బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న ‘ఎ’ రేటెడ్ సినిమాలు.. ఆడియెన్స్ వైలెన్స్ ఇష్టపడుతున్నారా?
ఆడియెన్స్ టేస్ట్ మారుతోందా? ఎ రేటెడ్ సినిమాలను చూడటానికి ఇష్టపడుతున్నారా? కాస్త బోల్డ్, వైలెన్స్ ఉన్న మూవీస్ ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుండటమే దీనికి కారణం. దీనికి తాజా ఉదాహరణ ధురంధర్.
సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చిందంటే ఒకప్పుడు ఆ సినిమా వసూళ్లు తగ్గుతాయని నిర్మాతలు భయపడేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కంటెంట్ లో దమ్ముంటే 'A' రేటింగ్ సినిమాలకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన టాప్ 'A' రేటింగ్ సినిమాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. తాజాగా ధురంధర్ సినిమా రూ.1000 కోట్ల మార్క్ దాటి ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచింది.

బాక్సాఫీస్ వద్ద 'A' సర్టిఫికేట్ సినిమాల హవా
గతంలో కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ వస్తేనే సినిమాలు హిట్ అవుతాయనే నమ్మకం ఉండేది. కానీ నేటి యువత "రా అండ్ రస్టిక్" కంటెంట్‌ను కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే అత్యంత హింస, బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ కొన్ని సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి.
ధురంధర్
తాజాగా ధురంధర్ మూవీ రూ.1000 కోట్ల మార్క్ దాటింది. సెన్సార్ బోర్డు నుంచి ‘ఎ’ సర్టిఫికెట్ అందుకొని ఈ మార్క్ దాటిన తొలి ఇండియన్ మూవీ ఇదే. యానిమల్ పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. మితిమీరిన హింస ఉన్నా కూడా ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. అంతేకాదు అత్యంత వేగంగా అంటే కేవలం 21 రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ అందుకున్న ఇండియన్ మూవీ ఇదే కావడం విశేషం.
యానిమల్
2023లో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం. తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషన్‌ను అత్యంత హింసాత్మకంగా చూపించిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 'A' రేటింగ్ ఇచ్చింది. అయినా ప్రపంచవ్యాప్తంగా రూ.917 కోట్లు వసూలు చేసింది.
సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్
రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాకు కూడా 'A' సర్టిఫికేట్ లభించింది. ఇందులోని మితిమీరిన హింస కారణంగా సెన్సార్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయినా ఈ మూవీ సుమారు రూ.700 కోట్ల వరకూ వసూలు చేసింది.
కూలీ
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మూవీ అయినా కూలీకి కూడా ఎ సర్టిఫికెటే ఇచ్చారు. ఇందులోనే హింస కారణంగానే సెన్సార్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కూడా రూ.518 కోట్లు వసూలు చేయడం విశేషం.
అర్జున్ రెడ్డి / కబీర్ సింగ్
తెలుగులో 'అర్జున్ రెడ్డి', హిందీలో 'కబీర్ సింగ్'.. ఈ రెండు సినిమాలు 'A' రేటింగ్ ట్రెండ్‌ను సెట్ చేశాయి. యూత్ ఎమోషన్స్‌ను పీక్స్‌లో చూపించడంతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. కబీర్ సింగ్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.377 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.
కిల్
ఇటీవల వచ్చిన బాలీవుడ్ సినిమా కిల్ అత్యంత క్రూరమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో వార్తల్లో నిలిచింది. ఒక రైలు ప్రయాణంలో జరిగే హింసను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. బడ్జెట్ తక్కువైనా, బాక్సాఫీస్ దగ్గర మంచి లాభాలను ఆర్జించింది. విదేశాల్లో కూడా ఈ సినిమాకు గొప్ప ఆదరణ లభించింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


