...
...
Next Story

Toxic Collection: బాక్సాఫీస్ ఊచకోత.. నెగెటివ్ టాక్‌తోనూ దుమ్మురేపిన టాక్సిక్‌.. య‌శ్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు అదుర్స్

Toxic Collection: నెగెటివ్ రివ్యూలు వచ్చినా.. నెట్టింట ట్రోల్స్ మోత మోగుతున్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం టాక్సిక్ ఊచకోత కోసింది. అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా టాక్సిక్ మూవీకి ఫస్ట్ డే ఊహించని కలెక్షన్లు వచ్చాయి. టాక్సిక్ చిత్రం డే 1 కలెక్షన్లలో రికార్డులు క్రియేట్ చేసింది.

Published on: Aug 27, 2026, 05:38:26 IST
Advertisement

Toxic Collection: నెగెటివ్ రివ్యూలు, విడుదల వాయిదా వార్తలు, కథలో హింస, ఘాటైన శృంగార సన్నివేశాలపై చెలరేగిన వివాదాలు... ఇవేవీ రాకింగ్ స్టార్ యశ్ బాక్సాఫీస్ ఊచకోతను అడ్డుకోలేకపోయాయి. కేజీఎఫ్ సిరీస్ తర్వాత నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం యశ్ హీరోగా వచ్చిన 'టాక్సిక్' చిత్రం థియేటర్లలో సునామీ సృష్టిస్తోంది. ఓనం పండుగ సందర్భంగా బుధవారం (ఆగస్టు 26) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలిరోజే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

టాక్సిక్ కలెక్షన్

బాక్సాఫీస్ ఊచకోత.. నెగెటివ్ టాక్‌తోనూ దుమ్మురేపిన టాక్సిక్‌.. య‌శ్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు అదుర్స్ (x/Toxic)
బాక్సాఫీస్ ఊచకోత.. నెగెటివ్ టాక్‌తోనూ దుమ్మురేపిన టాక్సిక్‌.. య‌శ్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు అదుర్స్ (x/Toxic)

బాక్సాఫీస్ అంచనాల ట్రాకింగ్ సంస్థ 'సాక్‌నిల్క్' (Sacnilk) నివేదిక ప్రకారం, 'టాక్సిక్' చిత్రం ఇండియాలో ఫస్ట్ రోజు ఏకంగా రూ.101 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. ఇందులో అత్యధిక వాటా హిందీ వెర్షన్ నుంచే రావడం విశేషం. కేవలం హిందీ డబ్బింగ్ వర్షన్ ద్వారానే తొలిరోజే రూ.55 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదయ్యాయి. ఇక మాతృభాష అయిన కన్నడ వెర్షన్ రూ.25 కోట్ల లోపే వసూలు చేసినప్పటికీ, రోజంతా థియేటర్లలో ఏకంగా 89 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఇక తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. తమిళ, మలయాళ వర్షన్లు మాత్రం కాస్త మందకొడిగా సాగుతున్నాయి.

ఆ రికార్డులు అవుట్

గతేడాది డిసెంబర్‌లో విడుదలై సంచలనం క్రియేట్ చేసిన ధురంధర్ రికార్డును టాక్సిక్ తో యశ్ బ్రేక్ చేశాడు. రూ.1300 కోట్ల కలెక్షన్లు సాధించిన ధురంధర్ ఓపెనింగ్ వసూళ్లను టాక్సిక్ మూవీ మార్నింగ్ షోల ద్వారానే దాటేసింది. రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' చిత్రం రూ.28 కోట్ల నెట్ ఓపెనింగ్‌తో మొదలైంది.

అయితే, 2026లో బెస్ట్ ఓపెనింగ్ సాధించిన 'ధురంధర్ 2' (రూ.103 కోట్లు) రికార్డును దాటడంలో 'టాక్సిక్' తృటిలో విఫలమైంది. అలాగే కన్నడ సినీ చరిత్రలోనే అత్యధికంగా 'కేజీఎఫ్ చాప్టర్ 2' సాధించిన రూ.116 కోట్ల తొలిరోజు ఆల్‌టైమ్ రికార్డును కూడా ఈ సినిమా అందుకోలేకపోయింది.

అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రూ. 60 కోట్ల హవా

ఆగస్టు 21న ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ప్రీ-సేల్స్ ద్వారానే టాక్సిక్ సినిమా స్థాయి ఏమిటో స్పష్టమైంది. ఐదు రోజుల పాటు సాగిన బుకింగ్స్ మోతతో బుధవారం ఉదయానికి ఏకంగా 18 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే తొలిరోజు కోసం రూ. 60 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

'A' సర్టిఫికేట్‌తో సంచలనం

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ భారీ రివేంజ్ డ్రామాలో యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రలు పోషించారు. సినిమాలో ఉన్న ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు, బోల్డ్ సంభాషణలతో పాటు మహిళలను చూపించిన విధానంపై వివాదాలు నెలకొన్నప్పటికీ, సెన్సార్ బోర్డు (CBFC) ఎలాంటి కట్స్ లేకుండా ఈ చిత్రానికి 'A' (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికేట్ మంజూరు చేసింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe