...
...
Next Story

Jovika: అమ్మమ్మలాగే ఉన్నానని అంటున్నారు.. ఆమె ఉంటే ఆనందపడేది.. అగధ హీరోయిన్ జోవికా.. తన బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకే!

Jovika: అగధ అంటూ థియేటర్లలో ఆడియన్స్ ను భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు సీనియర్ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్న జోవికా విజయ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ఆమె తల్లిని పరిచయం చేసిన ఎంఎస్ రాజు ఇప్పుడు కూతురి డెబ్యూ మూవీ తీస్తున్నారు.

Published on: May 8, 2026, 12:27:30 IST
Advertisement

Jovika: తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి మరో వారసురాలు అడుగుపెట్టింది. మూడో తరం అమ్మాయి హీరోయిన్ గా డెబ్యూ చేస్తోంది. ఆ భామ పేరే.. జోవికా విజయ్ కుమార్. ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ ‘అగధ’ మూవీతో జోవికా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. ఆమె బ్యాక్ గ్రౌండ్ పై ఓ లుక్కేయండి.

మంజుల మనవరాలు

జోవికా విజయ్ కుమార్ (instagram)
జోవికా విజయ్ కుమార్ (instagram)

తెలుగులో అత్యంత ఆదరణ పొందిన సీనియర్ హీరోయిన్లలో మంజుల ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు లాంటి దిగ్గజాలతో మంజుల ఎన్నో సినిమాలు చేశారు. మగాడు, మనుషులంతా ఒక్కటే, నేరం నాది కాది ఆకలిది, దొరబాబు, బంగారు బొమ్మలు, మాయదారి మల్లిగాడు, మంచి మనుషులు తదితర సినిమాల్లో మంజుల నటించారు. ఆ మంజుల మనవరాలే ఈ జోవికా.

అమ్మ కూడా హీరోయిన్

జోవికా తల్లి వనిత విజయ్ కుమార్ కూడా ఒకప్పుడు హీరోయిన్. మంజుల కూతురైన వనిత విజయ్ కుమార్ ను ‘దేవి’ మూవీతో ఎంఎస్ రాజే పరిచయం చేశారు. ఆ సినిమాకు ఆయనే ప్రొడ్యూసర్. ఇప్పుడు ఆమె కూతురు జోవికా విజయ్ కుమార్ డెబ్యూ మూవీకి ఎంఎస్ రాజు డైరెక్టర్ కావడం విశేషం.

అమ్మమ్మలా ఉన్నానని

తాజాగా ‘అగధ’ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ టీజర్ అదిరిపోయింది. ఈ లాంఛింగ్ ఈవెంట్లో జోవికా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇది నా ఫస్ట్ ఫిల్మ్. తెలుగులో చేస్తున్నా. అందరూ పోస్టర్లు చూసి మంజుల మనవరాలు వచ్చిందని చెప్పారు. చాలా బాగున్నానని అన్నారు. మంజులలాగే ఉందని అన్నారు’’ అని జోవికా తెలిపింది.

అగధ గురించి

ఒకప్పుడు ప్రొడ్యూసర్ గా బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన ఎంఎస్ రాజు ఆ తర్వాత డైరెక్టర్ గా మారారు. ‘వాన’ మూవీతో తొలిసారి మెగా ఫోన్ పట్టిన ఆయన.. ఆ తర్వాత ‘తూనీగ తూనీగ’, ‘డర్టీ హరి’, ‘7 డేస్ 6 నైట్స్’ అంటూ యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీస్ తీశారు. ‘మళ్లీ పెళ్లి’తో ఓ ప్రయోగం చేశారు. ఇప్పుడు అగధ అంటూ ఫస్ట్ హారర్ థ్రిల్లర్ తీస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks