OTT Thrillers: సీడ్ ఎడ్జ్ మీద కూర్చోబెట్ట కోర్టు రూమ్ థ్రిల్లర్లు అంటే మీకు ఇష్టమా? కోర్టు రూమ్ లోని మైండ్ గేమ్స్ నచ్చుతుందా? అయితే ఓటీటీలోని ఈ టాప్ 5 కోర్టు రూమ్ థ్రిల్లర్లను మీరు చూడాల్సిందే. ఇందులో మెగాస్టార్ చిరంజీవి మూవీ కూడా ఉంది.
1. షాహిద్ (Shahid) - సోనీ లివ్

బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ రాజ్ కుమార్ రావు లీడ్ రోల్‌లో నటించిన ఈ చిత్రం ఒక లీగల్ మాస్టర్ పీస్. 2010లో ముంబైలో దారుణ హత్యకు గురైన హ్యూమన్ రైట్స్ లాయర్ షాహిద్ అజ్మీ నిజ జీవిత కథ ఆధారంగా హన్సల్ మెహతా ఈ సినిమాను తెరకెక్కించారు.
స్టోరీ
అమాయకుల తరఫున కోర్టులో నిలబడే లాయర్ షాహిద్.. 2006 ముంబై రైలు పేలుళ్లు, 2008 ముంబై ఉగ్రదాడుల కేసులలో నిందితులుగా ముద్రపడిన ఎంతోమందిని తన వాదనలతో నిర్దోషులుగా ఎలా నిరూపించాడు? చివరకు అతన్ని శత్రువులు ఎలా టార్గెట్ చేశారనేది గుండెల్ని పిండేసేలా ఈ సినిమా చూపిస్తుంది. రాజ్ కుమార్ రావు జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ చిత్రాన్ని సోనీ లివ్ ఓటీటీలో తప్పక చూడాల్సిందే.
2. సెక్షన్ 375 (Section 375) - ప్రైమ్ వీడియో
"న్యాయస్థానాలు నిజాలను వెలికితీయడానికి కాదు.. కేవలం సాక్ష్యాధారాల ఆధారంగా చట్టాన్ని అమలు చేయడానికి మాత్రమే" అనే విలక్షణమైన పాయింట్‌తో ఈ సినిమా సాగుతుంది.
స్టోరీ
బాలీవుడ్‌కు చెందిన ఒక ప్రముఖ డైరెక్టర్‌పై జూనియర్ కాస్ట్యూమ్ డిజైనర్ రేప్ కేసు పెడుతుంది. ఈ కేసులో డైరెక్టర్ తరఫున టాప్ లాయర్ (అక్షయ్ ఖన్నా), బాధితురాలి తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (రిచా చద్దా) కోర్టులో తలపడతారు. ముగింపు వరకు ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు అబద్ధం చెబుతున్నారో ఊహించడం ప్రేక్షకుడికి సాధ్యం కాదు.
3. పింక్/వకీల్ సాబ్
పింక్ (Pink):
{{/usCountry}}పింక్ (Pink):
{{/usCountry}}ముగ్గురు వర్కింగ్ ఉమెన్స్‌ను కొందరు రాజకీయ బలమున్న యువకులు కార్లో బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో జరిగిన ఒక ప్రమాదం ఆధారంగా ముగ్గురు అమ్మాయిలపైనే రివర్స్‌లో డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేశారంటూ ప్రాస్టిట్యూషన్ కేసు పెడతారు. రిటైర్డ్ లాయర్‌గా అమితాబ్ బచ్చన్ వాదనలు, ముఖ్యంగా ‘నో అంటే నో’ అనే డైలాగ్స్ పింక్ సినిమాకు జీవం పోశాయి. ఇది జియోహాట్ స్టార్ (JioHotstar) లో ఉంది.
వకీల్ సాబ్ (Vakeel Saab): ఇదేర పింక్ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేశారు. ఒరిజినల్ కథకు టాలీవుడ్ కమర్షియల్ ఎలిమెంట్స్, పవర్ స్టార్ పొలిటికల్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్ యాక్షన్ సీన్స్, ఫ్లాష్ బ్యాక్ జోడించారు. ఈ తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్యూర్ లీగల్ డ్రామా కావాలనుకునే వారు పింక్, కమర్షియల్ టచ్ ఇష్టపడే వారు వకీల్ సాబ్ చూడవచ్చు.
4. శౌర్య (Shaaurya) - యూట్యూబ్
హాలీవుడ్ క్లాసిక్ ‘ఎ ఫ్యూ గుడ్ మెన్’ ఆధారంగా ఇండియన్ ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన అద్భుతమైన కోర్టు రూమ్ డ్రామా ఇది.
స్టోరీ
జమ్మూ కాశ్మీర్‌లో ఒక ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్‌ను అదే క్యాంపునకు చెందిన కెప్టెన్ జావేద్ ఖాన్ కాల్చి చంపుతాడు. కోర్ట్ మార్షల్ విచారణలో జావేద్ నోరు విప్పడానికి నిరాకరిస్తాడు. ఈ కేసును డిఫెన్స్ లాయర్‌గా ఒక ఆర్మీ మేజర్ టేకప్ చేస్తాడు. లాయర్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడే నిజాలు, క్లైమాక్స్ లో కేకే మీనన్, రాహుల్ బోస్ ల మధ్య వచ్చే సీన్లు మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. ప్రస్తుతం ఇది యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది.
5. అభిలాష (Abhilasha) - యూట్యూబ్
టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లీగల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన సూపర్ హిట్ నవల ‘అభిలాష’ ఆధారంగా లెజెండరీ డైరెక్టర్ ఎ. కోదండరామిరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెెక్కిచారు. మెగాస్టార్ చిరంజీవి ఇందులో యంగ్ అండ్ డైనమిక్ లాయర్‌గా నటించారు.
స్టోరీ
భారత న్యాయ వ్యవస్థ నుంచి ఉరిశిక్షను రద్దు చేయించాలనే పట్టుదలతో, సెక్షన్ 302 చట్టాన్ని సవాల్ చేస్తూ హీరో ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఒక తప్పుడు మర్డర్ కేసును తానే సృష్టించి, చివరి నిమిషంలో అసలు నిందితుడు బతికే ఉన్నాడని నిరూపించాలని చూస్తాడు. కానీ, దురదృష్టవశాత్తూ ఆ ప్లాన్ రివర్స్ అయ్యి హీరోనే నిజంగా ఉరిశిక్ష పడే ప్రమాదంలో పడతాడు. ఆ ప్రాణసంకటం నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అనేది ఉత్కంఠ రేపుతుంది. దీన్ని యూట్యూబ్ లో ఉచితంగా చూడొచ్చు.