Vivek Chepuri Hero Debut: విలన్ నుంచి హీరోగా! ద్విభాషా చిత్రంతో ఎంట్రీ ఇస్తున్న విశ్వక్ సేన్ కల్ట్ యాక్టర్ వివేక్ చేపూరి
Villain Vivek Chepuri Hero Debut Movie: 'ఫలక్‌నుమా దాస్', 'కల్ట్' సినిమాల్లో విలనిజంతో మెప్పించిన హైదరాబాద్ కుర్రాడు వివేక్ చేపూరి ఇప్పుడు హీరోగా అవతారమెత్తుతున్నాడు. టి. శరత్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలుగు, తమిళ ద్విభాషా సినిమాతో తన జీవితంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు.
Villain Vivek Chepuri Hero Debut Movie: హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్‌లోని పి అండ్ టి కాలనీకి చెందిన కుర్రాడు వివేక్ చేపూరి. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

ఫలక్‌నుమా దాస్ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో
2019లో వచ్చిన 'ఫలక్‌నుమా దాస్' సినిమాలో రవి అనే పాత్రలో నెగెటివ్ షేడ్స్ పండిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మాస్ కథనంతో రూపుదిద్దుకున్న ఆ చిత్రంలో హీరో విశ్వక్ సేన్‌కి ధీటుగా నిలిచి ప్రతిభ నిరూపించుకున్నాడు. విలన్‌గా అవకాశాలు వెల్లువెత్తినా తొందరపడకుండా, మంచి పాత్రల కోసం ఓపికగా ఎదురుచూసే దారి ఎంచుకున్నాడు.
'కల్ట్' మూవీతో సరికొత్త సంచలనం
సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ విశ్వక్ సేన్ నిర్మాణంలో వచ్చిన 'కల్ట్' చిత్రం వివేక్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో 'ఇషాన్' అనే విలక్షణమైన, భయాందోళనకు గురిచేసే పాత్రలో వివేక్ జీవించాడు. యువతను ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్, డార్క్ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకున్న 'కల్ట్' సినిమాలో ఇషాన్ పాత్ర తెచ్చిన ఇంటెన్స్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.
రకరకాల వీడియో ఎడిట్స్, రీల్స్ వైరల్
ఈ పాత్రకు సంబంధించిన రకరకాల వీడియో ఎడిట్స్, రీల్స్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. విశ్వక్ సేన్ కొత్త నటీనటులకు, స్థానిక ప్రతిభకు ఎప్పుడూ పెద్దపీట వేస్తారనే పేరుంది. 'ఫలక్‌నుమా దాస్' నుంచి 'కల్ట్' వరకు వివేక్ లోని నటనా సామర్థ్యాన్ని విశ్వక్ సేన్ సరైన రీతిలో వాడుకున్నారు.
విలన్ నుంచి హీరోగా గ్రాండ్ ఎంట్రీ
అలా ఇప్పటివరకు ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన వివేక్ చేపూరి ఇప్పుడు సోలో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. దర్శకుడు టి. శరత్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ ద్విభాషా చిత్రంగా రూపొందిస్తున్నారు.
విజువల్స్ అద్భుతంగా ఉండేలా
విజువల్స్ అద్భుతంగా ఉండేలా ప్రియేష్ గురుస్వామి ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చిత్ర బృందం నవంబర్ మాసంలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్, టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
కథనాయకుడిగా మొదటి ప్రాజెక్ట్ కోసం
నగర వీధుల నుంచి మొదలైన వివేక్ ప్రయాణం నేటి యువ కళాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తోంది. కథానాయకుడిగా తన మొదటి ప్రాజెక్ట్ కోసం అతడు పడుతున్న శ్రమ, ఎంచుకున్న కథాంశం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిపెడతాయని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


