గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బామ్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన బాలు.. తల్లికి క్లాస్ పీకి ఇంటి నుంచి పంపించిన శృతి
గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (నవంబర్ 13) ఎపిసోడ్ లో బామ్మకు బాలు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వడం చూడొచ్చు. అంతేకాదు ఇంట్లో మళ్లీ గొడవ పెట్టుకోవడానికి వచ్చిన తన శోభను క్లాస్ పీకి ఇంట్లో నుంచి పంపించేస్తుంది శృతి.
గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 553వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇంట్లో ప్రభావతి నోరు పారేసుకోవడం, శృతి తల్లి శోభ ఎక్స్‌ట్రాలు మరోసారి గొడవ పెట్టేలా కనిపించినా.. శృతితోపాటు ఇంట్లో వాళ్ల స్పందన అలా జరగకుండా చూస్తుంది. ఇక చివర్లో నాన్నమ్మ సుశీలకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తాడు బాలు.

ప్రభావతికి క్లాస్ పీకిన సుశీల, సత్యం, మీనా
గుండె నిండా గుడి గంటలు గురువారం (నవంబర్ 13) ఎపిసోడ్ సుమతి పెళ్లి గురించి చర్చతో మొదలవుతుంది. నీకు పెళ్లి జరగాలంటే ఎవరికైనా యాక్సిడెంట్ జరగాల్సిందే అని ప్రభావతి అంటుంది. దీంతో ఇంట్లో వాళ్లందరూ ఆమెపై మండిపడతారు.
అసలు నువ్వు ఆడదానివేనా అని సుశీల అంటే.. అసలు అది మనిషే కాదు అని సత్యం అంటాడు. మీనా, శృతి, రవి, చివరికి కూతురు మౌనిక కూడా ప్రభావతికి క్లాస్ పీకుతారు. అసలు అది నోరేనా, పుట్టినరోజున చావు గురించి మాట్లాడతావా అంటూ ప్రభావతిని నానా మాటలు అనడంతో ఆమె ఓ మూలన వెళ్లి నిలబడుతుంది.
గొడవ పెట్టడానికి మళ్లీ వచ్చిన శోభ
అటు సుశీల బర్త్ డే కోసం వచ్చిన శోభ ఈసారి ఏదో ఒక గొడవ పెట్టాల్సిందే అనుకుంటుంది. ఇంట్లోకి రాగానే మొదలు పెడుతుంది. మాలాంటి డబ్బున్నోళ్లే పెద్దవాళ్లు పుట్టినరోజులు జరుపుకుంటారనుకున్నా.. మీ మిడిల్ క్లాస్ వాళ్లు కూడా చేసుకుంటారా అని అంటుంది. దీంతో సత్యం, సుశీల ఆమెకు నెమ్మదిగానే అయినా బాగానే గడ్డి పెడతారు.
రవి, సుమతి సరసాలు.. కొట్టడానికి సాయం చేసిన శృతి
ఆ తర్వాత రవి, సుమతి సరసాలు ఆడతారు. రవి చెవి పక్కనే సుమతి బెలూన్ పేలుస్తుంది. దీంతో నిన్ను ఎవడు చేసుకుంటాడోగానీ అని రవి ఆమెను ఆటపట్టిస్తాడు. దీంతో రవిని కొట్టడానికి సుమతి వెంట పడుతుంది. ఇదంతా చూసిన శోభ, ప్రభావతి షాక్ తింటారు. శృతి వస్తే ఏమంటుందో అని అనుకుంటారు. మీనా కూడా అదే భయపడుతుంది.
కానీ శృతి వచ్చిన తర్వాత సుమతి ఏం జరిగిందో చెబుతుంది. కొట్టడానికి వెళ్తే రవి దొరకడం లేదని అంటుంది. దీంతో రవిని శృతియే గట్టిగా పట్టుకొని ఒంగోబెడుతుంది. దీంతో సుమతి అతన్ని కొడుతుంది. శృతి చేసిన పని చూసి మీనా, సత్యం ఆమెను మెచ్చుకుంటారు. ఇంట్లో ఏంటి గెంతడాలు అన్న మనోజ్ ను ఆట పట్టిస్తూ.. అతనికి సుమతి, రవి, శృతి కలిసి సెల్యూట్ కూడా చేస్తారు.
నగల గురించి మీనాను అడిగిన శోభ..
వచ్చిన అవకాశం పోయిందని శోభ బాధపడుతుంది. అప్పుడే ఆమె కళ్లు మీనా ఒంటిపైని నగలపై పడుతుంది. ఎందుకు రోల్డ్ గోల్డ్ నగలు వేసుకున్నవని అడుగుతుంది. దీంతో ప్రభావతి, మనోజ్ కంగారు పడతారు. అవి అసలు నగలే.. తానే బీరువాలో బాగా కడిగి దాచానని ప్రభావతి అంటుంది.
కిలో బంగారం ఉన్న తనకు ఏది అసలో తెలియదా అంటూ శోభ చెబుతుంది. అది తాను చేయించిన నగలే అని, అసలువే అని సుశీల కూడా అంటుంది. రోహిణి కూడా మీనాకు మద్దతు ఇస్తుంది. అయినా శోభ వినకపోవడంతో అందరూ ఆమెకు క్లాస్ పీకుతారు.
తల్లికి క్లాస్ పీకిన శృతి.. మళ్లీ ఇంటికి రావద్దంటూ..
దీంతో శృతి రంగంలోకి దిగుతుంది. శోభను ఇంటి బయటకు తీసుకెళ్తుంది. మీనా నగల గురించి నీకెందుకు.. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక గొడవ ఎందుకు పెడతావు.. బాలు లేడు కాబట్టి సరిపోయింది లేదంటే పెద్ద గొడవ జరిగేదని తల్లికి క్లాస్ పీకుతుంది. అసలు బంగారం లేని ఇలాంటి వీళ్లు నీ బంగారాన్ని ఏదో ఒకరోజు దోచుకుంటారని తల్లి అనడంతో.. నువ్వు వద్దూ, నీ బంగారం వద్దు.. మొత్తం తీసుకుపో అనడంతో ఆమె షాక్ తింటుంది. శోభను అటు నుంచి అటే పంపించేస్తుంది.
మౌనిక కోసం సంజూ మళ్లీ పట్టు
అటు మౌనికపై సంజూలో అనుమానం పెరిగి మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తాడు. ఆమె తీయదు. దీంతో మరోసారి తల్లి దగ్గరికి వెళ్లి నిలదీస్తాడు. ఆమె సర్దిచెప్పినా వినడు. తినకుండా వెళ్లిపోతాడు. ఇటు ఇంట్లో మౌనిక భయంభయంగా కూర్చొంటుంది. తాను వెళ్తానని అన్నా.. కేకు కట్ చేసిన తర్వాత వెళ్లమని అనడంతో అక్కడే ఉంటుంది.
ఇక ఎపిసోడ్ చివర్లో అందరూ కేకు కట్ చేద్దామన్న బాలు కోసం సుశీల ఆగుదామంటుంది. చివరికి అతడు సుశీల చిన్ననాటి స్నేహితులను ఇంటికి తీసుకొచ్చి సర్‌ప్రైజ్ చేస్తాడు. ఆమెకు అదే బహుమతి అంటాడు. మరి సుశీల తన మనసు గెలిచిన బాలుకు ఏం గిఫ్ట్ ఇస్తుందో తర్వాతి ఎపిసోడ్ లో తేలనుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


