తమిళనాడు రాజకీయాల్లో సినిమా తారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఈ వేడి కారణంగానే దళపతి విజయ్‌ను టార్గెట్ చేశారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ట్రెండింగ్‌లో పర్సనల్ విషయాలు

తమిళ నాట ఓ వైపు రాజకీయాలతోపాటు మరోవైపు విజయ్ పర్సనల్ విషయాలు ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. దళపతి విజయ్ భార్య సంగీత విడాకులు కావలంటూ చెన్నై కోర్టును ఆశ్రయించడం, హీరోకు ఓ హీరోయిన్‌తో అక్రమ సంబంధం ఉందంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలు సౌత్ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపాయి.
పేరు చెప్పకుండా సంగీత చేసిన వ్యాఖ్యలు ఇన్‌డైరెక్ట్‌గా హీరోయిన్ త్రిషను చూపించాయి. విజయ్‌తో ఎఫైర్ పెట్టుకుంది హీరోయిన్ త్రిషనే అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఏజీఎస్ ప్రొడక్షన్ అధినేత కల్పతి సురేష్ కుమారుడి వివాహ వేడుకకు విజయ్, త్రిష జంటగా హాజరు కావడం ఆ రూమర్స్‌కు బలాన్ని చేకూర్చాయి.
మ్యాచింగ్ డ్రెస్సులో
మ్యాచింగ్ డ్రెస్సింగ్‌తో పెళ్లిలో విజయ్, త్రిష కనిపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దాంతో సంగీత చేసిన కామెంట్స్ నిజమే కావొచ్చంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. ఈ తరుణంలో గతంలో త్రిష సరదాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి.
సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్‌కు సంబంధించిన ఒక పాత ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అది 2004 నాటి మాట.. అప్పుడప్పుడే త్రిష స్టార్ హీరోయిన్‌గా ఎదిగే ప్రయత్నాల్లో ఉంది. అప్పట్లో సన్ టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ.. "భవిష్యత్తులో తమిళనాడుకు ముఖ్యమంత్రి కావాలన్నదే నా కోరిక" అని సరదాగా వ్యాఖ్యానించారు.
"నేను సీఎం అవుతా.. వేచి చూడండి!"
మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ డమ్ అందుకున్న త్రిషను, అప్పట్లో తన బకెట్ లిస్ట్ (చేయాలనుకున్న పనులు) గురించి అడిగారు యాంకర్.
{{/usCountry}}మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ డమ్ అందుకున్న త్రిషను, అప్పట్లో తన బకెట్ లిస్ట్ (చేయాలనుకున్న పనులు) గురించి అడిగారు యాంకర్.
{{/usCountry}}అప్పుడు త్రిష నవ్వుతూ.. "నిజంగా చెబుతున్నాను, నాకు తమిళనాడు సీఎం కావాలని ఉంది. వచ్చే పదేళ్లలో నేను ఆ పదవిని సాధిస్తాను, కావాలంటే వేచి చూడండి" అని బదులిచ్చారు. ఒకవేళ మీరు సీఎం అయితే ఏం చేస్తారు? అని ప్రశ్నించగా.. "ముందు మీరందరూ ఓట్లు వేసి నన్ను గెలిపించండి, అప్పుడు చెబుతాను ఏం చేస్తానో!" అని చమత్కరించారు త్రిష.
రాజకీయాల్లో ఎంట్రీ కోసమే
ఆనాడు త్రిష కేవలం సరదాగా అన్న ఆ మాటలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త చర్చకు దారితీశాయి. త్రిష సరదాగా అనిందో, లేక కావాలనే చెప్పిందో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఎంట్రీ కోసమే దళపతి విజయ్‌తో త్రిష క్లోజ్‌గా ఉంటోందని మరికొందరు అంటున్నారు.
విజయ్-త్రిష చుట్టూ రాజకీయాలు
ముఖ్యంగా దళపతి విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టాకే త్రిష పేరు తరచుగా వినిపిస్తోంది. రీసెంట్‌గా తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్.. విజయ్ పేరును ప్రస్తావిస్తూ త్రిషను ఈ వివాదంలోకి లాగడం పెద్ద దుమారమే రేపింది.
అనంతరం విజయ్ భార్య సంగీత విడాకులు, ఓ హీరోయిన్ అని చెప్పడం, వివాహ వేడుకలో విజయ్, త్రిష జంటంగా కనిపించడం వంటి విషయాలను నెటిజన్స్ లింక్ చేసి చూస్తున్నారు.
త్రిష-విజయ్ సినిమాలు
ఇదిలా ఉంటే, విజయ్-త్రిష గతంలో 'గిల్లి', 'లియో' వంటి హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. ఇటీవల 'ది గోట్' సినిమాలోనూ త్రిష ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారు.