Top Web Series: మైండ్ బ్లాక్ ట్విస్టులు.. సూపర్ థ్రిల్లర్స్.. ఓటీటీలోకి 2026లో వచ్చిన టాప్ 11 వెబ్ సిరీస్..ఎన్ని చూశారు?
Top Web Series: ఓటీటీలోకి ఈ ఏడాది సూపర్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఇవి అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్ 11 ఏవో చూడండి.
Top Web Series: ఓటీటీ ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ టాప్ ఐఎండీబీ రేటింగ్ తో దూసుకెళ్తున్నాయి. ఈ ఏడాది రిలీజైన ఆ సిరీస్ లో టాప్ 11 ఏవో ఇక్కడ చూడండి. ఇవన్నీ కనీసం 6, అంతకంటే ఎక్కువ రేటింగ్ సాధించినవే. వీటిలో థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్‌స్పిరేషనల్ వెబ్ సిరీస్ ఉన్నాయి. తక్కువ నుంచి ఎక్కువ రేటింగ్ సాధించిన టాప్ 11 వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ చూడండి.

1. బ్రౌన్ (Brown): జీ5 (ZEE5)
రేటింగ్: 6.6 / 10
'సిటీ ఆఫ్ డెత్' పుస్తకం ఆధారంగా తెరకెక్కిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఈ బ్రౌన్. కోల్‌కతా పోలీస్ డిటెక్టివ్ రీటా బ్రౌన్ (కరిష్మా కపూర్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వరుసగా అమ్మాయిల హత్యలు చేజ్ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కరిష్మా నటించింది. జీ5 ఓటీటీలో దీనిని చూడొచ్చు.
2. సంకల్ప్ (Sankalp): అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్
రేటింగ్: 6.6 / 10
ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝా మార్క్ సోషియో-పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్ ఇది. ప్రాచీన భారతదేశ చరిత్రలోని చాణక్య-చంద్రగుప్త గురుశిష్యుల బంధాన్ని నేటి ఆధునిక భారతీయ రాజకీయాలు, బ్యూరోక్రసీ (పరిపాలన యంత్రాంగం) బ్యాక్‌డ్రాప్‌కు అన్వయించి ఈ కథను అద్భుతంగా రాసుకున్నారు. నానా పటేకర్, మహ్మద్ జీషాన్ అయ్యూబ్, కుబ్రా సైత్, సంజయ్ కపూర్, నీరజ్ కాబీ లాంటి వాళ్లు నటించిన ఈ సిరీస్ ను ఫ్రీగా అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో చూడొచ్చు.
3. ద పిరమిడ్ స్కీమ్ (The Pyramid Scheme) : అమెజాన్ ప్రైమ్ వీడియో
రేటింగ్: 6.7 / 10
హరిద్వార్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. పిరమిడ్ స్కీమ్ తో సమాజంలో జరుగుతున్న భారీ మోసాన్ని కామెడీ జోడించి చెప్పే ప్రయత్నం చేశారు. దీనిని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
4. గ్లోరీ (Glory) : నెట్‌ఫ్లిక్స్
రేటింగ్: 6.7 / 10
'మీర్జాపూర్' ఫేమ్ కరణ్ అన్షుమన్ దర్శకత్వంలో వచ్చిన హై-వోల్టేజ్ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. బాక్సింగ్ ప్రపంచం, ఒలింపిక్ మెడల్స్ సాధించడం వెనుక ఉన్న దారుణమైన నిజాలను ఈ సిరీస్ కళ్లకు కట్టింది. రింగులో బాక్సింగ్, బయట ఓ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కలిపి సాగుతుంది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సిరీస్ చూడొచ్చు.
5. తస్కరి: ద స్మగ్లర్స్ వెబ్: నెట్‌ఫ్లిక్స్
రేటింగ్: 7.1 / 10
నీరజ్ పాండే క్రియేట్ చేసిన ఇంటెన్స్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రాణాలు పణంగా పెట్టి ఎలా పనిచేస్తారో ఇందులో రియలిస్టిక్‌గా చూపించారు. ఇమ్రాన్ హష్మీ ఇందులో కస్టమ్స్ సూపరింటెండెంట్ అర్జున్ మీనా పాత్రలో కనిపించాడు. నెట్‌ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ చూడొచ్చు.
6. మట్కా కింగ్ (Matka King): ప్రైమ్ వీడియో
రేటింగ్: 7.2 / 10
ముంబై నగరాన్ని ఒకప్పుడు శాసించిన సట్టా (మట్కా) జూదం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన రా అండ్ రస్టిక్ క్రైమ్ డ్రామా సిరీస్ ఇది. బ్రిజ్ భట్టి (విజయ్ వర్మ) అనే ఒక సాధారణ పత్తి వ్యాపారి, అనుకోకుండా ముంబై నగరంలో 'మట్కా' అనే సరికొత్త బెట్టింగ్ గేమ్‌ను ప్రారంభిస్తాడు. కేవలం కొద్ది రోజుల్లోనే ఆ ఆట మొత్తం ముంబైని ఎలా తన గుప్పిట్లోకి తీసుకుంది? ఒక సాధారణ వ్యాపారి కాస్తా ముంబై గ్యాంబ్లింగ్ డాన్‌గా ఎలా ఎదిగాడు అనేది అద్భుతంగా చూపించారు. ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
7. రాఖ్ (Raakh) : ప్రైమ్ వీడియో
రేటింగ్: 7.6 / 10
నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్న పిల్లలు అకస్మాత్తుగా కిడ్నాప్ అవ్వడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ ఆ మిస్టరీని ఛేదించే కొద్దీ ఎలాంటి భయంకరమైన నిజాలు బయటపడ్డాయన్నది ఇందులో చూడొచ్చు. ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
8. హలో బచ్చో (Hello Baccho): నెట్‌ఫ్లిక్స్
రేటింగ్: 8.0 / 10
ప్రముఖ ఎడ్-టెక్ ప్లాట్‌ఫామ్ 'ఫిజిక్స్ వాలా' (Physics Wallah) ఫౌండర్ అలఖ్ పాండే జీవిత కథ ఆధారంగా ప్రముఖ నిర్మాణ సంస్థ టీవీఎఫ్ (TVF) క్రియేట్ చేసిన బయోగ్రాఫికల్ ఎమోషనల్ డ్రామా ఇది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఒక సాధారణ సగటు ఉపాధ్యాయుడు, కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల దోపిడీ వ్యవస్థను ఎదుర్కొని, కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా దేశంలోని కోట్లాది మంది పేద పిల్లలకు అత్యంత తక్కువ ధరకే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా అందించాడు అనేది స్ఫూర్తిదాయకంగా చూపించారు. నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.
9. హథ్రస్ (Hathras): జీ5 ఓటీటీ
రేటింగ్: 8.1 / 10
2020లో ఉత్తరప్రదేశ్‌లోని హథ్రస్‌లో ఒక దళిత యువతిపై జరిగిన దారుణమైన అత్యాచారం, ఆమె మరణంలాంటి నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించిన డాక్యు-సిరీస్ (Docu-Series) ఇది. డైరెక్టర్ పాట్రిక్ గ్రాహం, జర్నలిస్ట్ తనూశ్రీ పాండే గ్రౌండ్ లెవెల్లో బాధితురాలి కుటుంబ సభ్యులు, కేసును దర్యాప్తు చేసిన అధికారులు, ప్రత్యక్ష సాక్షులను ఇంటర్వ్యూ చేయడం, ఆ 16 రోజులు ఏం జరిగిందన్నది ఇందులో చూపించారు. జీ5లో చూడొచ్చు.
10. మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ: ఎంఎక్స్ ప్లేయర్
రేటింగ్: 8.7 / 10
1980ల నాటి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక అద్భుతమైన బయోగ్రాఫికల్ ఇండస్ట్రియల్ డ్రామా ఇది. భారతదేశపు గర్వకారణమైన పారిశ్రామికవేత్త జె.ఆర్.డి. టాటా, గ్జెర్సెస్ దేశాయ్ ల జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. టైటన్ వాచ్ చరిత్రను కళ్లకు కట్టే ఈ వెబ్ సిరీస్ కచ్చితంగా చూసి తీరాల్సిందే. ఎంఎక్స్ ప్లేయర్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది.
11. సప్నే వర్సెస్ ఎవ్రీవన్ సీజన్ 2: ప్రైమ్ వీడియో
రేటింగ్: 9.6 / 10
టీవీఎఫ్ (TVF) చరిత్రలోనే ఆల్ టైమ్ హైయెస్ట్ రేటింగ్ సాధించిన కల్ట్ క్లాసిక్ వెబ్ సిరీస్ రెండవ సీజన్ ఇది. అంబరీష్ వర్మ స్వయంగా కథ అందించి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ప్రశాంత్ నరులా, జిమ్మీ మెహతా అనే ఇద్దరు మధ్యతరగతి కుర్రాళ్ల జీవితాల చుట్టూ తిరుగుతుంది. పరమ్‌వీర్ సింగ్ చీమా, అంబరీష్ వర్మల నటన ఈ సిరీస్‌కు ప్రాణంగా నిలిచింది. ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ చూడొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


