...
...
Next Story

సోనీ లివ్ ఓటీటీలోని టాప్ 5 మలయాళం మూవీస్ ఇవే.. అన్నీ తెలుగులోనూ స్ట్రీమింగ్.. థ్రిల్లర్లకే మంచి ఆదరణ

ఈ ఏడాది సోనీ లివ్ ఓటీటీలోకి ఎన్నో ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిలో టాప్ 5 సినిమాలు ఏవో ఇక్కడ చూడండి. వీటిలో థ్రిల్లర్ సినిమాలకే ఎక్కువగా చోటు దక్కడం విశేషం.

Published on: Nov 18, 2025, 15:35:07 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మలయాళం సినిమాలను మెచ్చే తెలుగు అభిమానులకు కొదవ లేదు. ముఖ్యంగా ఓటీటీ వచ్చిన తర్వాత అక్కడి కంటెంట్ పెద్ద ఎత్తున అందుబాటులోకి రావడంతో తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ ఏడాది కూడా జనవరి నుంచి ఇప్పటి వరకూ సోనీ లివ్ ఓటీటీలో ఆ ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో టాప్ 5 సినిమాలు ఏవో సదరు ఓటీటీ.. ఓటీటీప్లేతో షేర్ చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

పని (Pani)

సోనీ లివ్ ఓటీటీలోని టాప్ 5 మలయాళం మూవీస్ ఇవే.. అన్నీ తెలుగులోనూ స్ట్రీమింగ్.. థ్రిల్లర్లకే మంచి ఆదరణ
సోనీ లివ్ ఓటీటీలోని టాప్ 5 మలయాళం మూవీస్ ఇవే.. అన్నీ తెలుగులోనూ స్ట్రీమింగ్.. థ్రిల్లర్లకే మంచి ఆదరణ

నటుడు జోజు జార్జ్ దర్శకుడిగా పరిచయమైన ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ త్రిస్సూర్‌లో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఇద్దరు యువకుల కథ. కొన్ని సంఘటనల తర్వాత ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరిన లోకల్ గూండా నాయకుడు గిరి (జోజు జార్జ్) పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. ఈ చిత్రంలోని రా అండ్ థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. క్లైమ్యాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు.

మార్కో (Marco)

ఉన్ని ముకుందన్ నటించిన ఈ యాక్షన్ మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. తన సోదరుడు విక్టర్ హత్యకు గురైన తర్వాత ప్రతీకారం తీర్చుకునే మార్కో క్రూరమైన కథను ఈ సినిమా చూపిస్తుంది. ఇందులో మితిమీరిన హింసను చూపినందుకు ఇది అత్యంత హింసాత్మక మలయాళ చిత్రంగా పేరుపొందింది. ఎ సర్టిఫికెట్ ఉన్న సినిమా ఇది.

రేఖాచిత్రమ్ (Rekhachitram)

ఇదో మిస్టరీ థ్రిల్లర్ మూవీ. చనిపోతున్న ఒక వ్యక్తి ఫేస్‌బుక్ లైవ్ ద్వారా తాను చేసిన హత్య గురించి చెబుతాడు. అది 40 సంవత్సరాల నాటి హత్య కేసును వెలికితీయడానికి దారి తీస్తుంది. ఈ కథ రేఖ అనే వర్ధమాన నటి వైపు మళ్లుతుంది. 1985 నాటి సినీ సెట్టింగ్‌లోకి ప్రేక్షకులను తీసుకెళ్తుంది. మంచి థ్రిల్ పంచే మూవీ ఇది. ఈ ఏడాది అత్యధిక వసూళ్ల మలయాళ సినిమాల్లో ఒకటి.

అలప్పుళ జింఖానా (Alappuzha Gymkhana)

టొవినో థామస్ పోలీసు పాత్రలో నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ ఇది. ఇందులో అతను కొత్తగా పోలీసుగా మారిన వర్గీస్ పాత్రలో కనిపిస్తాడు. నిరసన తెలుపుతున్న గిరిజనుల వద్దకు వెళ్లిన వర్గీస్.. అక్కడ జరిగిన ఒక విషాదకర సంఘటన తర్వాత వ్యవస్థలోని భయానక వాస్తవాలను తెలుసుకుని, న్యాయం కోసం నిలబడతాడు. సూరజ్ వెంజరమూడు కీలక పాత్రలో నటించాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe