The Paradise: జడల్ జమానా మొదలైంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ ఇవాళ (సెప్టెంబర్ 24) గ్రాండ్ గా రిలీజైంది. ఒక రోజు ముందు రాత్రి స్పెషల్ ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ది ప్యారడైజ్ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యంగ్ హీరో హర్ష్ రోషన్ చేసిన పని వైరల్ గా మారింది.
ది ప్యారడైజ్ మూవీకి

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా మారాడు హర్ష్ రోషన్. అతను తాజాగా ది ప్యారడైజ్ మూవీ ప్రీమియర్ షోకు వెళ్లాడు. ఇందులో స్పెషాలిటీ ఏంటీ అంటారా? అతను మామూలుగా సినిమాకు వెళ్లలేదు. ది ప్యారడైజ్ లో నాని గెటప్ అయిన జడల్ గెటప్ లో హర్ష్ రోషన్ మూవీకి వెళ్లాడు.
వైరల్ వీడియోలు
జడల్ గెటప్ లో ది ప్యారడైజ్ మూవీకి హర్ష్ రోషన్ వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అతను హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్లో ది ప్యారడైజ్ ప్రీమియర్ షో చూశాడు. అతను థియేటర్ లోపలికి వెళ్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ప్రమోషనల్ ప్లాన్
హర్ష్ రోషన్ కు నాని అంటే పిచ్చి అభిమానం. అంతే కాకుండా నాని ప్రొడ్యూస్ చేసిన ‘కోర్ట్’ మూవీతో రోషన్ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకున్నాడు. అందుకే ఇలా జడల్ గెటప్ తో నానిపై అభిమానాన్ని చాటుకున్నాడు. కానీ ఇదే ఛాన్స్ అని తన సొంత మూవీని కూడా బాగానే ప్రమోట్ చేసుకునే ప్లాన్ రోషన్ వేశాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
తెల్ల కాగితం సినిమా
హర్ష్ రోషన్ అప్ కమింగ్ మూవీ ‘తెల్ల కాగితం’. ఈ యూత్ లవ్ అండ్ ఎమోషనల్ స్టోరీ అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ ను టీమ్ పరుగులు పెట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ది ప్యారడైజ్ మూవీ కోసం జడల్ గెటప్ లో వెళ్లిన రోషన్.. తన షర్ట్ వెనుకాల ‘తెల్ల కాగితం. అక్టోబర్ 2 రిలీజ్’ అని రాసుకున్నాడు.
{{/usCountry}}హర్ష్ రోషన్ అప్ కమింగ్ మూవీ ‘తెల్ల కాగితం’. ఈ యూత్ లవ్ అండ్ ఎమోషనల్ స్టోరీ అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ ను టీమ్ పరుగులు పెట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ది ప్యారడైజ్ మూవీ కోసం జడల్ గెటప్ లో వెళ్లిన రోషన్.. తన షర్ట్ వెనుకాల ‘తెల్ల కాగితం. అక్టోబర్ 2 రిలీజ్’ అని రాసుకున్నాడు.
{{/usCountry}}దీంతో నానిపై తన ప్రేమను చాటుకోవడమే కాకుండా హర్ష్ రోషన్ తెలివిగా తన మూవీని కూడా ప్రమోట్ చేసుకున్నాడనే కామెంట్లు వస్తున్నాయి.
చైల్డ్ ఆర్టిస్ట్ గా
హర్ష్ రోషన్ కు ఇండస్ట్రీ కొత్తేమీ కాదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా అతను కెరీర్ స్టార్ట్ చేశాడు. నాని నిర్మించిన ‘కోర్ట్’ మూవీతో రోషన్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సోలో హీరోగా ‘బ్యాండ్ మేళం’ మూవీ చేశాడు రోషన్. ఇప్పుడు ‘తెల్ల కాగితం’ సినిమాతో మరోసారి థియేటర్లకు రాబోతున్నాడు.