...
...
Next Story

Dil Raju: భార్యతో కలిసి దిల్ రాజు మాస్ డ్యాన్స్.. వినాయక నిమజ్జనంలో ఫుల్ జోష్.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు మాస్ డ్యాన్స్ తో అదరగొట్టారు. తన భార్య, పిల్లలతో కలిసి స్టెప్పులు కుమ్మేశారు. తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్ గణపతి నిమజ్జనంలో భాగంగా దిల్ రాజు డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

Published on: Sep 20, 2026, 14:43:55 IST
Advertisement

Dil Raju: తెలుగులో సూపర్ డూపర్ హిట్స్ తో టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా ఎదిగిన దిల్ రాజు పేరు ఇప్పుడు సోసల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. తన ప్రొడక్షన్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్ గణపతి నిమజ్జనంలో ఆయన మాస్ డ్యాన్స్ చేయడమే అందుకు కారణం. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

భార్యతో కలిసి దిల్ రాజు డ్యాన్స్

భార్యతో కలిసి దిల్ రాజు మాస్ డ్యాన్స్.. వినాయక నిమజ్జనంలో ఫుల్ జోష్.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
భార్యతో కలిసి దిల్ రాజు మాస్ డ్యాన్స్.. వినాయక నిమజ్జనంలో ఫుల్ జోష్.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

వినాయక నిమజ్జన వేడుకల్లో దిల్ రాజు డ్యాన్స్ వైరల్ గా మారింది. ఆయన మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. తన ఆఫీస్ స్టాఫ్, సన్నిహితులతో కలిసి దిల్ రాజు డ్యాన్స్ చేశారు. ఆయన చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. జోష్ తో డ్యాన్స్ చేశారు. ఆయన భార్య తేజస్విని కూడా స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు.

వీడియో వైరల్

దిల్ రాజు, ఆయన భార్య తేజస్విని డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. వీళ్ల డ్యాన్స్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వినాయక నిమజ్జన వేడుకల్లో దిల్ రాజు స్వయంగా గణేషుడి రథాన్ని డ్రైవ్ చేశారు. ఆయన పక్కనే కొడుకును ఎత్తుకొని తేజస్విని కూర్చున్నారు.

దిల్ రాజు ఫ్యామిలీ

దిల్ రాజు ఫస్ట్ అనితను పెళ్లి చేసుకున్నారు. కానీ ఆమె 2017లో గుండెపోటుతో మరణించారు. ఈ దంపతులకు హన్షిత అనే కూతురు ఉంది. దిల్ రాజు 2020లో తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత తేజస్విని తన పేరును వ్యాఘరెడ్డిగా మార్చుకున్నారు.

సినిమాలు ఇలా

ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా దూసుకెళ్తున్నారు దిల్ రాజు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు నిర్మిస్తూనే ఉన్నారు. 2025లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు దిల్ రాజు. కానీ ఆ తర్వాత నితిన్ తో తీసిన తమ్ముడు మూవీ అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

రీసెంట్ గా తెలుగులో టాక్సిక్ మూవీని డిస్ట్రిబ్యూట్ చేశారు దిల్ రాజు. కానీ ఈ మూవీ కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా, విజయ్ దేవరకొండతో ‘రౌడీ జనార్ధన’, దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ‘ఎల్లమ్మ’ను దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రాలతో దిల్ రాజు తిరిగి సక్సెస్ బాట పడతారేమో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks