Trisha Vijay: ఎంతో ఉత్కంఠ, మరెంతో సస్పెన్స్.. నిమిషం నిమిషం మారే సమీకరణాలు.. బలం కోసం ఎడతెగని ప్రయత్నాలు.. చివరకు విజయ్ సాధించారు. దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు అధిపతిగా నిలిచారు. ‘సీ విజయ్ జోసెఫ్ అను నేను’ అంటూ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో సందడి మొత్తం త్రిషదే కావడం గమనార్హం.
స్పెషల్ అట్రాక్షన్ త్రిష

ఆదివారం (మే 10) చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు తమిళనాడులోని రాజకీయ, సినీ రంగ ప్రముఖులతో పాటు నేషనల్ సెలబ్రిటీలు కూడా అటెండ్ అయ్యారు. అయితే ఇందులో అందరికంటే స్పెషల్ అట్రాక్షన్ గా త్రిష నిలిచింది.
విజయ్ తల్లిదండ్రులతో
విజయ్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి త్రిష హాజరైంది. ఎంతో పద్ధతిగా చీరకట్టులో ఈ భామ మురిసిపోయింది. వేదిక ముందుకు వస్తూనే నవ్వులు చిందించింది. సంతోషమంతా ఆమె ముఖంలోనే కనిపించింది. అక్కడున్న వాళ్లను హ్యాపీగా త్రిష పలకరించింది. ఆ తర్వాత విజయ్ తల్లిదండ్రులను కలిసింది. విజయ్ అమ్మను హత్తుకుంది.
ముందు వరుసలో
విజయ్ తల్లిదండ్రులతో పాటు త్రిష, వాళ్ల అమ్మ ముందు వరుసలో కూర్చుకున్నారు. స్టేజీకి ముందు ఏర్పాటు చేసిన ఫస్ట్ వరుసలోని కుర్చీల్లో విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష కూర్చోవడం హాట్ టాపిక్ గా మారింది. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో త్రిషకు ఈ రేంజ్ లో ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సీఎంగా విజయ్
ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్న విజయ్ సినీ కెరీర్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. టీవీకే పార్టీని స్థాపించిన ఆయన.. జనాల ఓట్లు సంపాదించడం కోసం చాలా కష్టపడ్డారు. ఎన్నికల్లో ఆయన పార్టీ ఏకంగా 108 స్థానాల్లో గెలిచింది. కానీ అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ను అందుకోలేకపోయింది.
{{/usCountry}}ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్న విజయ్ సినీ కెరీర్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. టీవీకే పార్టీని స్థాపించిన ఆయన.. జనాల ఓట్లు సంపాదించడం కోసం చాలా కష్టపడ్డారు. ఎన్నికల్లో ఆయన పార్టీ ఏకంగా 108 స్థానాల్లో గెలిచింది. కానీ అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ను అందుకోలేకపోయింది.
{{/usCountry}}ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విజయ్ రెండు చోట్ల గెలవడంతో మొత్తం సీట్లలో ఒక సీటు తగ్గించాల్సి వచ్చింది. దీంతో టీవీకే బలం 107కు పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఎం (2), వీసీకే (2), ఐయూఎంఎల్ (2) టీవీకేకు సపోర్ట్ చేయడంతో సీఎం పీఠాన్ని అధిరోహించారు విజయ్.
త్రిషతో రిలేషన్ షిప్
మరోవైపు త్రిషతో విజయ్ రిలేషన్ షిప్ పై కొంతకాలంగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. మరో హీరోయిన్ కు విజయ్ కు అక్రమ సంబంధం ఉందని అతని భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే త్రిష పేరు తెరపైకి వచ్చింది. అప్పటి నుంచి త్రిష, విజయ్ కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.