి కూడా ఫిదా అవుతున్నారు.