TV Actress: ప్రముఖ నటి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సంభావన సేథ్ జీవితంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. పెళ్లయి పదేళ్లు గడిచినా సంతానం కోసం ఆమె పడ్డ కష్టం, అనుభవించిన వేదన అంతా ఇంతా కాదు. తాజాగా తాను గర్భవతినని, సరోగసీ పద్ధతిలో తమ బిడ్డ త్వరలో రాబోతున్నాడని ఆమె అభిమానులతో పంచుకున్నారు.
వినూత్నంగా ప్రెగ్నెన్సీ ప్రకటన

గురువారం (ఏప్రిల్ 20) నాడు సంభావన తన భర్త అవినాష్‌తో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఒక ఫోటోలో వారు పట్టుకున్న న్యూస్ పేపర్‌పై “బ్రేకింగ్ న్యూస్.. మేము గర్భం దాల్చాము. సామ్-అవి బేబీ త్వరలో రాబోతోంది” అని రాసి ఉంది. మరో ఫోటోలో చిన్నారి బూట్లు పట్టుకుని, ఇంకో ఫోటోలో సోనోగ్రఫీ ఇమేజ్‌ను చూపిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
"మా అందమైన కథ ఇప్పుడు ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రేమ, ఆశ, సరోగసీ ద్వారా మా చిన్నారి రాబోతోంది. కౌంట్‌డౌన్ మొదలైంది" అంటూ ఈ జంట రాసుకొచ్చారు. ఈ వార్త తెలియగానే గౌహర్ ఖాన్, యువిక చౌదరి, హర్ష్ లింబాచియా వంటి సెలబ్రిటీలు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఏడు సార్లు ఐవీఎఫ్ ఫెయిల్.. కన్నీటి ప్రయాణం
ఈ సంతోషం వెనుక సంభావన ఎంతో శారీరక, మానసిక వేదనను అనుభవించారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో తన ఐవీఎఫ్ (IVF) జర్నీ గురించి చెబుతూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. సంతానం కోసం ఆమె ఏకంగా 7 సార్లు ఐవీఎఫ్ చేయించుకున్నారు.
ఈ ప్రక్రియలో ఆమెకు గర్భస్రావం కూడా అయింది. ఐవీఎఫ్ కోసం ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్ల వల్ల విపరీతంగా బరువు పెరగడమే కాకుండా, విపరీతమైన నొప్పిని భరించాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.
{{/usCountry}}ఈ ప్రక్రియలో ఆమెకు గర్భస్రావం కూడా అయింది. ఐవీఎఫ్ కోసం ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్ల వల్ల విపరీతంగా బరువు పెరగడమే కాకుండా, విపరీతమైన నొప్పిని భరించాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.
{{/usCountry}}పెళ్లికి ముందే ఆమె తన అండాలను (Eggs) ఫ్రీజ్ చేయించుకున్నప్పటికీ.. ఆ ప్రయత్నాలు ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అన్ని దారులు మూసుకుపోయిన తరుణంలో 'సరోగసీ' ద్వారా తల్లి కావాలని నిర్ణయించుకున్నారు.
డాన్స్ షోలో మొదలైన ప్రేమ కథ
సంభావన సేథ్, అవినాష్ ద్వివేదిల పరిచయం ఒక డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా మొదలైంది. 'డాన్స్ సంగ్రామ్' షోలో సంభావన జడ్జిగా ఉంటే, అవినాష్ కంటెస్టెంట్‌గా వచ్చారు. అక్కడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. సంభావన తల్లి మొదట్లో ఈ పెళ్లికి ఒప్పుకోకపోయినా, వీరి ప్రేమను చూసి చివరకు అంగీకరించారు. 2016లో వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.