Mouli Comments: న్యూస్ ఛానెల్ వాళ్లు కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు.. చేసేదేం లేక వెళ్లా: యంగ్ హీరో మౌళి సంచలన కామెంట్లు

Mouli Comments: టాలీవుడ్ లో ఆచితూచి అడుగులు వేస్తూ దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో మౌళి. లిటిల్ హార్ట్స్ తో ఆడియన్స్ హార్ట్స్ దోసేసిన అతను ఇప్పుడు దొంగ నా కొడుకు మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్లో మౌళి కామెంట్లు కలకం రేపుతున్నాయి. 

Published on: Oct 22, 2026, 10:27:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Mouli Comments: డిజిటల్ ప్రపంచం నుంచి వెండితెరకు ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించడం అంత సులువు కాదు. యూట్యూబర్ మౌళి తనుజ్ ప్రశాంత్ తన మొదటి సినిమా 'లిటిల్ హార్ట్స్' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద స్లీపర్ హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మౌళి.

న్యూస్ ఛానెల్ వాళ్లు కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు.. చేసేదేం లేక వెళ్లా: యంగ్ హీరో మౌళి సంచలన కామెంట్లు
న్యూస్ ఛానెల్ వాళ్లు కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు.. చేసేదేం లేక వెళ్లా: యంగ్ హీరో మౌళి సంచలన కామెంట్లు

మౌళి కామెంట్లు

తాజాగా జరిగిన 'దొంగ నా కొడుకు' సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మౌళి తన మనసులోని ఆవేదనను బయటపెట్టాడు. ఈ ఒక్క ఏడాదిలోనే తను ఇండస్ట్రీలో ఎంతో ద్వేషాన్ని, అసూయను ఎదుర్కొన్నానని చెప్పాడు. తనపై ఎందుకు అంత నెగెటివిటీ చూపించారో పూర్తి వివరాలు ఇప్పుడు బయటపెట్టలేనని, కానీ ఒక సంఘటన మాత్రం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆసక్సెస్ వెనుకాలే ఒక భయంకరమైన, చేదు అనుభవాన్ని మౌళి ఎదుర్కొన్నాడు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

బ్లాక్‌మెయిల్ చేశారు

'లిటిల్ హార్ట్స్' సినిమా విడుదలై మంచి విజయం సాధించిన తర్వాత ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ నుండి మౌళికి పిలుపు వచ్చింది. వారి ఛానల్ నిర్వహించే ఒక ఈవెంట్ కు గెస్ట్ గా రావాలని మౌళిని ఇన్వైట్ చేశారు. అయితే ఆ సమయంలో మౌళికి ఒంట్లో అస్సలు బాగోలేదు. దీంతో తను రాలేనని చాలా మర్యాదగా వాళ్లకు చెప్పాడు.

కానీ ఆ ఛానల్ ప్రతినిధులు మాత్రం దానికి ఒప్పుకోకుండా, ఒకవేళ రాకపోతే భవిష్యత్తులో వచ్చే సినిమాలపై దెబ్బకొడతామంటూ బహిరంగంగానే బ్లాక్‌మెయిల్ చేశారని మౌళి సంచలన నిజం బయటపెట్టాడు.

భయపడే ఆ ప్రోగ్రామ్‌కి వెళ్లాను

తమలాంటి పెద్ద ఛానల్స్ బెదిరిస్తే చిన్న నటులు భయపడిపోతారని, ఏమీ చేయలేరని వారు భావించారని, అది నిజమేనని మౌళి ఒప్పుకున్నాడు. ఆ సమయంలో తాను తీవ్రమైన భయాందోళనకు గురయ్యానని, చేసేదేమీ లేక అనారోగ్యంతో ఉన్నా కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యానని తెలిపాడు.

సినిమా రంగంలో తనకంటూ ఒక లక్ష్యం ఉందని, ఇక్కడ మనుగడ సాగించాలంటే ఇలాంటి అవమానాలను, బెదిరింపులను తట్టుకొని ముందుకు వెళ్లక తప్పదని మౌళి ఎమోషనల్ అయ్యాడు. ఒక యువ ప్రతిభావంతుడికి ఇలాంటి అనుభవం ఎదురవడంపై నెటిజన్లు సదరు ఛానల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దొంగ నా కొడుకు గురించి

మౌళి హీరోగా నటించిన దొంగ నా కొడుకు మూవీపై క్రమంగా బజ్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమా నవంబర్ 13, 2026న థియేటర్లలోకి రానుంది. దీనికి శ్రును కంబాల డైరెక్టర్. అతనికి ఇదే ఫస్ట్ మూవీ. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More