Trisha: సినిమాలు మానేసి పెళ్లి చేసుకున్న త్రిష.. నలుగురు పిల్లలు కూడా.. భర్త కోటీశ్వరుడు.. హీరోయిన్ పోస్ట్ వైరల్

Trisha: విజయ్ తో అక్రమ సంబంధం రూమర్లు, సినిమాలు వదిలేస్తుందనే ప్రచారం నేపథ్యంలో హీరోయిన్ త్రిష స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. పెళ్లి చేసుకుని, నలుగురు పిల్లలను పెంచుతున్నానని ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టింది. 

Apr 7, 2026, 12:41:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్టార్ హీరోయిన్ సినిమాలు మానేసింది. పెళ్లి చేసుకుంది. నలుగురు పిల్లలను కూడా పెంచుతోంది. ఇదంతా ఎప్పుడు జరిగింది? అసలు ఇందులో ఏమైనా నిజం ఉందా? అని అనుకుంటున్నారా? మీ ప్రశ్నలు కరెక్టే. అయితే ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాలు చెప్పిన త్రిష లాస్ట్ లో ఓ ట్విస్ట్ ఇచ్చింది.

త్రిష (instagram-Trish)
త్రిష (instagram-Trish)

పెళ్లి చేసుకున్న త్రిష?

సినిమాల నుంచి త్రిష తప్పుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె ఘాటుగా స్పందించింది. తాను రిటైర్ అయిపోయి, పిల్లలను పెంచుకుంటున్నాననే వార్తలపై సెటైరికల్ గా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టింది. పెళ్లి చేసుకున్నానని ఇందులో పేర్కొంది.

త్రిష పోస్ట్‌లో ఏముంది?

"అవును.. నేను సినిమాలు మానేశా. ఒక కోటీశ్వరుడైన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నలుగురు పిల్లలను పెంచుతున్నా. ఏంటి, ఈరోజుకి మీ కల్పిత వార్తల కోటా పూర్తయిందా?" అంటూ త్రిష తనపై వస్తున్న పుకార్లపై గట్టిగా కౌంటర్ ఇచ్చింది.

త్రిష ఇన్ స్టాగ్రామ్ స్టోరీ (instagram)
త్రిష ఇన్ స్టాగ్రామ్ స్టోరీ (instagram)

హీరోయిన్ కౌంటర్

ఈ ఒక్క పోస్ట్‌తో తన రిటైర్మెంట్ వార్తలు కేవలం కట్టుకథలేనని త్రిష స్పష్టం చేసింది. పుకార్లను నమ్మవద్దని, ఇవన్నీ నిరాధారమైనవని త్రిష చెప్పకనే చెప్పింది. దళపతి విజయ్ తో అక్రమ సంబంధం రూమర్ల కారణంగా త్రిష ఎప్పుడూ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఆమె గురించిన ప్రతి విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.

పుకార్లకు కారణమేంటి?

ప్రముఖ సినీ విశ్లేషకుడు చిత్ర లక్ష్మణన్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల ఈ పుకార్లు మొదలయ్యాయి. త్రిష తన కెరీర్‌ను ముగించి, వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందనే అతని మాటలు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించాయి. దీనితో ఆమె అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే, త్రిష తనదైన శైలిలో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది.

బిజీ షెడ్యూల్‌

ప్రస్తుతం త్రిష చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగు, తమిళంలో అగ్ర హీరోల సరసన ఆమె నటిస్తోంది. చిరంజీవి 'విశ్వంభర'లో ఆమెనే హీరోయిన్. మరికొన్ని తమిళ సినిమాల షూటింగ్‌లో ఆమె బిజీగా ఉంది. ఈ దశలో ఆమె సినిమాలను వదిలిపెడతారన్న మాటలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టమవుతోంది. త్రిష ఇచ్చిన ఈ బోల్డ్ అండ్ హ్యూమరస్ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

త్రిష సినిమాల నుంచి తప్పుకుంటుందా?

లేదు, త్రిష సినిమాల నుంచి తప్పుకోవడం లేదు. తనపై వస్తున్న వార్తలను ఆమె సోషల్ మీడియా వేదికగా ఖండించింది.

త్రిష పెళ్లి వార్తల్లో నిజమెంత?

త్రిష ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారనే వార్తలు కేవలం పుకార్లేనని, వాటిలో ఎటువంటి నిజం లేదని ఆమె స్వయంగా వెల్లడించింది.

చిత్ర లక్ష్మణన్ వ్యాఖ్యలు ఏమిటి?

చిత్ర లక్ష్మణన్ ఒక సందర్భంలో త్రిష సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు, దీనివల్లే ఈ గందరగోళం మొదలైంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More