ఓటీటీలో ప్రతివారం ఎక్కువ వ్యూస్ వచ్చిన సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేస్తున్న విషయం తెలుసు కదా. గతవారం అంటే డిసెంబర్ 29 నుంచి జనవరి 4 మధ్య కూడా ఏ సినిమాకు ఎక్కువ వ్యూస్ వచ్చాయో తేలిపోయింది. అయితే టాప్ 5 జాబితాలో రవితేజ డిజాస్టర్ మాస్ జాతర కూడా ఉండటమే ఆశ్చర్యం కలిగిస్తోంది.
టాప్ 5లో మాస్ జాతర

ఓటీటీ టాప్ 5 సినిమాల విషయానికి వస్తే రష్మిక మందన్న నటించిన హారర్ కామెడీ మూవీ థామా తొలి స్థానంలో కొనసాగుతోంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు గతవారం 2.3 మిలియన్ల వ్యూస్ నమోదు కావడం విశేషం. రెండో స్థానంలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఏక్ దీవానే కీ దీవానియత్ నిలిచింది. ఈ మూవీకి 2.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
మూడో స్థానంలో నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన హక్ మూవీ ఉంది. ఈ మూవీకి 2 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి. నెట్‌ఫ్లిక్స్ లోనే ఉన్న రాత్ అకేలీ హై సినిమా 1.6 మిలియన్ల వ్యూస్ తో నాలుగో స్థానంలో ఉంది. ఐదో స్థానంలో జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న మాస్ జాతర సినిమాకు 1.3 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ సినిమా ఐదో స్థానంలో ఉంది.
టాప్ 5 వెబ్ సిరీస్ ఇవే..
ఇక వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. టాప్ 5లో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ లలో స్ట్రీమింగ్ అవుతున్నవి ఉన్నాయి. తొలి స్థానంలో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఉంది. దీనికి 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రెండో స్థానంలో జియోహాట్‌స్టార్ లో ఉన్న మిసెస్ దేశ్‌పాండే నిలవగా.. దీనికి 2.2 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి.
ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే వచ్చిన ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ నాలుగో సీజన్ కు గత వారం 1.4 మిలియన్ వ్యూస్ రాగా.. మూడో స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ లోని సింగిల్ పాపాకు 1.3 వ్యూస్, జియోహాట్‌స్టార్ లోని ఎల్బీడబ్ల్యూ: లవ్ బియాండ్ వికెట్ 1.2 మిలియన్ వ్యూస్ తో 4, 5 స్థానాల్లో ఉన్నాయి.
{{/usCountry}}ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే వచ్చిన ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ నాలుగో సీజన్ కు గత వారం 1.4 మిలియన్ వ్యూస్ రాగా.. మూడో స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ లోని సింగిల్ పాపాకు 1.3 వ్యూస్, జియోహాట్‌స్టార్ లోని ఎల్బీడబ్ల్యూ: లవ్ బియాండ్ వికెట్ 1.2 మిలియన్ వ్యూస్ తో 4, 5 స్థానాల్లో ఉన్నాయి.
{{/usCountry}}