మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ చేతులు కలిపారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి, నయనతార నటిస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీలో వెంకీ స్పెషల్ అప్పియరెన్స్ ఆసక్తి రేపుతోంది. తాజాగా అతడు షూటింగ్ లో చేరిన వీడియోను చిరు తన ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు.
చిరు, వెంకీ చేతులు కలిపారు

టాలీవుడ్ లో కొన్ని దశాబ్దాలుగా ఎన్నో హిట్ సినిమాలను అందించిన హీరోలు చిరంజీవి, వెంకటేశ్. ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. అది కూడా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ కోసం కావడం విశేషం. కొన్నాళ్ల కిందటి నుంచీ ఈ సినిమాలో వెంకీ ఓ ఎక్స్‌టెండెడ్ క్యామియో రోల్ పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా మూవీ టీమ్ అధికారికంగా ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది.
ఓ వీడియో ద్వారా ఈ విషయం తెలపగా.. దానిని మెగాస్టార్ చిరంజీవి తన ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు. తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి ఈ ఇద్దరూ కలిసి సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నారంటూ ఈ వీడియోను తీసుకొచ్చారు. “మా బ్రదర్ విక్టరీ వెంకటేశ్ కు మన శంకర వర ప్రసాద్ గారు ఫ్యామిలీలోకి స్వాగతం. ఈ ఆనందాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి సెలబ్రేట్ చేసుకుందాం” అనే క్యాప్షన్ తో చిరు పంచుకున్నాడు. ఈ వీడియోలో మై బ్రదర్ వెంకీ అని చిరంజీవి అనగా.. మై బాస్ చిరు సర్ అంటూ అతన్ని కౌగిలించుకున్నాడు వెంకటేశ్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
మన శంకర వర ప్రసాద్ గారు గురించి..
మెగాస్టార్ చిరంజీవి, నయనతార కాంబినేషన్ లో వస్తున్న మరో మూవీ ఈ మన శంకర వర ప్రసాద్ గారు. ఇప్పటి వరకూ అపజయం ఎరగని దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన అనిల్.. వచ్చే సంక్రాంతికి మరో మ్యాజిక్ సిద్ధం చేస్తున్నాడు.
{{/usCountry}}మెగాస్టార్ చిరంజీవి, నయనతార కాంబినేషన్ లో వస్తున్న మరో మూవీ ఈ మన శంకర వర ప్రసాద్ గారు. ఇప్పటి వరకూ అపజయం ఎరగని దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన అనిల్.. వచ్చే సంక్రాంతికి మరో మ్యాజిక్ సిద్ధం చేస్తున్నాడు.
{{/usCountry}}ఆ సంక్రాంతికి వస్తున్నాంలో లీడ్ రోల్ పోషించిన వెంకీ మామ.. ఇప్పుడీ మూవీలోనూ అతిథి పాత్రలో కనిపించనుండటంతో వచ్చే సంక్రాంతికి డబుల్ డోసు గ్యారెంటీ. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరు, వెంకీ కాంబినేషన్.. నయనతార అందం ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి.