Chitti babu Death: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌, నిర్మాత చిట్టిబాబు మృతి.. న‌టుడిగానూ 30 సినిమాలు

Chitti babu Death: టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన చిట్టి బాబు మరణించారు. ఆయన 30 సినిమాల్లో నటించారు. 

Published on: Apr 22, 2026, 09:28:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Chitti babu Death: దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా తెలుగు సినీ పరిశ్రమంలో తనదైన ముద్ర వేసిన చిట్టి బాబు మరణించారు. చిట్టి బాబు అలియాస్ త్రిపురనేని వరప్రసాద్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మృతి చెందారు. దీంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది.

చిట్టి బాబు (x)
చిట్టి బాబు (x)

చిట్టిబాబు మృతి

ప్రముఖ సీనియర్ దర్శక నిర్మాత, నటుడు, విశ్లేషకుడు చిట్టి బాబు ఇక లేరు. ఛాతి నొప్పి రావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పటిల్ కు మంగళవారం రాత్రి చిట్టి బాబును తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారనే విషయాన్ని డాక్టర్లు కన్ఫామ్ చేశారు. దీంతో చిట్టి బాబు మృతికి సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

తండ్రి రచయిత

చిట్టి బాబు తండ్రి త్రిపురణేని మహారథి ప్రముఖ రచయిత. చిట్టి బాబు కృష్ణా జిల్లాలోని కాజ గ్రామంలో పుట్టారు. సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చిట్టి బాబు పని చేశారు. ‘సంతానం’ సినిమాతో ఆయన డైరెక్టర్ గా డెబ్యూ చేశారు. 1984లో రిలీజైన ఈ మూవీ హిట్ గా నిలిచింది.

నటుడిగానూ

చిట్టి బాబు కేవలం డైరెక్షన్ తోనే ఆగిపోలేదు. నిర్మాతగా మారారు. నటుడిగా వేషాలు వేశారు. ప్రళయం, ప్రేమించి చూడు, నా పేరు దుర్గ, రైతు భారతం తదితర సినిమాలతో దర్శకుడిగా చిట్టి బాబు పేరు మార్మోగింది. మరోవైపు ‘గరుడా చలం’ మూవీతో అతని నట ప్రస్థానం మొదలైంది.

1976లో వచ్చిన ‘గరుడా చలం’ మొదలు.. చిట్టి బాబు తన నటన కొనసాగించారు. భైరవద్వీపం, దశావతారం, జాంబీ రెడ్డి, జాతి రత్నాలు తదితర సినిమాల్లో చిట్టి బాబు నటించారు. తన కెరీర్ లో 30 సినిమాల్లో ఆయన నటుడిగా చేశారు.

మల్టీ టాలెంటెడ్

చిట్టి బాబు మల్టీ టాలెంటెడ్. 12 సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. కొన్ని చిత్రాలను నిర్మించారు. 49 మూవీస్ కు కో డైరెక్టర్ గా పని చేశారు. 30 సినిమాల్లో నటించారు. సీనియర్ డైరెక్టర్, నిర్మాత, నటుడిగా టాలీవుడ్ లో చిట్టి బాబుకు మంచి పేరుంది. విశ్లేషకుడిగానూ ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.

రాజకీయాల్లో

సినిమా రంగంలో కొనసాగుతూనే చిట్టి బాబు రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. ఫస్ట్ జనతా పార్టీలో చేరిన ఆయన , ఆ తర్వాత బీజీపీలోకి వెళ్లారు. మూవీ విశ్లేషణలు, రాజకీయ ఆరోపణలతో చిట్టి బాబు వార్తల్లో కొనసాగుతూ వచ్చారు. అవసరమైన చోట తన గళాన్ని బలంగా వినిపించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More