సంక్రాంతి 2026 సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు అన్ని వైపుల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. సోమవారం (జనవరి 12) రిలీజైన ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. మెగా కోడలు ఉపాసన కూడా తన మామయ్య చిరంజీవి సినిమాపై రివ్యూ ఇచ్చారు. మెగాస్టార్ యాక్టింగ్ కు ఫిదా అయ్యారు.
మెగా సంక్రాంతి

మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై మెగాస్టార్ ఫ్యాన్స్, ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. వింటేజీ లుక్ లో చిరంజీవి యాక్టింగ్ ఇరగదీశారని అంటున్నారు. చాలా కాలం తర్వాత చిరంజీవికి మంచి సినిమా పడిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరు కోడలు ఉపాసన కూడా మన శంకర వరప్రసాద్ గారకు మూవీకి ఇంప్రెస్ అయ్యారు. ఇది మెగా సంక్రాంతి అంటూ పోస్ట్ పెట్టారు. చిరు తనయుడు రామ్ చరణ్ భార్య ఉపాసన.
కంగ్రాచ్యులేషన్స్ మామయ్య
‘‘ఇది మెగా సంక్రాంతి. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ మామయ్య’’ అని ఎక్స్ లో ఉపాసన కొణిదెల పోస్టు చేశారు. చిరంజీవి, నయనతార, సుస్మిత కొణిదెలను ట్యాగ్ చేశారు. మన శంకర వరప్రసాద్ గారులో చిరు సిగరెట్ తాగుతూ స్టైల్ గా ఎంట్రీ ఇస్తున్న సీన్ వీడియోను ఉపాసన పోస్టు చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రొడ్యూసర్లలో చిరు కుమార్తె సుస్మిత కూడా ఒకరు.
బ్లాక్ బస్టర్ టాక్
మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. పక్కా పండగ సినిమా అని, సంక్రాంతి 2026 విన్నర్ అనే కామెంట్లు వస్తున్నాయి. పాజిటివ్ రివ్యూలతో ఈ మూవీ దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి డైరెక్టర్. ఇందులో చిరంజీవి, నయనతార, వెంకటేశ్, కేథరిన్ థెరిసా తదితరులు నటించారు. ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కలిసి నిర్మించారు.
మన శంకర వరప్రసాద్ గారు స్టోరీ
{{/usCountry}}మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. పక్కా పండగ సినిమా అని, సంక్రాంతి 2026 విన్నర్ అనే కామెంట్లు వస్తున్నాయి. పాజిటివ్ రివ్యూలతో ఈ మూవీ దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి డైరెక్టర్. ఇందులో చిరంజీవి, నయనతార, వెంకటేశ్, కేథరిన్ థెరిసా తదితరులు నటించారు. ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కలిసి నిర్మించారు.
మన శంకర వరప్రసాద్ గారు స్టోరీ
{{/usCountry}}మన శంకర వరప్రసాద్ గారు మూవీలో టైటిల్ లీడ్ ప్లే చేసిన చిరంజీవి ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నటించారు. కేంద్రమంత్రి సెక్యూరిటీ ఆయన చూసుకుంటారు. మరోవైపు శశిరేఖ (నయనతార)తో పెళ్లవుతుంది. కానీ భార్య, పిల్లలకు వరప్రసాద్ (చిరంజీవి) ఉండాల్సి వస్తుంది. మరి వీళ్లు విడిపోవడానికి కారణం ఎవరు? తిరిగి కలిశారా? లేదా? అన్నది మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చూడాల్సిందే.
ముఖ్యంగా వింటేజీ లుక్ లో చిరంజీవి కామెడీ, యాక్షన్, ఫైట్స్ చూడాలంటే మన శంకర వరప్రసాద్ గారు మూవీకి వెళ్లాల్సిందే.