ఈ ఏడాది అంటే 2025 ఎంటర్టైన్మెంట్ పరంగా అదిరిపోయింది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒకవేళ మీరు ఈ ఏడాది వచ్చిన బెస్ట్ సిరీస్‌లను మిస్ అయి ఉంటే.. 2026 స్టార్ట్ అయ్యే లోపు తప్పకుండా చూసేయండి. ఐఎండీబీ రేటింగ్ ప్రకారం టాప్ 7 క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇక్కడ ఉంది.
టాప్ 7 క్రైమ్ థ్రిల్లర్లు ఇవే..

ఈ ఏడాది (2025) చాలా మంచి వెబ్ సిరీస్‌లు వచ్చాయి. అందులో జనాలు మెచ్చిన, అత్యధిక రేటింగ్స్ ఉన్న 7 క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ల వివరాలు ఇవే. 'పాతాళ్ లోక్ 2' నుంచి 'డబ్బా కార్టెల్' వరకు అన్నీ ఇక్కడ ఉన్నాయి.
1. పాతాళ్ లోక్ సీజన్ 2
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఐఎండీబీ రేటింగ్: 8.2
జనవరి 2025లో వచ్చిన ఈ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. జైదీప్ అహ్లావత్ నటన మరో లెవల్ అని చెప్పొచ్చు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
2. బ్లాక్, వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్
ఓటీటీ: సోనీ లివ్
ఐఎండీబీ రేటింగ్: 8
మే నెలలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. మయూర్ మోరే, పాలక్ జైస్వాల్ ఇందులో నటించారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఓ డిఫరెంట్ థ్రిల్లర్ ఇది.
3. బ్లాక్ వారెంట్
ఎక్కడ చూడొచ్చు: నెట్‌ఫ్లిక్స్
ఐఎండీబీ రేటింగ్: 7.9
{{/usCountry}}ఐఎండీబీ రేటింగ్: 7.9
{{/usCountry}}ఇది కూడా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్. జనవరిలో విడుదలైంది. మొత్తం 7 ఎపిసోడ్లు ఉంటాయి. రాహుల్ భట్, జహాన్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. చార్లెస్ శోభరాజ్, తీహార్ జైలు జీవితం చుట్టూ సిరీస్ తిరుగుతుంది.
4. కన్నెడా
ఎక్కడ చూడొచ్చు: జియో హాట్‌స్టార్
ఐఎండీబీ రేటింగ్: 7.7
ఇది హిందీ/పంజాబీ క్రైమ్ డ్రామా. పర్మీష్ వర్మ లీడ్ రోల్ చేశాడు. మొత్తం 9 ఎపిసోడ్లు ఉంటాయి. కెనడాలో డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే సిరీస్ ఇది.
5. ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్
ఎక్కడ చూడొచ్చు: సోనీ లివ్
ఐఎండీబీ రేటింగ్: 7.6
ఇదొక హిస్టారికల్ డ్రామా సిరీస్. మార్చి 2025లో స్ట్రీమింగ్ అయ్యింది. చరిత్ర, డ్రామా ఇష్టపడే వాళ్లకు బాగా నచ్చుతుంది. జలియన్ వాలా బాగ్ దుర్ఘటన, తెర వెనుక కుట్రపై తీసిన వెబ్ సిరీస్ ఇది.
6. ఖాకీ: ది బెంగాల్ చాప్టర్
ఎక్కడ చూడొచ్చు: నెట్‌ఫ్లిక్స్
ఐఎండీబీ రేటింగ్: 7.5
'బీహార్ చాప్టర్' తర్వాత వచ్చిన వెబ్ సిరీస్ ఇది. మార్చిలో విడుదలైంది. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సిరీస్‌లో 7 ఎపిసోడ్లు ఉన్నాయి.
7. డబ్బా కార్టెల్
ఎక్కడ చూడొచ్చు: నెట్‌ఫ్లిక్స్
ఐఎండీబీ రేటింగ్: 7.1
సీనియర్ నటి షబానా ఆజ్మీ నటించిన వెబ్ సిరీస్ ఇది. 7 ఎపిసోడ్లు ఉంటాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన క్రైమ్ డ్రామా. కొందరు ఆడవాళ్ల గ్యాంగ్ నడిపే డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరుగుతుంది.