...
...
Next Story

Miss Kalika Missing: వినూత్నమైన కథతో సస్పెన్స్ థ్రిల్లర్ మిస్ కాళికా మిస్సింగ్- మునుపెన్నడు చూడని స్క్రీన్ ప్లే- రిలీజ్?

Miss Kalika Missing Movie Post Production Completed: వినీత్ చంద్ర, డాలీషా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తెలుగు సస్పెన్స్ ఎంటర్‌టైనర్ 'మిస్ కాళికా మిస్సింగ్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. వినూత్నమైన కథాంశం, మునుపెన్నడు చూడని స్క్రీన్ ప్లేతో సాగే మిస్ కాళికా మిస్సింగ్ రిలీజ్‌‌ను ప్రకటించారు.

Published on: Sep 22, 2026, 16:17:11 IST
Advertisement

Miss Kalika Missing Movie Post Production Completed: టాలీవుడ్‌లో కొత్త తరహా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. వినూత్నమైన కథాంశంతో, ఉత్కంఠ రేకెత్తించే సీన్లతో వచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. అదే బాటలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది ‘మిస్ కాళికా మిస్సింగ్’ చిత్రం.

మిస్ కాళికా మిస్సింగ్ నిర్మాతలు, డైరెక్టర్

వినూత్నమైన కథతో సస్పెన్స్ థ్రిల్లర్ మిస్ కాళికా మిస్సింగ్- మునుపెన్నడు చూడని స్క్రీన్ ప్లే- రిలీజ్?
వినూత్నమైన కథతో సస్పెన్స్ థ్రిల్లర్ మిస్ కాళికా మిస్సింగ్- మునుపెన్నడు చూడని స్క్రీన్ ప్లే- రిలీజ్?

జె ఎస్ వి వి ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా మిస్ కాళికా మిస్సింగ్ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా మిస్ కాళికా మిస్సింగ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకుంది. సత్య ధనేకుల దర్శకత్వంలో తెరకెక్కిన మిస్ కాళికా మిస్సింగ్ చిత్రానికి రామకృష్ణ, పదిమల యమున నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఆకట్టుకునే నయా కాన్సెప్ట్

అయితే, మిస్ కాళికా మిస్సింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన సందర్భంగా చిత్ర నిర్మాతలు సినిమా విశేషాలను పంచుకున్నారు. "మా చిత్రం పూర్తి సస్పెన్స్, ఎంటర్టైన్మెంట్ మేళవింపుతో సాగుతుంది. మునుపెన్నడూ చూడని రీతిలో స్క్రీన్ ప్లే ఉంటుంది. సంగీతం ఈ సినిమాకు డెఫినెట్‌గా మంచి మార్కులు తెచ్చిపెడుతుంది" అని నిర్మాతలు తెలిపారు.

అక్టోబర్ నెలలో మిస్ కాళికా మిస్సింగ్ రిలీజ్

ప్రస్తుతం అన్ని పనులు పూర్తి కావడంతో, ఈ మిస్ కాళికా మిస్సింగ్ చిత్రాన్ని అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకనిర్మాతలు తాజాగా వెల్లడించారు.

భారీ తారాగణం..

ఇకపోతే మిస్ కాళికా మిస్సింగ్ చిత్రంలో వినీత్ చంద్ర, డాలీషా హీరో హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. వీళ్లతో పాటు సీనియర్ నటీనటులు ఎస్తేర్, అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, అలీ, జ్యోతి, నాగ మహేష్, గుండు సుదర్శన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.

బలమైన సాంకేతిక బృందం

Q1: 'మిస్ కాళికా మిస్సింగ్' సినిమా ఎప్పుడు విడుదల కానుంది?

A1: ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Q2: ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాతలు ఎవరు?

A2: సత్య ధనేకుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామకృష్ణ, పదిమల యమున నిర్మించారు.

Q3: 'మిస్ కాళికా మిస్సింగ్' సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరు?

A3: ఈ చిత్రంలో వినీత్ చంద్ర, డాలీషా జంటగా నటించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks