...
...
Next Story

Toxic Collections: కేజీఎఫ్ రేంజ్ అనుకుంటే దెబ్బకొట్టిన అడల్ట్ కంటెంట్-మండే టెస్టులో టాక్సిక్ ఫెయిల్-యశ్ మూవీకి 7 కోట్లే!

Toxic Collections: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయిందే! ఇప్పుడు టాక్సిక్ సినిమా విషయంలో ట్రేడ్ వర్గాలు అంటున్న మాట ఇదే. భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ఈ యశ్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. మండే టెస్టులో దారుణంగా ఫెయిల్ అయింది. కేజీఎఫ్ రేంజ్ కు దూరంగా నిలిచిపోయింది.

Published on: Sep 1, 2026, 09:11:00 IST
Advertisement

Toxic Collections: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Grown-Ups) సినిమా మండే టెస్టులో దారుణంగా ఫెయిల్ అయింది. బంపర్ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం, ఆరవ రోజు నాటికి సింగిల్ డిజిట్ వసూళ్లకు పడిపోయి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూలు రావడం కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది.

టాక్సిక్ కలెక్షన్ల పతనం

కేజీఎఫ్ రేంజ్ అనుకుంటే దెబ్బకొట్టిన అడల్ట్ కంటెంట్-మండే టెస్టులో టాక్సిక్ ఫెయిల్-యశ్ మూవీకి 7 కోట్లే! (x/Toxic_themovie)
కేజీఎఫ్ రేంజ్ అనుకుంటే దెబ్బకొట్టిన అడల్ట్ కంటెంట్-మండే టెస్టులో టాక్సిక్ ఫెయిల్-యశ్ మూవీకి 7 కోట్లే! (x/Toxic_themovie)

మొదటి రోజు కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘టాక్సిక్’, ఆ తర్వాత అదే ఊపును కొనసాగించడంలో దారుణంగా విఫలమైంది. దేశవ్యాప్తంగా తొలిరోజు రూ.101 కోట్ల నెట్ (రూ. 120 కోట్ల గ్రాస్) వసూలు చేసి, ఈ ఏడాది ‘ధురంధర్ 2’ (రూ.103 కోట్లు) తర్వాత సెకండ్ బెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది టాక్సిక్.

మండే టెస్టు

టాక్సిక్ సినిమాకు వచ్చిన నెగెటివ్ టాక్ ప్రభావంతో.. శనివారం రూ.25.15 కోట్లు, ఆదివారం రూ.23 కోట్లు మాత్రమే రాబట్టింది. సోమవారం (సెప్టెంబర్ 1) నాటికి ఏకంగా 67.6% క్షీణించి కేవలం రూ.7.45 కోట్ల నెట్ వసూలు చేసింది. దేశవ్యాప్తంగా 13,400 షోలో కేవలం 17.1% ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది.

కేజీఎఫ్ 2 ఇలా

‘కేజీఎఫ్ 2’ మొదటి ఐదు రోజుల్లో ఇండియాలో రూ.430.15 కోట్లు రాబట్టగా.. ‘టాక్సిక్’ అందులో సగం కూడా సాధించలేకపోయింది. టాక్సిక్ ఆరు రోజులకు గాను ఇండియాలో మొత్తం రూ.221.55 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా రూ.304.05 కోట్ల గ్రాస్ సాధించింది.

యశ్‌కు అండగా సుమలత

‘‘బహుశా టాక్సిక్ దాని కాలం కంటే ముందున్న సినిమా కావచ్చు లేదా కొంతమంది దానిని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. ఈ సినిమాలో నీ నటన అద్భుతం. ఇలాంటి నెగెటివ్ టాక్‌ను ఒక చిటికెడు ఉప్పులా భావించి వదిలేయ్" అని ఆమె యశ్‌కు ధైర్యం చెప్పారు.

ఫెయిల్యూర్‌కు అసలు కారణం ఏంటి?

ఒక పాన్-ఇండియా యాక్షన్ స్టార్ సినిమాకు కేవలం భారీ ఓపెనింగ్స్ వస్తే సరిపోదు.. రిపీట్ ఆడియన్స్ ఉండాలి. ‘కేజీఎఫ్’ ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా. అందులో తల్లి సెంటిమెంట్ పండింది. కానీ, గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే టాక్సిక్ లోని మితిమీరిన వయొలెన్స్, మహిళలను తక్కువ చేసి చూపించే సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రాకుండా అడ్డుకున్నాయి.

గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ స్టైల్ ఒక డార్క్ ఆర్ట్ ఫిల్మ్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌కు దగ్గరగా ఉంటుంది. మాస్ ఆడియన్స్ కోరుకునే రెగ్యులర్ ఎలివేషన్స్, కమర్షియల్ హంగులు మిస్ అవ్వడం వల్ల కూడా టాక్సిక్ కు దెబ్బపడిందని అంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe