Devi Sri Prasad: దేవిశ్రీని అవమానిస్తారా? మొన్న సుకుమార్.. ఇప్పుడు హరీష్ శంకర్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బీజీఎంను తమన్ అందిస్తున్నాడని మైత్రి మూవీస్ మేకర్స్ చేసిన అనౌన్స్ మెంట్ వివాదానికి దారితీసింది. దేవిశ్రీ ప్రసాద్ ను అవమానిస్తారా? అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ అందించారు. తన మ్యూజిక్ తో సినిమాలను నిలబెట్టారు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కు అవమానం జరిగిందంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎం విషయంలో తలెత్తిన కాంట్రవర్సీనే ఇందుకు కారణం.

ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎం
పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. మార్చి 26న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా రిలీజ్ కు కొద్ది రోజు సమయం మాత్రమే ఉండగా మూవీ బీజీఎం తమన్ అందిస్తున్నాడని మూవీ మేకర్స్ చేసిన అనౌన్స్ మెంట్ వివాదానికి దారితీసింది.
దేవిశ్రీ ప్రసాద్ ను కాదని
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఎప్పుడో అనౌన్స్ చేశారు. దేవి మ్యూజిక్ అందించిన పాటల్లో రెండు ఆల్రెడీ రెడీ అయ్యాయి. దేఖ్ లేంగే సాలా, ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్స్ వైరల్ గా మారాయి. కానీ ఇప్పుడేమో మూవీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం) కోసం దేవిశ్రీ ప్రసాద్ ను తప్పించి తమన్ ను తీసుకోవడం ఏంటీ అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఆ వీడియోలు
ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎం గురించి గతంలో దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన కామెంట్ల వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దేవిశ్రీ ప్రసాద్ ఫ్యాన్స్ వీటిని పోస్టు చేస్తున్నారు. బీజీఎం ఆల్మోస్ట్ అయిపోయిందని అన్నారని, మరి ఇప్పుడు తమన్ ను తీసుకోవడం ఏంటీ అని అడుగుతున్నారు.
దేవిశ్రీకి అవమానం
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ బీజీఎం అందించేందుకు తమన్ ను తీసుకోవడంతో దేవిశ్రీ ప్రసాద్ ను అవమానించారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ పై ఎందుకు ఇంత నెగెటివిటీ అని ప్రశ్నిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ వాల్యూ వీళ్లకు తెలియడం లేదని ఫైర్ అవుతున్నారు.
అప్పుడు పుష్ప 2
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ కూడా దేవి శ్రీ ప్రసాద్ పట్ల ఇలాగే వ్యవహరించాడని ఈ సందర్భంగా ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఆ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. కానీ బీజీఎం మాత్రం సీఎస్ శ్యాం ఇచ్చాడు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయంలోనూ దేవి శ్రీ ప్రసాద్ కు ఇలాగే జరిగింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


