Free OTT: ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో కంటెంట్‌కు కొదవ లేదు. అయితే నాణ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలంటే నెలకు వందల రూపాయల సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. కానీ ఎలాంటి రుసుము లేకుండా, కేవలం యాడ్స్ ద్వారా పూర్తి సిరీస్‌లను ఉచితంగా అందించే ప్లాట్‌ఫామ్‌లలో అమెజాన్ MX ప్లేయర్ (Amazon MX Player) ముందంజలో ఉంది.

ఈ అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీలో మీరు ఉచితంగా వీక్షించగలిగే 7 అత్యుత్తమ వెబ్ సిరీస్‌ల వివరాలు ఇక్కడ చూడవచ్చు.
ఆశ్రమ్ (Aashram)
ప్రకాష్ ఝా దర్శకత్వంలో బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన సంచలనం ఈ సిరీస్. స్వయంప్రకటిత దొంగ బాబాల సామ్రాజ్యం, ఆధ్యాత్మికత ముసుగులో జరిగే అక్రమాలు, రాజకీయాలు, క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ఓటీటీ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
క్యాంపస్ డైరీస్ (Campus Diaries)
కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. కేవలం ర్యాగింగ్, లవ్ స్టోరీలు మాత్రమే కాకుండా నేటితరం విద్యార్థులు ఎదుర్కొనే మానసిక ఒత్తిళ్లు, డ్రగ్స్ సమస్యలు, ఫ్రెండ్‌షిప్, ఆశయాల చుట్టూ ఈ కథనం సాగుతుంది.
భౌకాల్ (Bhaukaal)
నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన రా అండ్ రస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. నటుడు మోహిత్ రైనా ఐపీఎస్ ఆఫీసర్‌గా నటించారు. ఉత్తరప్రదేశ్‌లోని క్రైమ్ రాజధానిగా పేరొందిన ముజఫ్ఫర్‌నగర్‌లో గ్యాంగ్‌స్టర్లను ఏవిధంగా ఏరిపారేశారనేది ఇందులో ఎంతో ఉత్కంఠభరితంగా చూపించారు.
సమంతర్ (Samantar)
స్వప్నిల్ జోషి నటించిన మైండ్ బెండింగ్ మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఒకే సమయంలో జన్మించిన ఇద్దరి జాతకాలు ఒకేలా ఉంటాయా? ఒకరి గతం మరొకరి భవిష్యత్తుగా మారితే ఏమవుతుంది? అనే వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సిరీస్ ఇది.
రక్తంచల్ (Raktanchal)
1980ల నాటి పూర్వాంచల్ గ్యాంగ్‌వార్స్, మైనింగ్ మాఫియా, రాజకీయం నేపథ్యంలో సాగే పక్కా మాస్ యాక్షన్ క్రైమ్ డ్రామా. అధికారం కోసం ఇద్దరి మధ్య జరిగే పోరాటం ఇందులో ప్రధాన ఆకర్షణ.
ఇందు (Indu)
{{/usCountry}}1980ల నాటి పూర్వాంచల్ గ్యాంగ్‌వార్స్, మైనింగ్ మాఫియా, రాజకీయం నేపథ్యంలో సాగే పక్కా మాస్ యాక్షన్ క్రైమ్ డ్రామా. అధికారం కోసం ఇద్దరి మధ్య జరిగే పోరాటం ఇందులో ప్రధాన ఆకర్షణ.
ఇందు (Indu)
{{/usCountry}}ఒక సంప్రదాయ కుటుంబంలోకి అడుగుపెట్టిన కొత్త కోడలు ఎదుర్కొనే అనుమానాస్పద సంఘటనల చుట్టూ ఈ ఫ్యామిలీ మిస్టరీ డ్రామా సాగుతుంది. ప్రతీ ఎపిసోడ్‌లోనూ ఊహించని ట్విస్టులతో సస్పెన్స్ కొనసాగించడంలో ఈ సిరీస్ విజయం సాధించింది.
రూప్ నగర్ కే చీతా (Roop Nagar Ke Cheetah)
చిన్ననాటి స్నేహితుల మధ్య ఉండే అనుబంధం, మారే కాలంతో పాటు వారి జీవితాల్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయనేది చూపించారు. నేర ప్రపంచంతో వారికి ఏర్పడే సంబంధం చుట్టూ సాగే ఎమోషనల్ అండ్ క్రైమ్ డ్రామా.