...
...
Next Story

Heroine Pregnant: టాలీవుడ్ హీరోయిన్ ప్రెగ్నెంట్.. భర్తతో కలిసి బీచ్‌లో ఫొటో షూట్.. ఇద్దరం ముగ్గురం అవుతున్నామంటూ పోస్ట్

Heroine Pregnant: మలయాళ ముద్దుగుమ్మ, 'బిగిల్' ఫేమ్ రెబ్బా మౌనికా జాన్ త్వరలో తల్లి కాబోతున్నారు. భర్త జోమోన్ జోసెఫ్‌తో కలిసి ఈ సంతోషకరమైన వార్తను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Published on: Apr 30, 2026, 19:56:49 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Heroine Pregnant: దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రెబ్బా మౌనికా జాన్ ఇంట త్వరలో పండంటి బిడ్డ అడుగుపెట్టబోతున్నారు. విజయ్ సరసన 'బిగిల్' (తెలుగులో విజిల్‌), తెలుగులో సామజవరగమన లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ మలయాళ బ్యూటీ.. తాను గర్భవతి అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ శుభవార్త విన్న అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇద్దరం ముగ్గురం కాబోతున్నాం

Heroine Pregnant: టాలీవుడ్ హీరోయిన్ ప్రెగ్నెంట్.. భర్తతో కలిసి బీచ్‌లో ఫొటో షూట్.. ఇద్దరం ముగ్గురం అవుతున్నామంటూ పోస్ట్
Heroine Pregnant: టాలీవుడ్ హీరోయిన్ ప్రెగ్నెంట్.. భర్తతో కలిసి బీచ్‌లో ఫొటో షూట్.. ఇద్దరం ముగ్గురం అవుతున్నామంటూ పోస్ట్

థాయ్‌లాండ్‌లోని 'ది నాకా ఫుకెట్' రిసార్ట్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న రెబ్బా.. అక్కడ దిగిన కొన్ని అందమైన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

"మేము ఇద్దరం నుండి ముగ్గురం కాబోతున్నాం. హల్లెలూయ" అంటూ ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన భర్త జోమోన్ జోసెఫ్‌తో కలిసి ఉన్న ఈ ఫోటోల్లో రెబ్బా బేబీ బంప్‌తో ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. భగవంతుడు ప్రసాదించిన ఈ అద్భుతమైన కానుకకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ కొత్త ప్రయాణంలో అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలని ఆమె కోరారు.

కొత్త ప్రయాణం.. బోలెడంత ప్రేమ

"ఈ ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో మీ అందరి ఆశీస్సులు మాకు ఎంతో ముఖ్యం. కృతజ్ఞతతో కూడిన కొత్త ప్రారంభం ఇది. మా చుట్టూ కేవలం ప్రేమ మాత్రమే ఉంది" అని రెబ్బా ఎంతో భావోద్వేగంగా రాసుకొచ్చారు.

2022లో తన చిరకాల మిత్రుడు జోమోన్ జోసెఫ్‌ను వివాహం చేసుకున్న ఈ నటి.. అప్పటి నుండి తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.

కెరీర్ పరంగా చూస్తే రెబ్బా జాన్ మలయాళంతో పాటు తమిళం, కన్నడ, తెలుగు చిత్రాల్లోనూ నటించారు. తెలుగులో 'సామజవరగమన' వంటి హిట్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆమె గర్భవతి అనే వార్త తెలియగానే మలయాళ, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు ఆమె పోస్ట్‌కు కామెంట్లు చేస్తూ విష్ చేస్తున్నారు. ఈ సంతోషకరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

  1. నటి రెబ్బా మోనికా జాన్ ఏ చిత్రాల ద్వారా ప్రసిద్ధి చెందారు?

2. రెబ్బా మోనికా జాన్ భర్త ఎవరు?

ఆమె భర్త పేరు జోమోన్ జోసెఫ్. వీరిద్దరూ కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని 2022లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

3. రెబ్బా మోనికా జాన్ ప్రెగ్నెన్సీ వార్తను ఎక్కడ అనౌన్స్ చేశారు?

థాయ్‌లాండ్‌లో వెకేషన్‌లో ఉన్న సమయంలో తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks