...
...
Next Story

Toxic OTT: య‌ష్‌కు దిమ్మ‌తిరిగే షాక్‌..టాక్సిక్ ఓటీటీ బిగ్ ట్విస్ట్..అప్పుడు 150 కోట్లు వ‌ద్ద‌న్నారు..ఇప్పుడు 30 కోట్లే!

Toxic OTT: టాక్సిక్ సినిమాతో భారీ డిజాస్టర్ ఖాతాలో వేసుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యష్ కు మరో షాక్ తగిలింది. ఈ మూవీ ఓటీటీ డీల్స్ విషయంలో ఊహించలేని ఎదురుదెబ్బ తగిలిందని సమాచారం. టాక్సిక్ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సమయంలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

Published on: Oct 10, 2026, 15:02:03 IST
Advertisement

Toxic OTT: రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన భారీ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'టాక్సిక్' (Toxic) బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ పరంగానూ ఈ మూవీకి షాక్ తగిలిందని తెలిసింది. ఈ సినిమా ప్రొడ్యూసర్లలో ఒకరైన యష్ కు టాక్సిక్ ఓటీటీ డీల్ తో ఊహించలేని షాక్ తగిలిందని అంటున్నారు.

టాక్సిక్ ఓటీటీ

య‌ష్‌కు దిమ్మ‌తిరిగే షాక్‌..టాక్సిక్ ఓటీటీ బిగ్ ట్విస్ట్..అప్పుడు 150 కోట్లు వ‌ద్ద‌న్నారు..ఇప్పుడు 30 కోట్లే!
య‌ష్‌కు దిమ్మ‌తిరిగే షాక్‌..టాక్సిక్ ఓటీటీ బిగ్ ట్విస్ట్..అప్పుడు 150 కోట్లు వ‌ద్ద‌న్నారు..ఇప్పుడు 30 కోట్లే!

బోల్డ్ యాక్షన్ డ్రామా టాక్సిక్ మూవీ ఓటీటీ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆగస్టు 26న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే ఆరు వారాలు కంప్లీట్ అయ్యాయి. అయినా ఓటీటీ రిలీజ్ పై మాత్రం క్లారిటీ లేదు. ఈ టాక్సిక్ మూవీ ఓటీటీ డీల్ ఇంకా క్లోజ్ కాకపోవడంమే అందుకు కారణంగా తెలుస్తోంది.

రూ.150 కోట్ల ఆఫర్

'కేజీఎఫ్ 2' వంటి సంచలన విజయం తర్వాత యష్ నుంచి వచ్చిన సినిమా కావడంతో 'టాక్సిక్' ప్రాజెక్ట్‌పై విడుదల ముందే గ్లోబల్ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ఏకంగా రూ.150 కోట్ల ఆఫర్‌ను మేకర్స్ ముందుంచినట్లు టాక్ నడిచింది.

అయితే, థియేటర్లలో సినిమా విడుదలై భారీ హిట్‌గా నిలిస్తే అంతకుమించిన భారీ మొత్తాన్ని దక్కించుకోవచ్చనే నమ్మకంతో యష్, నిర్మాణ సంస్థ ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు.

ఇప్పుడు రూ.30 కోట్లు

చివరకు ఓటీటీ డీల్ లాక్ చేయకుండానే 'టాక్సిక్' చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. కానీ తీరా థియేటర్లలోకి వచ్చాక కథ, కథనాలపై ప్రేక్షకుల నుంచి నెగెటివ్ వచ్చింది. యష్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో అంతవరకు భారీ ఆఫర్లతో పోటీపడిన అగ్ర ఓటీటీ సంస్థలన్నీ ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి.

అయితే ఈ డీల్ లో జీ5 ఓటీటీ మరో కండీషన్ కూడా పెట్టిందంటా. రూ.30 కోట్లలో సగం మొత్తం (రూ.15 కోట్లు) మాత్రమే ముందస్తుగా చెల్లిస్తారు. మిగిలిన 15 కోట్ల రూపాయలను ఓటీటీలో సినిమాకు వచ్చే వీక్షణలు, ఆడియన్స్ వ్యూయర్ షిప్ ప్రాతిపదికన మానిటైజ్ చేస్తూ చెల్లిస్తారు. ఈ డీల్ ఫైనలైజ్ అయితే అప్పుడు టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డేట్ పై అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశముంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks