Valentines day : పవన్​ కళ్యాణ్​​ నుంచి రాజీవ్​ గాంధీ వరకు.. సరిహద్దులు దాటిన ప్రేమకథలు!

రాజీవ్ గాంధీ నుంచి పవన్ కళ్యాణ్ వరకు.. మన దేశంలోని అగ్రశ్రేణి నాయకులు విదేశీ మహిళలను ప్రేమ వివాహం చేసుకున్న సందర్భాలు అనేకం! ఈ వాలెంటైన్స్​ డే సందర్భంగా.. వారి పరిచయం, వివాహం వంటి అనేక వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 14, 2026 10:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రేమకు సరిహద్దులు లేవు! కులమతాలతో పనిలేదు! సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఈ విషయాన్ని నిరూపించిన వారెందరో ఉన్నారు. మరీ ముఖ్యంగా పలువురు భారత రాజకీయ నాయకులు.. విదేశీ వనితలను ప్రేమించి, వివాహం చేసుకుని, భిన్న సంస్కృతులను ఇండియాలో మమేకం చేశారు. ఈ వాలెంటైన్స్​ డే 2026 రోజున.. ప్రముఖ రాజకీయ నేతల ప్రేమకథల గురించి ఇక్కడ తెలుసుకోండి..

భార్యా అనాతో పవన్ కల్యాణ్..
భార్యా అనాతో పవన్ కల్యాణ్..

విదేశీయులను ప్రేమించిన భారత రాజకీయ నాయకులు..

1. రాజీవ్ గాంధీ - సోనియా గాంధీ

విదేశీ ‘ప్రేమ’ అంటే ముందుగా గుర్తొచ్చే జంట.. రాజీవ్​ గాంధీ- సోనియా గాంధీ! వీరిద్దరిది ఒక అద్భుతమైన ప్రేమకథ అని చెబుతుంటారు. భారత 6వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ రాజకీయ కుటుంబం నుంచి రాగా, సోనియా ఇటలీలోని రోమన్ కాథలిక్ కుటుంబానికి చెందినవారు.

పరిచయం: వీరిద్దరూ ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో చదువుకుంటున్నప్పుడు కలుసుకున్నారు. తొలిచూపులోనే రాజీవ్ ప్రేమలో పడ్డారని అంటూ ఉంటారు.

వివాహం: 1968లో వీరు వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సోనియా భారత్‌కు వచ్చి ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను పూర్తిగా అలవాటు చేసుకున్నారు. రాజీవ్ మరణానంతరం ఆమె కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు. దశాబ్దాల చరిత్రగల కాంగ్రెస్​ని ముందుండి నడిపించారు.

టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్- రష్యన్ నటి అనా లెజినోవాను ప్రేమ వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో అనా ఆయనకు తోడుగా నిలిచారని అంటూ ఉంటారు.

పరిచయం: 2011లో 'తీన్ మార్' సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం మొదలైంది.

వివాహం: 2013లో వీరు వివాహం చేసుకున్నారు. అనా లెజినోవా భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ పవన్ రాజకీయ ప్రస్థానంలో వెన్నంటి నిలుస్తున్నారు.

3. ఎస్ జైశంకర్ - క్యోకో

భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ సతీమణి క్యోకో జపాన్ మూలాలున్న మహిళ. జైశంకర్ మొదటి భార్య శోభ క్యాన్సర్‌తో మరణించిన తర్వాత ఆయన జీవితంలో క్యోకో ప్రవేశించారు.

పరిచయం: 1996 - 2000 మధ్య టోక్యోలోని భారత రాయబార కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు జైశంకర్‌కు క్యోకోతో పరిచయం ఏర్పడింది.

కుటుంబం: గత 25 ఏళ్లుగా వైవాహిక జీవితంలో ఉన్న ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు (ధృవ, అర్జున్, మేధ) ఉన్నారు.

వాలెంటైన్స్ డే 2026: ఫిబ్రవరి 14నే ప్రేమికుల రోజు ఎందుకు? దీని వెనుక ఉన్న ఆసక్తికర చరిత్ర, నేటి ట్రెండ్స్ ఇవే

4. శశి థరూర్ - క్రిస్టా గైల్స్

ప్రముఖ రచయిత, కాంగ్రెస్ నేత శశి థరూర్ తన రెండో వివాహాన్ని కెనడియన్ దౌత్యవేత్త క్రిస్టా గైల్స్‌తో చేసుకున్నారు.

వివాహ జీవితం: వీరి వివాహం 2007 నుంచి 2010 వరకు కొనసాగింది. అంతకుముందు ఆయన తిలోత్తమ ముఖర్జీని, క్రిస్టా తర్వాత సునంద పుష్కర్‌ను వివాహం చేసుకున్నారు.

5. ఫరూక్ అబ్దుల్లా - మోలీ

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా.. బ్రిటిష్ నర్సు అయిన మోలీని 1968లో వివాహం చేసుకున్నారు.

కుటుంబం: వీరికి నలుగురు సంతానం. కుమారుడు ఉమర్ అబ్దుల్లా కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కుమార్తెలు సాఫియా, హినా, సారా కూడా సుపరిచితులే.

ప్రశ్నలు- సమాధానాలు :-

ప్రశ్న:- నిజమైన ప్రేమ అంటే ఏంటి?

సమాధానం:- నిజమైన ప్రేమను నిర్వచించడం కష్టం, కానీ అనుభవించడం సులభం! చాలామంది ‘ప్రేమ’, ‘వ్యామోహం’ మధ్య అయోమయానికి గురవుతుంటారు. వ్యామోహం అనేది ఒక వ్యక్తి బాహ్య రూపం లేదా హోదాను చూసి కలిగే తాత్కాలిక ఆకర్షణ. అది మెరుపులా వచ్చి మాయమవుతుంది. కానీ నిజమైన ప్రేమ సూర్యోదయం లాంటిది.. నెమ్మదిగా మొదలై, జీవితాంతం వెలుగును ఇస్తుంది.

ప్రశ్న:- నిజమైన ప్రేమను ఎలా వెతకాలి?

సమాధానం:- ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, విలువలు కలుస్తున్నాయో చెక్​ చేసుకోండి, ఇంప్రెస్​ చేసేందుకు కష్టపడకుండా మీకు మీరులా ఉండండి, వినడం నేర్చుకోండి.