Trikala Trailer: ముడుపుల నుంచి రక్తం.. కోరికలు కోరిన వాళ్ల చావు.. భయపెడుతున్న శ్రద్ధా దాస్ థ్రిల్లర్ త్రికాల ట్రైలర్

Trikala Trailer: సనాతన ధర్మ రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన త్రికాల మూవీ ట్రైలర్ భయపెడుతూ సాగింది. శ్రద్ధా దాస్ నటించిన ఈ మూవీ మే 28న థియేటర్లలోకి రానుంది. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

Published on: May 26, 2026, 18:37:31 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Trikala Trailer: భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ ప్రపంచవ్యాప్తంగా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటి శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రలు పోషించారు. మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాధిక–శ్రీనివాస్ నిర్మించగా, చాగంటి ప్రొడక్షన్ LLP ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.

Trikala Trailer: ముడుపుల నుంచి రక్తం.. కోరికలు కోరిన వాళ్ల చావు.. భయపెడుతున్న శ్రద్ధా దాస్ థ్రిల్లర్ త్రికాల ట్రైలర్
Trikala Trailer: ముడుపుల నుంచి రక్తం.. కోరికలు కోరిన వాళ్ల చావు.. భయపెడుతున్న శ్రద్ధా దాస్ థ్రిల్లర్ త్రికాల ట్రైలర్

త్రికాల మూవీ విశేషాలు

ఇప్పటికే విడుదలైన త్రికాల మూవీ ట్రైలర్‌, ప్రమోషనల్ కంటెంట్, పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ముఖ్యంగా అడవి నేపథ్యంలో రూపొందించిన విజువల్స్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌, వెన్నులో వణుకు పుట్టించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇది కేవలం సాధారణ హారర్ థ్రిల్లర్ గా కాకుండా దైవిక శక్తులు, అతీత శక్తుల మధ్య జరిగే సస్పెన్స్‌భరితమైన మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కినట్టు తెలుస్తోంది. ముడుపులలో నుంచి రక్తం రావడం ఏంటి? కోరికలు కోరిన వాళ్లు చనిపోవడం ఏంటి అంటూ ట్రైలర్ వచ్చే డైలాగ్ మూవీ స్టోరీపై ఆసక్తి రేపుతోంది.

హైఎండ్ వీఎఫ్ఎక్స్, అద్భుతమైన కెమెరా వర్క్ సినిమాకు మరింత గ్రాండియర్ తీసుకువచ్చాయి. ముఖ్యంగా “అమ్మ” పాట ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. శ్రద్ధాదాస్ కొత్త లుక్‌, మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అజయ్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ‘త్రికాల’ టైటిల్ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

డైరెక్టర్ మణి ఏమన్నాడంటే?

“ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే ఒక శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ సాగుతుంది. సనాతన ధర్మంలోని కొన్ని ఆధ్యాత్మిక అంశాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇప్పటికే ట్రైలర్‌, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులకు ఇది సరికొత్త అనుభూతిని అందిస్తుంది” అని తెలిపారు.

నిర్మాతలు ఏమన్నారంటే?

“మైథలాజికల్ టచ్‌తో రూపొందిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంస్కృతి, ఆధ్యాత్మికత, థ్రిల్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ‘త్రికాల’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది” అని నిర్మాతలు పేర్కొన్నారు.

ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’, ‘స్పిరిట్’ వంటి చిత్రాలకు సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన అందించిన మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది.

టాలీవుడ్‌లో ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రద్ధాదాస్, ‘ఆర్య 2’, ‘గుంటూరు టాకీస్’, ‘ఏక్ మినీ కథ’, ‘డిక్టేటర్’, ‘నాగవల్లి’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ‘త్రికాల’లో మరో విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మొత్తంగా మైథలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ‘త్రికాల’ మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More