Katrina Kaif In Spirit: ప్రభాస్ స్పిరిట్‌లో మరో బాలీవుడ్ బ్యూటీ.. కత్రినా కైఫ్ కమ్‌బ్యాక్.. అసలు నిజం ఇదే!
Katrina Kaif In Spirit: సందీప్ రెడ్డి వంగా-ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న 'స్పిరిట్'లో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ నటిస్తోందంటూ ప్రచారం జోరందుకుంది. ఈ మూవీతోనే కత్రినా కమ్ బ్యాక్ ఇవ్వబోతుందనే రూమర్లు వినిపిస్తున్నాయి. ఇందులో అసలు నిజమెంతో ఇక్కడ తెలుసుకోండి.
Katrina Kaif In Spirit: రెబల్ స్టార్ ప్రభాస్, 'యాంగ్రీ యంగ్ డైరెక్టర్' సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'స్పిరిట్' (Spirit). దీపికా పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనే వార్తల తర్వాత, ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా నటిస్తుందనే ప్రచారం జోరందుకుంది.

కత్రినా ఎంట్రీ వార్తల్లో నిజమెంత?
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ లో కత్రినా కైఫ్ కీ రోల్ ప్లే చేస్తుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బిడ్డను జన్మనిచ్చిన తర్వాత ఈ బాలీవుడ్ బ్యూటీ స్పిరిట్ మూవీతోనే కమ్ బ్యాక్ ఇవ్వబోతుందనే టాక్ వినిపించింది. అయితే ఇవన్నీ వట్టి పుకార్లు మాత్రమే అని తెలిసింది.
ఫ్యాక్ట్ చెక్
ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలో కత్రినా కైఫ్ నటిస్తోందంటూ వస్తున్న వార్తలను చిత్ర పరిశ్రమకు చెందిన విశ్వసనీయ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. "కత్రినా కైఫ్ యాక్టింగ్ రీ-ఎంట్రీ లేదా స్పిరిట్ ప్రాజెక్ట్‌కు సంబంధించి వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవి. ఎటువంటి ప్రామాణికత లేకుండా కేవలం ఊహాగానాలతో ఈ పుకార్లను సృష్టించారు" అని సదరు వర్గాలు హెచ్‌టీకి స్పష్టం చేశాయి.
రూమర్స్ ఎందుకు వైరల్ అయ్యాయి?
ఈ వార్త ఇంతలా వైరల్ కావడానికి ప్రధాన కారణం కత్రినా కైఫ్ టాలీవుడ్ రీ-ఎంట్రీ సెంటిమెంట్. 2004లో వెంకటేష్ సరసన 'మల్లీశ్వరి' చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన కత్రినా.. ఆ తర్వాత 2005లో బాలకృష్ణ సరసన 'అల్లరి పిడుగు'లో నటించింది.
దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత, అదీగాక మాతృత్వంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె మళ్లీ సౌత్ వైపు వస్తోందనగానే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. విక్కీ కౌశల్‌ను వివాహమాడిన కత్రినా ఇటీవలే కొడుకు విహాన్ కౌశల్‌కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
'స్పిరిట్' లేటెస్ట్ షూటింగ్ అప్‌డేట్
మరోవైపు 'స్పిరిట్' మూవీ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇటీవలే తెలుగు టాలెంట్స్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. "ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40% పూర్తయింది" అని కీలక అప్‌డేట్ ఇచ్చాడు.
టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ రఫ్ అండ్ రా పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. 'యానిమల్' బ్లాక్‌బస్టర్ తర్వాత సందీప్ నుంచి వస్తున్న ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


