యశ్ లేటెస్ట్ సినిమా 'టాక్సిక్' టీజర్‌లోని ఓ ఇంటిమేట్ సీన్‌పై రేగిన దుమారానికి దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ చెక్ పెట్టింది. "స్త్రీల ఆనందం, సమ్మతి గురించి జనం ఇంకా చర్చిస్తూనే ఉన్నారు.. నేను మాత్రం చిల్ అవుతున్నా" అంటూ విమర్శలకు ఘాటుగా బదులిచ్చింది. దీనిపై ఆర్జీవీ ప్రశంసలు కురిపించగా.. సోషల్ మీడియాలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
టాక్సిక్ టీజర్ ఇలా..

రాకింగ్ స్టార్ యశ్ పుట్టినరోజు కానుకగా జనవరి 8న విడుదలైన 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic: A Fairy Tale for Grown-Ups) టీజర్ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. అయితే ఇందులో యశ్ కనిపించిన తీరు కంటే.. టీజర్‌లో చూపించిన ఒక బోల్డ్ సీన్ పైనే ఇప్పుడు రచ్చ జరుగుతోంది.
బయట తుపాకుల మోత మోగుతుండగా.. కారులో హీరో రాయ (యశ్), ఓ యువతితో శృంగారంలో పాల్గొంటున్నట్లు చూపించిన షాట్ తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఎట్టకేలకు మౌనం వీడింది. అయితే ఆమె సెటైరికల్ గా రియాక్ట్ అయింది.
నేను 'చిల్' అవుతున్నా: గీతూ మోహన్‌దాస్
టాక్సిక్ మూవీ టీజర్ విడుదలైనప్పటి నుంచి వస్తున్న విమర్శలకు ఆమె తనదైన శైలిలో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా బదులిచ్చింది. "మహిళల ఆనందం, వారి సమ్మతి, వ్యవస్థలతో స్త్రీలు ఆడుకోవడం.. వీటన్నింటిని జనం ఇంకా అర్థం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.. నేను మాత్రం చిల్ అవుతున్నా" అంటూ ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది.
ఆ సీన్ కేవలం శృంగారం కాదని, అది స్త్రీల స్వేచ్ఛకు, వారి అనుభవాలకు అద్దం పట్టే అంశమని ఆమె చెప్పకనే చెప్పింది. అంతేకాకుండా ఆ సీన్ లో ఉన్న యువతి పేరు బీట్రిస్ బాచ్ అని, ఆమెను తన "సిమెట్రీ గర్ల్" అని గీతూ పరిచయం చేసింది.
అక్కడ చేస్తే బూతు అంటారు..
{{/usCountry}}ఆ సీన్ కేవలం శృంగారం కాదని, అది స్త్రీల స్వేచ్ఛకు, వారి అనుభవాలకు అద్దం పట్టే అంశమని ఆమె చెప్పకనే చెప్పింది. అంతేకాకుండా ఆ సీన్ లో ఉన్న యువతి పేరు బీట్రిస్ బాచ్ అని, ఆమెను తన "సిమెట్రీ గర్ల్" అని గీతూ పరిచయం చేసింది.
అక్కడ చేస్తే బూతు అంటారు..
{{/usCountry}}టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. గతంలో సినిమాల్లో మహిళలను అశ్లీలంగా చూపించడంపై, సెక్సిజంపై గీతూ మోహన్‌దాస్ చాలా గట్టిగా గళం వినిపించింది. "మరి ఇప్పుడు సొంత సినిమాలో ఆ పని ఎందుకు చేశారంటూ" కొందరు ఆమెను ప్రశ్నిస్తున్నారు.
ఇది ఆమె ద్వంద్వ వైఖరి (Hypocrisy) అని, కొత్తదనం పేరుతో పాత మూస దృశ్యాలనే చూపించారని మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే ఆమె అభిమానులు మాత్రం.. ఇది "పెద్దల కోసం తీసిన సినిమా" అని, దర్శకురాలి సృజనాత్మక స్వేచ్ఛను గౌరవించాలని సమర్థిస్తున్నారు.
వేదాంత్ కౌశిక్ అనే ఓ యూట్యూబర్ అయితే దీనిపై మరింత ఘాటుగా స్పందించాడు. భోజ్‌పురిలో ఇదే తీస్తే బూతు అంటారు.. మీరు తీస్తే సినిమానా అంటూ ట్వీట్ చేశాడు.
టాక్సిక్ సినిమా గురించి..
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. యశ్ సరసన నయనతార, హుమా ఖురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా వంటి భారీ తారాగణం ఇందులో ఉంది. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇతర భారతీయ భాషల్లోకి డబ్ చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది.