Transfer Trimurthulu OTT: టాలీవుడ్ వింటేజ్ లవర్ బాయ్ వడ్డే నవీన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్. డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై ఆయన గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన లేటెస్ట్ ప్రాజెక్ట్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్ గా లాక్ అయింది. ఈ క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ జులై 17 నుంచి జీ5 (ZEE5) యాప్ లో స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పదేళ్ల తర్వాత ఈ సినిమాతో వచ్చిన నవీన్ కు థియేటర్లో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా.. ఓటీటీలో మాత్రం హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
నాటి గోల్డెన్ డేస్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్

ఒకప్పుడు 'పెళ్లి', 'చాలా బాగుంది', 'స్నేహితులు' లాంటి సూపర్ హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు వడ్డే నవీన్. తన క్యూట్ స్మైల్, నాచురల్ యాక్టింగ్ తో 90ల నాటి కుర్రకారును ఉర్రూతలూగించాడు. కమర్షియల్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తన ఫ్యామిలీ డ్రామాలతో ఇండస్ట్రీలో ఒక మార్క్ సెట్ చేశాడు.
ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్లో, సరైన కథలు సెట్ కాకనో ఇండస్ట్రీకి చాలా పెద్ద గ్యాప్ ఇచ్చాడు. గత నెల 19న ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమాతో మళ్లీ సిల్వన్ స్క్రీన్ కు తిరిగొచ్చాడు. ఆ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాకు థియేటర్లలో మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మా ఇంటి బంగారం రూపంలో గట్టి పోటీ ఎదురవడంతో పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది.
రాశీ సింగ్ గ్లామర్.. జీ5 పర్ఫెక్ట్ స్ట్రాటజీ
ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో వడ్డే నవీన్ కు జోడీగా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ రాశీ సింగ్ నటించింది. రీసెంట్ గా 'భూతద్ధం భాస్కర్ నారాయణ', 'పాపం పసివాడు' లాంటి ప్రాజెక్ట్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ భామ. ఇప్పుడు ఏకంగా ఓ సీనియర్ స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది.
“ఎదురు చూపులు ముగిశాయి.. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. వడ్డే నవీన్, రాశీ సింగ్ నటించిన ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు జీ5 తెలుగులో జులై 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జులై 17న ప్రీమియర్.. కేవలం జీ5లో తెలుగులో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
{{/usCountry}}“ఎదురు చూపులు ముగిశాయి.. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. వడ్డే నవీన్, రాశీ సింగ్ నటించిన ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు జీ5 తెలుగులో జులై 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జులై 17న ప్రీమియర్.. కేవలం జీ5లో తెలుగులో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
{{/usCountry}}