Sunil: ఆ డైరెక్టర్ ఫోన్ చేసి కామెడీ చేయకూడదన్నాడు.. దెబ్బకు నా జీవితం సర్‌ప్రైజ్ మోడ్‌లోకి.. సునీల్ కామెంట్లు వైరల్
Sunil: టాలీవుడ్ లో కమెడియన్ గా, హీరోగా సినీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాడు సునీల్. అయితే ఓ డైరెక్టర్ ఫోన్ చేసి కామెడీ చేయకూడదని చెప్పాడని సునీల్ తాజాగా వెల్లడించాడు. దెబ్బకు తన జీవితం సర్‌ప్రైజ్ మోడ్‌లోకి వెళ్లిపోయిందన్నాడు. వైరల్ గా మారిన సునీల్ కామెంట్లపై లుక్కేయండి.
Sunil: సునీల్.. ఈ పేరు విన్నా, అతని ముఖాన్ని తెరపై చూసినా వెంటనే తెలుగు ఆడియన్స్ కు నవ్వొస్తోంది. కమెడియన్ గా ఎన్నో ఐకానిక్ పాత్రలతో తెలుగు జనాలను నవ్వించాడు సునీల్. మధ్యలో హీరోగా మారిన అతను.. ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తున్నాడు. తాజాగా మలయాళ మూవీ కాటాలన్ లో ఓ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మూవీ ఈవెంట్ లో సునీల్ కామెంట్లు వైరల్ గా మారాయి.

పుష్ప ఛాన్స్
అప్పటివరకూ కమెడియన్, హీరోగా, ఇతర క్యారెక్టర్లు చేసిన సునీల్ పుష్ప మూవీలో మంగళం శ్రీను క్యారెక్టర్ తో తెగ పాపులర్ అయిపోయాడు. ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ లో అదరగొట్టాడు. అయితే పుష్పలో ఈ ఛాన్స్ రావడం గురించి సునీల్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. కాటాలన్ మూవీ సాంగ్ లాంఛ్ ఈవెంట్లో సునీల్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
సుకుమార్ ఫోన్
‘‘మీలో మంగళం శ్రీనును దర్శకుడు సుకుమార్ ఎలా చూశారు’’ అని ఓ విలేకరి సునీల్ ను ప్రశ్నించాడు. ‘‘నాకూ షాకే. డార్లింగ్ కామెడీ రోల్స్ కాకుండా వేరే క్యారెక్టర్లూ చేస్తున్నానని లాక్ డౌన్ లో సుకుమార్ కు చెప్పా. రెండు రోజుల్లో సుకుమార్ ఫోన్ చేసి ‘పుష్పలో విలన్ క్యారెక్టర్ కు నిన్ను అనుకుంటున్నా. పుల్ లెంగ్త్ విలన్. అందులో నువ్వు కామెడీ చేయకూడదు. బాడీ కూడా మూవ్ కాకూడదు. కళ్లు, ముఖంపై ఎక్స్ ప్రెషన్స్ పలికించాలి’ అని చెప్పాడు’’ అని సునీల్ వెల్లడించాడు.
లుక్ టెస్టు
‘‘పుష్పలో విలన్ క్యారెక్టర్ లుక్ టెస్ట్ కోసం కాస్ట్యూమ్స్ పంపారు. ఒక్కో డ్రెస్ లో ఒక్కోలా ఫొటోలు దిగి పంపించా. అలా మంగళం శ్రీను క్యారెక్టర్ కు ఎంపికయ్యా. ఈ మూవీ షూటింగ్ చేసినన్ని రోజులూ ఫోర్ హెడ్ షేవ్ చేసుకునేవాణ్ని’’ అని సునీల్ తెలిపాడు.
సర్ ప్రైజ్ మోడ్ లోకి
పుష్ప సినిమా తర్వాత తన జీవితమే మారిపోయిందని సునీల్ చెప్పాడు. ‘‘పుష్ప సినిమా తర్వాత నా జీవితం మారిపోయింది. సర్ ప్రైజ్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ఏ భాష నుంచి ఏ సినిమా ఆఫర్ వస్తుందో కూడా తెలియడం లేదు. అన్ని భాషల్లోనూ నటించే అవకాశం దక్కుతోంది’’ అని సునీల్ చెప్పుకొచ్చాడు.
సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 1, పుష్ప 2 చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇందులో మంగళం శ్రీనుగా సునీల్ తన వైవిధ్యమైన నటనతో సత్తాచాటాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


