Venky Atluri: పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'కల్కి 2898 AD' సీక్వెల్ 'కల్కి 2' తో పాటు ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న 'స్పిరిట్' ప్రాజెక్ట్ నుంచి బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకోన్ తప్పుకోవడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద దుమారమే రేపింది. సౌత్ ఇండియన్ సినిమా వర్కింగ్ కండిషన్స్, సుదీర్ఘమైన షూటింగ్ అవర్స్‌కు అడ్జస్ట్ కాలేకపోవడం వల్లే ఆమె ఈ ప్రాజెక్ట్‌ల నుంచి బయటకు వచ్చిందనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వివాదంపై తాజాగా సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి స్పందించారు. బాలీవుడ్ నటీనటులు సౌత్ కల్చర్‌కు, వర్కింగ్ స్టాండర్డ్స్‌కు అలవాటు పడాల్సిందేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
"సౌత్‌కి వస్తే ఇక్కడి రూల్స్ పాటించాల్సిందే".. డైరెక్టర్ వెంకీ
తన కొత్త సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రమోషన్స్ సమయంలో ఈ విషయంపై మాట్లాడిన వెంకీ అట్లూరి చాలా స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. "నేను ఏదైనా హిందీ సినిమా చేయాల్సి వస్తే, ముందుగా అక్కడ ఉండే సంస్కృతి, వర్కింగ్ స్టాండర్డ్స్ పూర్తిగా నేర్చుకున్నాకే ప్రాజెక్ట్ మొదలుపెడతాను. అదే రీతిలో బాలీవుడ్ నుంచి ఏ నటుడు సౌత్‌కి వచ్చినా, ఇక్కడి పని వాతావరణానికి తగినట్లు తమను తాము మలుచుకోవాలి" అని ఆయన తెగేసి చెప్పారు.
సౌత్ ఇండస్ట్రీలో షూటింగ్స్ ఎంత కష్టంగా సాగుతాయో వివరిస్తూ.. "మేం సెట్స్‌పై రోజుకి 11 నుంచి 12 గంటలు నిరంతరాయంగా కష్టపడతాం. తమిళం, మలయాళం, లేదా హిందీ.. ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చినా ఇక్కడి వర్కింగ్ కండిషన్స్‌కి అనుగుణంగా మారడమే అసలైన ప్రొఫెషనిజం" అని వెంకీ అట్లూరి వివరించారు.
మారకపోతే ఇండస్ట్రీలో మనుగడ కష్టం
ఇతర భాషల నుంచి వచ్చే ఆర్టిస్టులు ఇక్కడి పద్ధతులకు సర్దుకుపోకుండా మొండిగా ఉంటే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించడం కష్టమని వెంకీ హెచ్చరించారు. బాలీవుడ్ వర్కింగ్ స్టైల్‌కి, టాలీవుడ్ లేదా కోలీవుడ్ వర్కింగ్ స్టైల్‌కి వ్యత్యాసం ఉంటుందని, దానికి గౌరవం ఇవ్వడం ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
{{/usCountry}}ఇతర భాషల నుంచి వచ్చే ఆర్టిస్టులు ఇక్కడి పద్ధతులకు సర్దుకుపోకుండా మొండిగా ఉంటే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించడం కష్టమని వెంకీ హెచ్చరించారు. బాలీవుడ్ వర్కింగ్ స్టైల్‌కి, టాలీవుడ్ లేదా కోలీవుడ్ వర్కింగ్ స్టైల్‌కి వ్యత్యాసం ఉంటుందని, దానికి గౌరవం ఇవ్వడం ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
{{/usCountry}}గతంలో 'సార్', రీసెంట్‌గా దుల్కర్ సల్మాన్‌తో 'లక్కీ భాస్కర్' లాంటి వరుస సూపర్ హిట్లతో ఫామ్‌లో ఉన్న వెంకీ అట్లూరి వ్యాఖ్యలకు సౌత్ సినీ వర్గాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది.
సూర్య కాంబోలో 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. ఆగస్టు 14న రిలీజ్
ఇక వెంకీ అట్లూరి ప్రస్తుతం వర్క్ చేస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజూ కథానాయికగా అలరించనుంది. యువ సంగీత తరంగం జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.
తమిళంలో నేరుగా చిత్రీకరించిన ఈ ఎమోషనల్ డ్రామాను తెలుగులోకి భారీ స్థాయిలో డబ్ చేస్తున్నారు. వచ్చే నెల ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.