...
...
Next Story

Remuneration: ఒక్క సినిమా.. రూ.1000 కోట్ల రెమ్యునరేషన్.. నక్క తోక తొక్కిన 30 ఏళ్ల స్టార్ హీరో.. ఇది కదా సక్సెస్ అంటే..

Remuneration: రెమ్యునరేషన్ లో హాలీవుడ్ స్టార్ హీరో, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే స్టార్ టామ్ హాలండ్ నయా రికార్డు క్రియేట్ చేశారు. 30 ఏళ్ల వయసులోనే ఒక్క సినిమాకు రూ.1000 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా నిలవడం విశేషం.

Published on: Aug 19, 2026, 15:54:47 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Remuneration: హాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ టామ్ హాలండ్ 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే' సినిమాతో ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్నారు. కేవలం ఈ ఒక్క సినిమాతోనే ఆయన ఏకంగా $100 మిలియన్లు (రూ. 1000 కోట్లకు పైగా) రెమ్యునరేషన్ అందుకోబోతుండటం గ్లోబల్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది.

గత సినిమా కంటే డబుల్ కానీ..

Remuneration: ఒక్క సినిమా.. రూ.1000 కోట్ల రెమ్యునరేషన్.. నక్క తోక తొక్కిన 30 ఏళ్ల స్టార్ హీరో.. ఇది కదా సక్సెస్ అంటే..
Remuneration: ఒక్క సినిమా.. రూ.1000 కోట్ల రెమ్యునరేషన్.. నక్క తోక తొక్కిన 30 ఏళ్ల స్టార్ హీరో.. ఇది కదా సక్సెస్ అంటే..

'స్పైడర్‌మ్యాన్' ఫ్రాంచైజీలో సూట్ తొడిగిన ప్రతిసారీ క్యాష్ రిజిస్టర్లు గిలగిలా కొట్టుకుంటున్నాయి. ఈ నయా ప్రాజెక్ట్ కోసం టామ్ హాలండ్ ముందస్తుగా $20 మిలియన్ల బేస్ శాలరీ తీసుకున్నారు. గతంలో వచ్చిన 'నో వే హోమ్' మూవీతో పోలిస్తే ఇది సరిగ్గా రెట్టింపు అమౌంట్.

అయితే అసలైన బిగ్ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమా సాధించే నెట్ ప్రాఫిట్స్‌లో ప్రాఫిట్ షేరింగ్ (బ్యాకెండ్ డీల్) ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ లాభాల షేరింగ్‌పై ఎలాంటి లిమిట్ లేకపోవడంతో, ఆయన ఖాతాలో ఈజీగా $100 మిలియన్లకు పైగా వచ్చి చేరడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు.

రూ. 2.5 కోట్లతో స్టార్ట్.. రూ. 1000 కోట్ల దండయాత్ర!

2016లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) లోకి అడుగుపెట్టినప్పుడు టామ్ హాలండ్ అందుకున్నది కేవలం $2,50,000 (సుమారు రూ. 2.5 కోట్లు) మాత్రమే. ఆ తర్వాత 2017లో వచ్చిన 'స్పైడర్‌మ్యాన్: హోమ్‌కమింగ్' చిత్రానికి $5,00,000, 2019లో వచ్చిన 'ఫార్ ఫ్రమ్ హోమ్' మూవీకి $4 మిలియన్లు అందుకున్నారు.

2021లో రిలీజైన 'నో వే హోమ్' నాటికి ఆయన పారితోషికం $10 మిలియన్లకు పెరిగింది. ఇప్పుడు 2026 నాటికి 'ది ఒడిస్సీ' సక్సెస్, అలాగే 'బ్రాండ్ న్యూ డే' హిస్టారిక్ బాక్సాఫీస్ రన్ పుణ్యమా అని హాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకునే అగ్ర శ్రేణి స్టార్ల సరసన టామ్ హాలండ్ చేరిపోయారు.

బాక్సాఫీస్ దగ్గర 'స్పైడర్‌మ్యాన్' ఊచకోత.. ఆల్ టైమ్ రికార్డ్స్

కేవలం ఆరు రోజుల్లోనే గ్లోబల్ వైడ్‌గా $1 బిలియన్ క్లబ్‌లో చేరిన ఈ పీరియాడిక్ సూపర్ హీరో డ్రామా.. కేవలం 17 రోజుల్లోనే $2 బిలియన్ల ల్యాండ్‌మార్క్‌ను దాటేసింది. హాలీవుడ్ హిస్టరీలోనే 'ఎవెంజర్స్: ఎండ్‌గేమ్' తర్వాత అత్యంత వేగంగా $2 బిలియన్లు సాధించిన రెండో సినిమాగా రికార్డులకెక్కింది.

సోనీ పిక్చర్స్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్

ఇప్పటివరకు ఈ సినిమా గ్లోబల్ కలెక్షన్లు $2.03 బిలియన్లు (రూ. 19,000 కోట్లకు పైగా) దాటేశాయి. నార్త్ అమెరికాలో $785.8 మిలియన్లు, ఓవర్సీస్ మార్కెట్లలో $1.2 బిలియన్ల వసూళ్లతో ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతోంది.

గతంలో ఉన్న 'స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్' కలెక్షన్లను అధిగమించి, సోనీ పిక్చర్స్ హిస్టరీలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన బిగ్గెస్ట్ మూవీగా 'బ్రాండ్ న్యూ డే' రికార్డు సృష్టించింది. రాబర్ట్ డౌనీ జూనియర్ రేంజ్‌లో మార్వెల్ ఫ్రాంచైజీని తన భుజాలపై మోస్తూ టామ్ హాలండ్ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు.

ఇండియాలోనూ బాక్సాఫీస్ సునామీ.. రూ.600 కోట్ల క్లబ్‌లో..

ఈ హాలీవుడ్ విజువల్ వండర్ భారతదేశంలో కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇక్కడ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటివరకు దాదాపు రూ.617 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అత్యధిక కలెక్షన్లు సాధించిన హాలీవుడ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రా, తెలంగాణల్లో కూడా ఈ స్పైడర్‌మ్యాన్ అడ్వెంచర్‌కు భారీ రెస్పాన్స్ దక్కింది.

ఈ సినిమా విజయంతో టామ్ హాలండ్ స్టార్‌డమ్ తారాస్థాయికి చేరింది. రాబర్ట్ డౌనీ జూనియర్ 'ఐరన్ మ్యాన్' రోల్‌తో ఏ రేంజ్‌లో మార్వెల్ ఫ్రాంచైజీకి వెన్నెముకగా నిలిచారో, ఇప్పుడు టామ్ హాలండ్ కూడా అదే రీతిలో గ్లోబల్ బాక్సాఫీస్‌ను శాసిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe