Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్‌కు తమన్ బీజీఎం.. దేవిశ్రీ కేవలం పాటలకే పరిమితం.. కారణమేంటో వివరించిన మేకర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) మ్యూజిక్ విభాగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ (DSP) పాటలు అందిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) బాధ్యతలను మ్యూజిక్ సెన్సేషన్ తమన్‌కు అప్పగించారు.

Mar 4, 2026, 18:44:44 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన 'దేఖ్ లేంగే సాలా' (Dekh Lenge Saala), 'ఆరా ఆఫ్ ఉస్తాద్' (Aura of Ustaad) వంటి సాంగ్స్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో మూవీ టీమ్ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా కోసం బీజీఎంను తమన్ అందించనుండటం విశేషం. దీనికి కారణమేంటో వివరిస్తూ మేకర్స్ ఓ ట్వీట్ చేశారు.

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్‌కు తమన్ బీజీఎం.. దేవిశ్రీ కేవలం పాటలకే పరిమితం.. కారణమేంటో వివరించిన మేకర్స్
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్‌కు తమన్ బీజీఎం.. దేవిశ్రీ కేవలం పాటలకే పరిమితం.. కారణమేంటో వివరించిన మేకర్స్

తమన్ ఎందుకు వచ్చాడంటే?

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు సంబంధించి రీల్స్ పంపడంలో నిర్మాణ సంస్థ వైపు నుండి కొంత ఆలస్యం జరిగింది.

ఆ సమయంలో డీఎస్పీ తన ఇతర ప్రాజెక్టుల కమిట్‌మెంట్స్ కారణంగా ఈ సినిమాకు సమయం కేటాయించలేకపోయాడు. సినిమా విడుదల గడువును దృష్టిలో ఉంచుకుని, ఎటువంటి ఆలస్యం జరగకూడదనే ఉద్దేశంతో మూవీ టీమ్ పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే వివరణ ఇస్తూ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రకటన జారీ చేసింది.

మ్యూజికల్ కొలాబరేషన్

డీఎస్పీ పాటలు ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తుండగా, ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం మరో దిగ్గజ సంగీత దర్శకుడు తమన్‌ను రంగంలోకి దించారు. "ఈ ఇద్దరు అగ్ర సంగీత దర్శకుల కలయిక సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. డీఎస్పీ పాటలు మిమ్మల్ని డాన్స్ చేయిస్తే, తమన్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పిస్తారు" అని మైత్రీ మూవీ మేకర్స్ ధీమా వ్యక్తం చేసింది. ఇది కేవలం సినిమా ప్రయోజనం కోసం తీసుకున్న నిర్ణయమే తప్ప ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వివరాలు

హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మునుపటి కంటే మరింత పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఐనాంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

సోనీ మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలవుతుండగా, డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో శ్రీలీల ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల కాంబినేషన్ కుదురుతుండటంతో మెగా అభిమానులు ఈ సినిమాను ఒక గ్రాండ్ సెలబ్రేషన్ లా భావిస్తున్నారు. తమన్ గతేడాది పవన్ నటించిన ఓజీ మూవీకి మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఈ మూవీలోని పాటలు, బీజీఎంకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో అతడు ఏం చేస్తాడో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More