Kavya Kalabhairava Engagement: ఈ ఏడాది చివరికి వచ్చేసరికి తెలుగు చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్ల వాతావరణం నెలకొంది. ప్రముఖ హీరోలు, దర్శకులు, సంగీత దర్శకుల కుటుంబాల్లో శుభకార్యాలు జరుగుతున్నాయి. వరుసగా ఎంగేజ్మెంట్లు, పెళ్లిళ్లతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సినీ తారల పెళ్లి వేడుకల ఫొటోలే వైరల్ అవుతున్నాయి.
సాయి ధరమ్ తేజ్ ఎంగేజ్మెంట్

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకొని అభిమానులకు తీపికబురు అందించారు. నవంబర్ 5న హైదరాబాద్‌లోని హిల్టన్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్ వేదికగా సాయి ధరమ్ తేజ్, కిరణ్మయిల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. తన చిన్ననాటి స్నేహితురాలైన కిరణ్మయితో ఆయన ఏడడుగులు వేయనున్నారు.
ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా, ఆద్య తదితర మెగా, అల్లు కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు. డిసెంబర్ 10వ తేదీన వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం.
హీరోయిన్‌తో కాలభైరవ నిశ్చితార్థం
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట కూడా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కీరవాణి పెద్ద కుమారుడు, ప్రముఖ సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కాళ భైరవ ఎంగేజ్‌మెంట్ 'బలగం', 'మసూద' సినిమాలతో మెప్పించిన హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్‌తో ఘనంగా జరిగింది.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి ఈ వేడుకకు అటెండ్ అయ్యి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీళ్ల ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరు కూడా డిసెంబర్‌లోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది.
తేజ సజ్జా కూడా
మరోవైపు 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా ఎంగేజ్మెంట్ కూడా త్వరలో జరగబోతోంది. అమెరికాలో సెటిల్ అయిన ఓ యువతితో ఆయన వివాహం జరగనున్నట్లు తెలిసింది. తన ఎంగేజ్మెంట్ వేడుకకు రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తేజ సజ్జా స్వయంగా ఆహ్వానించారు. ఈ డిసెంబర్ నెలలో రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా తేజ సజ్జా వివాహం జరగనుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
{{/usCountry}}మరోవైపు 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా ఎంగేజ్మెంట్ కూడా త్వరలో జరగబోతోంది. అమెరికాలో సెటిల్ అయిన ఓ యువతితో ఆయన వివాహం జరగనున్నట్లు తెలిసింది. తన ఎంగేజ్మెంట్ వేడుకకు రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తేజ సజ్జా స్వయంగా ఆహ్వానించారు. ఈ డిసెంబర్ నెలలో రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా తేజ సజ్జా వివాహం జరగనుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
{{/usCountry}}మొత్తానికి 2026 డిసెంబర్ నెల టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో ప్రత్యేకం కానుంది. వరుసగా సినీ తారల పెళ్లిళ్లతో అభిమానులకు పండుగ వాతావరణం రాబోతోంది. రాబోయే రోజుల్లో ఈ వేడుకలకు సంబంధించిన మరిన్ని ఫొటోలు, అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.