నంబర్ 1 తెలుగు సీరియల్.. ఎవరికీ అందనంత ఎత్తులో టీఆర్పీ రేటింగ్.. 44వ వారం టాప్ 10 సీరియల్స్ ఇవే

తెలుగు టీవీ సీరియల్స్ కు సంబంధించి లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. 44వ వారం రేటింగ్స్ లో నంబర్ 1 తెలుగు సీరియల్ కార్తీకదీపం మరింత మెరుగైన రేటింగ్ సాధించింది. టాప్ 6లో అన్నీ స్టార్ మా సీరియల్సే ఉన్నాయి.

Published on: Nov 13, 2025, 13:51:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగులో నంబర్ 1 సీరియల్ ఇప్పుడు మరింత ఎత్తుకు ఎదిగింది. కార్తీక దీపం సీరియల్ తాజాగా 44వ వారం రికార్డు టీఆర్పీ రేటింగ్ సాధించింది. అంతేకాదు ఈసారి కూడా స్టార్ మా సీరియల్స్ హవా కొనసాగింది. టాప్ 6లోనే కాదు టాప్ 10లోనూ ఎలాంటి మార్పూ లేదు.

నంబర్ 1 తెలుగు సీరియల్.. ఎవరికీ అందనంత ఎత్తులో టీఆర్పీ రేటింగ్.. 44వ వారం టాప్ 10 సీరియల్స్ ఇవే
నంబర్ 1 తెలుగు సీరియల్.. ఎవరికీ అందనంత ఎత్తులో టీఆర్పీ రేటింగ్.. 44వ వారం టాప్ 10 సీరియల్స్ ఇవే

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

ఎప్పటిలాగే తెలుగు టీవీ సీరియల్స్ లో స్టార్ మా ఛానెల్ దూకుడు కొనసాగింది. ఈ ఏడాది 44వ వారం కూడా ఆ ఛానెల్ కు చెందిన 6 సీరియల్స్ టాప్ 6లో ఉన్నాయి. తొలిస్థానంలో కార్తీక దీపం 2 సీరియల్ ఉంది. ఈ సీరియల్ కు తాజాగా 15.28 రేటింగ్ రావడం విశేషం. ఇక రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా 13.92 రేటింగ్ నమోదు చేసింది.

మూడో స్థానంలో ఇంటింటి రామాయణం ఉంది. దీనికి 13.30 రేటింగ్ వచ్చింది. నాలుగో స్థానంలో గుండె నిండా గుడి గంటలు నిలిచింది. కొద్దిలో మూడో స్థానం కోల్పోయిన ఈ సీరియల్ 13.19 రేటింగ్ సాధించింది. ఐదో స్థానంలో చిన్ని సీరియల్ కొనసాగుతోంది. దీనికి తాజాగా 10.84 రేటింగ్ రాగా.. ఆరో స్థానంలో నిండుమనసులు ఉంది. ఈ సీరియల్ కు 8.33 రేటింగ్ వచ్చింది. ప్రతి వారం ఈ సీరియల్ ఎంతో కొంత మెరుగవుతూ వస్తోంది.

జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

ఇక టాప్ 10 తెలుగు టీవీ సీరియల్స్ లో చివరి నాలుగు స్థానాల్లోనూ జీ తెలుగుకు చెందిన సీరియల్స్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఈ ఛానెల్ దూకుడు పెంచుతోంది. ఎప్పుడూ టాప్ 10లో ఉండే సీరియల్సే ఈవారం కూడా కొనసాగాయి. అలా ఆ ఛానెల్ కు చెందిన మేఘసందేశం 8.06 రేటింగ్ తో ఓవరాల్ గా ఏడో స్థానంలో ఉంది.

ఆ తర్వాత 7.68 రేటింగ్ తో జగద్ధాత్రి ఎనిమిదో స్థానానికి దూసుకొచ్చింది. 7.43 రేటింగ్ తో లక్ష్మీనివాసం, 7.35 రేటింగ్ తో చామంతి సీరియల్స్ ఆ తర్వాత రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఛానెల్ కు చెందిన మరో సీరియల్ జయం కూడా 7కుపైగా రేటింగ్ సాధించినా.. టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More